సంకల్పాలు – న్యూరాన్లు.

human-brain-neurons

సంకల్పాలు vs న్యూరాన్లు..

1)మనిషి అవసరాలు,కోరికలు అతన్ని కొత్త ప్రపంచంలోకి తోసివేసి,అక్కడ జీవించాల్సిన పరిస్థితిని ఏర్పరుస్తాయి.

2)సంకల్పశక్తితో కోరికలు నెరవేరడం అనేది అణువుల అసంపూర్ణ బాహ్య కక్షల్లో ఎలక్ట్రాన్స్ మార్పిడి లాంటివే.

3)వ్యక్తులమధ్య,వ్యవస్థమధ్య,దేశాలమధ్య ఉండే సార్వత్రిక నియమం నీ కక్ష్యలో నాకు స్థానమిస్తే,నా కక్షలో నీకిస్తాననే.

4)సంకల్పశక్తితో కోరికలు నెరవేరడం అనేది అందమైన భ్రమ.పక్కవారి కక్షల్లో ఉండే ఖాళి పైనే అది అధారపడి ఉంటుంది.(సంభావ్యత సిద్ధాంతం ప్రకారం కొందరి ప్రయత్నాలు మాత్రమే పలిస్తుంటాయి.)

5)అన్ని సంబంధాలు కక్షల మార్పిడిలే. వ్యక్తులు,సంస్థలు, దేశాలకైనా ఓకే సార్వాత్రిక నియమం.మీ అవసరం మాకుంది,

మా అవసరం మీకుంది కాబట్టి మనం మంచి స్నేహితులం.ఖాళీగా ఉన్న కక్షల పూరింపు కార్యక్రమమే అన్ని సంఘటనలు.

           ……… మన ప్రమేయం లేకుండానే సంఘటనలు జరుగడం,డీప్ గా చూస్తే..అర్థ మయ్యేది….ప్రిడేటర్స్ (Predators-2010) సినిమాలో జరిగే విషయమే…అనిపిస్తుంది.

వికి లింక్(https://en.wikipedia.org/wiki/Predators_(film)

ట్రైలర్.

https://www.youtube.com/watch?v=_NYMKrbPiP0

లేదా జుమాన్ జి సినిమాలోని మాదిరే మన జీవితాలు అనిపిస్తాయి.

 Jumanji (1995)

        ..మనిషి మెదడులో సగటున 10వేల కోట్ల న్యూరన్స్….ప్రపంచంలో 800 కోట్ల జనాభ…10వేల కోట్లు x 800 కోట్ల న్యూరాన్స్…

నవ గ్రహాలు…గ్రహాలు అంటే భౌతిక ఆకారం మాత్రమే కాదు..వాటిని నడిపించే ఆత్మ శరీరాలు వేరు.పంచ బౌతిక మైన మనిషి శరీరంలో నవగ్రహాలే కాదు, డీప్ గా వెళితే సకల స్రుష్టి దాగిఉంది. కాని దాని స్రుహే మనకు సాదారణంగా ఉండదు..

      ఒక సెంట్రల్ సర్వర్ …దేవుడని దానికి పేరుపెట్టుకున్నా , సూపర్ పవర్ అని పేరు పెట్టకున్నా ఏదైతేనేం ఇన్ని లక్షల కోట్ల న్యూరన్స్ ను ఒకే సెంట్రల్ సర్వర్ నుండి నడిపిస్తుంది..

       ఒకరికి ఒక సమయంలో ఒక ఆలోచన వచ్చి ఒక పనిచేద్దా మని కోరిక పుట్టిందంటే ఆ న్యూరాన్ల కంక్లూషనే మనకు ఒక ఆలోచనగా తోచి, మన నిర్ణయంగా అములు పరుస్తాం..

    అది సరైనదా కాదా తరువాత కాలం లో తేలిపోతుంది.వ్యక్తుల స్వీయ ఎంపిక స్వేచ్చకంటే ఇక్కడే మన ప్రమేయం లేకుండానే సెంట్రల్ సర్వర్ వ్యవస్థ ద్వారా అందరి న్యూరాన్స్ నియంత్రించబడి , ఆయా పనుల్లో సంఘటనల్లో వారిని పాల్గొనాలనే నిర్ణయానికి వచ్చేలా చేస్తున్నాయి.మొన్న మీకు చెప్పిన నాలుగు దారుల్లో చివరకు మీరే అప్పుతెచ్చి పెట్టుబడి పెట్టి సినిమా తీద్దామనుకోవడంలో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది..అది చివరకు మంచి గా పరిణమించవచ్చు.చెడుగా కూడా పరిణమించవచ్చు.

     మన స్వీయ  ఎంపిక స్వేచ్చకంటే ఇక్కడే ప్రిడేటర్స్, జుమాన్ జీ సినిమాలో పాత్ర దారుల మాదిరిగా ఆ గేమ్ తప్పని సరిగా ఆడాలనే పరిస్థితుల్లో మీది నాది అందరి మనుషుల జీవితాలు ఇరుక్కు పోతున్నాయి. (కొందరికి ఆర్ధిక బాధల రూపంలో, మరికొందరికి రోగం రూపంలో, మరికొందరికి ఆక్సిడెంట్స్ రూపంలో) లేదంటే ఏ పాపం ఎరుగని ఒక మిత్రుడు బస్ లో కండక్టర్ డ్యూటి చేస్తూ ఆగి ఉన్న ఐరన్ లోడ్ లారి గుద్దడంతో ఆక్సిడెంట్ కాలు బీభత్సంగా ఫాక్షర్ అయ్యి 6నెలలు నరకం అనుభవించాడు…

      ఒకరు సంకల్పంతో గొప్ప పని సాధించాడు అనే దాంట్లో కూడా అర్ధ సత్యమే దాగి ఉంది.

        అతను సాధించడానికి కూడా సెంట్రల్ సర్వర్ ద్వారా విడిగా ఒక వ్యక్తి యొక్క న్యూరాన్స్ మరింత పవర్ ఫుల్ గా పనిచేసి అతను విజయం సాధించే పరిస్థితులను ఏర్పరుస్తున్నాయి .

Author: