సూక్షశరీర యానం: విశిష్టమైన సాధన, ప్రయోజనాలు మరియు ఆచరణా మార్గం

సూక్షశరీర యానం

సూక్షశరీర యానం..
మన భౌతిక శరీరం ఎలా ఉంటుందో దాన్ని ఆవరించుకునే ఒక తొడుగులా సూక్షశరీరం ఉంటుంది.ఇది యోగుల ధృష్టికే తప్ప మాములు కంటికి కనపడదు.జీవికి భౌతిక శరీరం చనిపోయిన సూక్షశరీరం నిలిచేఉండి ఆ సూక్షశరీరంతోనే మరో జన్మ తీసుకుంటుంది.సూక్ష్మ శరీరం ఉన్నంత కాలం కూడ జీవిత జననమరణ చ్రకం తప్పదు.సూక్షశరీరం కారణ శరీరాన్ని ఆదారం చేసుకుంటుంది.ఆధునిక మనిషి కంటికి కనపడని ఏ విషయాన్ని నమ్మని పరిస్థితుల్లో భౌతిక శరీరాన్ని విడిచి పెట్టి సూక్షశరీరం ద్వార ఎక్కడెక్కడో తిరిగిరావచ్చు అంటే నమ్మడం చాల కష్టం.
సరైన హేతువాదం అంటే దేన్ని నమ్మకపోవడం కాదు.ఒక విషయం నిరూపణకు సిద్దంగా ఉన్నప్పుడు కూడా దాన్ని పరిశోధించిక ఊరికే కొట్టిపడేయడం సరైన హేతువాదం అనిపించుకోదు. ప్రతి ఒక్కరు సాధన ద్వార తమ తమ భౌతిక శరీరాలను వదిలిపెట్టి సూక్ష శరీర యానం చేయవచ్చు అనేది వాస్తవం.
మీలో నిజమైన పట్టుదల ఉంటే మీరే స్వయంగా పరిక్షించుకుని చూడండి.కాని సాధనకు ముందే ఒకే విషయం గుర్తుంచుకోండి.ఒక బ్రిడ్జ్ కట్టడానికి ఇంజనీర్ కోర్సు,ఒక రోగి శరీరాన్ని కొసి పరిక్షించడానికి మెడిసిన్ కోర్సు ఎలాగైతే ఓ నాలుగేళ్ళు చదివి,సాధనచేసి మాత్రమే అందులో ఉత్తీర్ణులవుతున్నారో ,అలాగే ఈ సూక్ష్మ శరీర ప్రయాణానికి తగిన కాల వ్యవది సాధన కోసం వెచ్చించాల్సి వస్తుంది.ఎంతకాలం అనేది మీ యోగ్యత,నమ్మకం,సాధన మీద ఆధారపడి ఉంటుంది.
సాధన : ముందుగా అసలు సూక్షశరీర యానం అనగానే మీకో ఆలోచన వచ్చి ఉంటుంది. మీ ఆలోచన ప్రవాహం మీకో నమ్మకాన్ని ఏర్పరిచి మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళుతుంది.మీకా నమ్మకం లేకుంటే ఇక్కడి వరకు చదువుకుంటూ వచ్చేవారే కాదు. కాబట్టి అసలు ఆలోచన గురించి ఆలోచించండి. ఆలోచనను ఎక్కడ ఉండాలని మీరు కోరుకుంటారో ,అది అక్కడే ఉంటుంది.
మీ ఆలోచనను సూక్షశరీరయానం మీద పెట్టండి.
ఇక సాధన మొదలు పెట్టండి.ముందు ఎవరు ఎలాంటి విఘ్నాలు కల్గించని ఏకాంత ప్రదేశం చూసుకుని ఒంటరిగా బెడ్ రూమ్ లో పడుకోండి.మీరు సూక్షశరీర యానం చేయగలరు అని సంపూర్ణంగా ముందుగా నమ్మకం ఏర్పరుచుకోండి.ఎంతో అద్భుతమైన సూక్షశరీరయానానికి మీరు సిద్దపడుతున్నందుకు టెన్షన్ పడకుండా పూర్తి విశ్రాంతిగా మంచం మీద పడుకుని కళ్ళుమూసుకుని సేదతీరండి.మీ ఆలోచననను ఇక ఒక విషయం మీద పూర్తిగా కేంద్రీకరించండి.మీ భౌతిక శరీరం నుండి సూక్ష్మంగా ఉన్న మరో శరీరం విడిపడుతున్నట్ల పూర్తి ద్యాసను అక్కడే ఉంచి ఆలోచించండి.మీకు ఆ ఆలోచన తప్ప ఇంకో ఆలోచన ఏది మీ మనసులో రాకూడదు.మీ ధ్యాసను అక్కడే ఉంచి మీరు నెమ్మదిగా సూక్షశరీరం ద్వార బయటపడుతున్నట్లు ఆలోచిస్తూనే ఉండండి.అసలు ఇలా సూక్షశరీరయానం సాధ్యమేనా కాదా,ఇది ఊరికే టైమ్ వేస్ట్ ప్రయోగం అని,రోజులో జరిగిన మరేవో ఆలోచనలు మిమ్మల్ని పక్కదారి పట్టిస్తుంటాయి. పట్టువదలని విక్రమార్కునిలా మాటిమాటికి మీ ఆలోచనలు పక్కదారిలో వెళ్ళిన మీ అసలు లక్ష్యంపైనే కేంద్రీకరించండి. నిముషాలు గడుస్తూనే ఉంటాయి.మీలో నుండి ఎలాంటి సూక్షశరీరం బయట పడడంలేదని అప్పుడే నిరాశ పుట్టిందా? మీ సాధనలో కెల్లా అతిముఖ్యమైన అవరోధం ఇదే..ఓ కరాటే,కుంగ్ ఫూ,బాక్సింగ్ లాంటి సాధనలు చేస్తుండగా మీరెప్పుడైనా చూసారా.శరీరం హూనం అవుతుంటుంది.ఒంట్లో చమట దారలై కారిపోతుంటుంది.శరీరంలో నొప్పులు పెచ్చరిల్లుతుంటాయి.ఊపిరితిత్తులు కొలుములై మండుతుంటాయి.బతికుంటే బలుసాకు తినవచ్చు ఈ సాధన ఇంతటితో ఆపేద్దాం అనిపిస్తుంది. అలా ఓ నాలుగేళ్ళు సాధన చేసి శరీరం వజ్రకాయమైతే తప్ప ఓ బ్లాక్ బెల్ట్ స్థాయికి చేరుకుంటాం.
అలాంటి సాధనతో పోలిస్తే ఈ సూక్షశరీరయాన సాధన ఎంతో సులభం..కావల్సిన మొదటి అర్హత అల్లా విసుగేసి మద్యలోనే వదిలిపెట్టకుండా ఉండడం..ఇది చదివిన వాళ్ళు నూటికి 90 శాతం మంది ఇలా చదివి ఓహో మనిషికి సూక్షశరీరం అనేది కూడా ఒకటుందా…దాంతో భౌతిక శరీరాన్ని వీడి ప్రయాణం కూడా చేయవచ్చా అని అలా చదివి ఇలా ఊరుకుంటారు,తరువాత ఎప్పడో సాధన చేద్దామని(ఆ తరువాత అనేది ఎన్నేళ్ళు గడిచాక కూడా అలాగే ఉండడం వారినే ఆశ్చర్యపరుస్తుంది).మిగిలిన పదిశాతం సాధన మొదలు పెట్టి దాంట్లో 8 శాతం ఒకటి రెండు రోజుల్లోనే ఆ విషయమే మరిచిపోతుంటారు.మిగిలిన 2 శాతం మాత్రమే సీరియస్ గా సాధనచేస్తారు.వారిలో 1శాతం తొందరలోనే సూక్షశరీర ప్రయాణం చేసే స్థితి ఖచ్చితంగా వస్తుంది.మిగితా 1 శాతంకు కాల పరిపక్వత మీద సిద్దిస్తుంది.
ఇంకో నమ్మలేని నిజం ఏమంటే మీరంతా సూక్షశరీరయానం చేసిన చేయకున్న ప్రతి ఒక్కరు సూక్షశరీర స్పర్శను,అనుభూతిని ఏదో ఒకనాడు పొందినవారే.ఎలాగంటారా? మీరు నిద్రపోతున్నప్పుడు మీకు ఉన్నట్లుండి ఒళ్ళంతా జలదరించినట్లు శరీరం ఉలిక్కిపడడం ఎన్నడో ఒకరోజు అనుభూతి చెందే ఉంటారు.అదే సందేహం లేకుండా సూక్షశరీర అనుభూతే. మీరు నిద్రపొతున్నప్పుడు మీ భౌతిక శరీరం నుండి విడిబడి బయటపడడానికో ,సర్ధకుపోవడానికో సూక్షశరీరం చేసే ప్రయత్నమే ఒళ్ళ జలదరించే అనుభూతి.మరొక వాస్తవం మనం కలలు అని చెప్పుకునేవి సూక్షశరీర ప్రయాణాలే. మీరు చేసే సూక్షశరీర ప్రయాణాలు మొదట్లో నిద్రపోయిన తరువాత జరుగుతాయి.కాని కలకు సూక్షశరీర ప్రయాణానికి మీకు సృష్టమైన తేడా తెలుస్తుంది.మీరు సాధనలో అత్యున్నత స్థితికి చేరినప్పుడు భౌతికి శరీరం సృహలో ఉండగానే మీరు సూక్ష శరీర ప్రయాణం చేయగలుగుతారు.
మీరు సాధన చేస్తున్నప్పడు కూడా ఇలాగే మీ భౌతిక శరీరం నుండి సూక్షశరీరం బయటపడే సమయంలో ఓ కుదుపు ఏర్పడుతుంది.అదే లక్ష్యంగా సాధనపెట్టుకుని సాధన మొదలు పెట్టండి.

మీ సాధన పలించిన రోజున మీకు సూక్షశరీర ప్రయాణం చేసే శక్తి వచ్చింది.ఆ తరువాత ఏం జరుగుతుంది?మీ శరీరం నుండి మీరు బయటపడి తలతిప్పి పక్కకు చూస్తే ఒక్క సారిగి భయపడేంతా పని జరుగుతుంది. మీ భౌతిక శరీరాన్ని అద్దంలో నుండి చూసినట్లుగా కాకుండా మరోకరిగా మిమ్మల్ని మీరే ఓ కళేబరంలా మీరు మొదటి సారిగా చూడడం నిజంగా భయపడే విషయమే.మీ జీవితంలో ఏనాటికి నమ్మలేని విషయాన్ని మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు,కాబట్టి నమ్మక తప్పదు.కాని భయపడితే మాత్రం మీరు ఎంతో సాధనతోని పొందిన సూక్షశరీరం వెంటనే మీ భౌతిక శరీరంలో దూరిపోతుంది.బయపడకుండా ముందే సిద్దంగా ఉండండి.మీ సాధన స్థిరత్వం పొందిన తరువాత,మీరు ఏ రోజు కావాలంటే ఆరోజు సూక్షశరీరంతో బయటకు వచ్చిన రోజున చిన్నగా బయట విహరించడం మొదలుపెట్టండి.ఆస్ర్టోనాట్లు అంతరిక్షంలోకి వెళ్ళిన తరువాత భారరహిత స్థితిని పొందినట్లు మీ సూక్షశరీరం కూడా భార రహిత స్థితలోనే ఉంటుంది.మీ భౌతిక శరీరాన్ని వదిలి మీరున్న గదిలో అటు ఇటు కదలడం మొదలుపెట్టండి.మీ శరీరం నుండి సూక్షశరీరంగా బయటపడితే మీ భౌతిక శరీరం ఓ మృత శరీరంలా కనపడవచ్చు.కాని అది సజీవమే.మీ భౌతిక శరీరం,సూక్షశరీరం అనుసంధానంగా ఓ సిల్వర్ కార్డ్ నిరంతరం లింక్ గా ఉంటుంది. ఈ సిల్వర్ కార్డ్ అనుసంధానంగా మీరు సూక్షశరీరంతో ఎంత దూరాలైనా వెళ్ళవచ్చును.
మీరు గదిలోనుండి అటు ఇటు భార రహిత స్థితిలో ఎగరండి.మీ గదిలోని వస్తువులని ముట్టకోండి.మీకు విశ్వాసం పెరిగిన రోజున గది నుండి బయట ప్రపంచంలో అడుగుపెట్టండి.బయటి భౌతిక ప్రపంచంలో మాదిరిగానే కనపడుతుంది.మరికొన్ని ఉజ్వల కాంతులు దర్శనమిస్తాయి.ఇంటి చుట్టుపక్కలా ,పక్కవీదీలోకి,పక్క ఊళ్ళోకి వెళ్ళివస్తూ ఉండండి..క్రమంగా మరింత దూర దూరాలకు వెళుగలుగుతారు.
హాలివుడ్ సినిమా ‘హాలోమాన్’లో మాదిరిగా ఎవరికి కనపడకుండా ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు.కాని సినిమాలోని ఇన్విసబుల్ మాన్ కు మాదిరి ఆలోచనలు మీకుంటే మీరు సూక్షశరీర యానం ఏనాటికి చేయలేరు.మీ మనసు పసిపాపలా శుద్దమైనప్పుడే మీకా అర్హత పరమాత్మ కలిపిస్తాడు.
మీరు సూక్షశరీరంతో ప్రయాణాలు మొదలుపెట్టినప్పుడు,ఎల్లలెరుగని,రోడ్లు,భవనాల దగ్గరకు,
పాస్ పోర్టు ,వీసా అవసరం లేని అంతర్జాతీయ ప్రయాణాలకు,సముద్రాలు,ఆకాశంమీదకు తిరిగిరావచ్చు.మీ స్నేహితుల్ని,బంధువుల్ని,మీ ప్రియమైన వారిని చూసి రావచ్చు.సూక్షలోకాల్లో ఎక్కడెక్కడో విహారించి రావచ్చు. మీరు ఎక్కడెక్కడికి ఎంతెంత దూరలకు పోయినా మీ సూక్షశరీరాన్ని భౌతిక శరీరంతో అనుసంధానించే సిల్వర్ కార్డ్ వెండితీగలా సాగుతూ వస్తునే ఉంటుంది.వెనుకటి రోజుల్లో ఈ సూక్షశరీర ప్రయాణాలు అందరు చేయగలిగే శక్తితో ఉండేవారు.కాని ఆ శక్తిని దుర్వినియోగం చేయడం వలన ,మనుషుల నుండి ఆ శక్తులు ఉపసంహరించుకోబడ్డాయి…మీరు ఒక సారి సూక్షశరీర ప్రయాణం చేయడం మొదలు పెడితే మీకు అన్ని విషయాలు అవే అర్థం అవుతాయి.
ఇంకా ఆలస్యం ఎందుకు ఒక శుభ ముహూర్తం చూసుకుని , ఈ సాధన మొదలుపెట్టండి. దీనిని దశల వారిగా ఏలా సాధన చేయాలో చూద్దాము.

సూక్ష్మశరీర యానం (Astral Projection) ఒక సున్నితమైన, లోతైన ఆధ్యాత్మిక ప్రక్రియ. ఇది కేవలం శారీరక లేదా మానసిక సాధన కాదు, ఇది ఆత్మచైతన్యంతో సంబంధం కలిగినది. మన రోజువారీ జీవితంలో మన చైతన్యం శరీరంతో పరిమితమై ఉంటుంది. కానీ ఈ సాధన ద్వారా మనం ఈ పరిమితిని అధిగమించి మన ఆత్మను గమ్యానికి తీసుకువెళ్లగలుగుతాం. 

 

1. మానసిక సన్నద్ధత

సూక్ష్మశరీర యానం చేయాలంటే మొదట మన మైండ్ పూర్తిగా సిద్ధంగా ఉండాలి. కొన్ని ప్రధాన బలహీనతల్ని దూరం చేయాలి:

భయం తొలగించుకోండి

భయం మన మనస్సు సృష్టించిన అడ్డంకి మాత్రమే. ఈ సాధనలో ఏ విధమైన భయాలకు కూడా స్థానం ఉండకూడదు. భయం వల్ల:

     

      • మనం మధ్యలో ఆగిపోతాం.

      • లోతైన స్థితిని చేరలేము.

    సూక్ష్మశరీర యానం అంటే ఏమిటో అవగాహన

       

        • ఇది ప్రాకృతికం.

        • శరీరం, మనస్సు, చైతన్యం మధ్య సంబంధాన్ని మెరుగుపరచే సాధన మాత్రమే.

        • ఇది కల్పితమైనది కాదు. ఇది శాస్త్రీయంగా పరిశోధన చేసిన ఒక సత్యం.


      2. శాంతమైన ప్రదేశం

      సూక్ష్మశరీర యానం కోసం శాంతమైన, ప్రశాంతమైన ప్రదేశం అవసరం. అక్కడ:

         

          • ఎలాంటి శబ్దాలు లేకపోవాలి.

          • చీకటిగా లేదా మైదానంగా ఉండటం మంచిది.

        సమయం

           

            • తెల్లవారుజామున (4 AM – 6 AM) ఉత్తమ సమయం.

            • మనసు ప్రశాంతంగా ఉండే సమయాన్ని ఎంచుకోవాలి.

          శరీర స్థానం

             

              • పట్టుదల కలిగిన విధంగా శరీరాన్ని ఉంచడం ముఖ్యం.
                ఉదాహరణకు:

              • పడుకున్న స్థితి (కాన్పించింది శరీరాన్ని తేలికపాటి కోణంలో ఉంచండి).

              • సుఖాసనంలో కూర్చోవడం.


            3. శరీర సాధన

            శ్వాస నియంత్రణ

            శ్వాస అనేది ప్రాణశక్తి. శ్వాస సరిగ్గా ఉండాలంటే:

               

                1. క్రమంగా లోతైన శ్వాస తీసుకోవాలి.

                1. శ్వాసను వీలైనంత వరకు నిలిపి ఉంచి, బలంగా బయటకు వదలండి.

                1. దీన్ని పదే పదే చేయడం ద్వారా మనసు ప్రశాంతమవుతుంది.

              మొత్తం శరీరాన్ని సడలించుట

                 

                  • కళ్ళు మూసుకొని శరీరం మొత్తం సడలించండి.

                  • ప్రతి భాగాన్ని ఒకొకటిగా శాంతపరచండి:

                  • తల

                  • చెవులు

                  • చేతులు

                  • పొట్ట

                  • కాళ్ళు

                  • దృశ్యీకరణ (Visualization): మీ శరీరం ఒక అందమైన వెలుగుతో నిండినట్లుగా ఊహించండి.


                4. ధ్యానం ద్వారా చైతన్యాన్ని మేల్కొల్పడం

                ధ్యానం అనేది ఈ సాధనలో ప్రధానమైన భాగం.

                మంత్రాలు లేదా శబ్దం

                   

                    • “ఓం” మంత్రాన్ని జపించడం ఉత్తమం.

                    • కొన్ని సందర్భాలలో ఇతర శబ్దాలు లేదా సంగీతాన్ని ఉపయోగించవచ్చు (బిన్నౌరల్ బీట్స్ వంటివి).

                  ఏకాగ్రత సాధన

                     

                      • దృష్టిని మధ్యమణిపై (మూడవ కన్ను) ఉంచండి.

                      • మధ్యలో ఏ ఆలోచన వచ్చినా దాన్ని వదిలేయండి.


                    5. సూక్ష్మశరీర వేరుపడటం( ఈ అనుభవాలు ఒక్కోక్కరికి ఒక్కో రకంగా ఉండవచ్చును.)

                    ధ్యానం లోతుగా వెళ్లినప్పుడు, మీ శరీరం నుండి చైతన్యం వేరుపడినట్లుగా అనిపిస్తుంది. ఇది:

                       

                        1. తేలికగా భ్రమిస్తున్నట్లు అనిపిస్తుంది.

                        1. శరీరం నిశ్చలంగా ఉంటుంది, కానీ మీరు చైతన్యంతో బయటకు వెళ్ళినట్లు భావిస్తారు.

                      మొదటి అనుభవం సమయంలో:

                         

                          • ఒక ప్రకాశవంతమైన వెలుగు కనిపించవచ్చు.

                          • శరీరం భూమికి అంటిపెట్టుకుని, చైతన్యం ఒక బల్కంగా పైకి వెళ్ళినట్లు అనిపిస్తుంది.

                          • కొన్ని సందర్భాలలో శరీరాన్ని పై నుంచి చూస్తున్నట్లు అనిపించవచ్చు.


                        6. స్వేచ్ఛతో ప్రయాణం

                        మీరు ఈ స్థితిలోకి వచ్చినప్పుడు మీ చైతన్యాన్ని ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి దారితీయవచ్చు:

                           

                            • మీ గమ్యస్థానం ప్రదేశాన్ని స్పష్టంగా ఊహించండి.

                            • అది ఒక స్వప్నమని భావించకుండా దాన్ని స్వాగతించండి.


                          7. సాధన ముగింపు

                          సాధన తర్వాత:

                             

                              1. మెల్లగా సాధారణ స్థితిలోకి రండి.

                              1. మీ శ్వాసపై దృష్టి పెట్టి శరీర చైతన్యాన్ని మళ్లీ కలుపుకోండి.

                              1. మీ అనుభవాలను రాసుకొనడం చాలా ముఖ్యం.


                            8. సాధనలో ఎదురయ్యే అవరోధాలు

                            భయాలు మరియు అపోహలు

                               

                                • సాధన సమయంలో ఏదైనా అరుదైన అనుభవం ఎదురైతే భయపడకండి.

                                • ఇది మీ చైతన్య పరిణామం మాత్రమే.

                              ఏకాగ్రత కొరత

                                 

                                  • ధ్యానం చేయడం కొంతకాలం పటిష్ఠంగా అవసరం.

                                  • శరీరాన్ని పూర్తిగా సడలించలేకపోతే, సాధన ఫలితాలు రావు.


                                9. ఈ సాధనకు సంబంధించిన దైవిక సహాయం

                                   

                                    • గురువు శక్తి లేదా ఆధ్యాత్మిక మార్గదర్శకుడి హితబోధ ఎంతో కీలకం.

                                    • మాస్టర్ సీవీవీ పద్ధతుల్లో ఈ రకమైన ప్రక్రియలకు విశేష ప్రాధాన్యత ఉంది.


                                  10. సుదీర్ఘ ప్రయోజనాలు

                                     

                                      • ఆత్మ చైతన్యం పెరుగుతుంది.

                                      • భౌతిక మరియు ఆధ్యాత్మిక జీవన మధ్య సమతుల్యత ఉంటుంది.

                                      • లోతైన ప్రశాంతత మరియు ఆనందాన్ని అనుభవించగలుగుతారు.


                                    Author: