సేత్ టీచింగ్ లో వాస్తవం ఎంత?
సేత్ టీచింగ్ ఎంత సేపు తిరిగేసి చదివినా రిపిటేడ్ మ్యాటర్ గా, పోయేట్రిగా మాత్రమే ఎందుకు నడుస్తుంది? నీవాస్తవానికి నువ్వే స్రుష్టికర్తవుఅని చానెలింగ్ ద్వారా సేత్ కొత్తగా చెప్పడానికి ఊళ్లో ఎలాంటి చదువ సంధ్యలు లేని పామరుడు నిత్యం చెప్పే ’’ఎవడి ఖర్మకు వాడే భాధ్యుడు‘‘ అనేదానికి పెద్ద తేడా ఏముంది?
ఆ పామరుడు కూడా తన శక్తిమేరకు విన్నది,ఊహించింది కలపి,భూమికి కింద ఏడులోకాలు, పైన ఏడులోకాలు ఉన్నాయటఅని పక్కవాడికి చెపుతాడు.
సేత్ తన స్పీచ్ లలో ఎన్నో సార్లు పాడిందే పాటగా కోటాను కోట్ల లోకాలు,జీవరాశులు అని ఊదరగొట్టే బదులు సైంటిఫిగ్గా ఒక లోకం గురించి ఎందుకు ఇంతవరకు చెప్పలేదు? మనుషులు పంపించిన వాయేజర్ 1,2లు సౌరమండలాన్ని దాటేసి, ఇంటర్ మాగ్నటిక్ ఫీల్డ్ కూడా దాటేసిఅనంత దూరాలకు పయనమవుతున్నాయి. సూర్యుడి తరువాత మనకు అతి దగ్గరగా ఉన్న ప్రాగ్జిమ సెంటరై చేరుకోవడానికే బోలడెన్ని ఏళ్ళు(కాంతివేగంతో పయనించిన4.5 సం.లు) పట్టే ఈపయనానికి శాస్ర్తవేత్తలు ,ప్రజలు ఎంతో ఆసక్తిగా తదుపరి రిజల్ట్ కోసం చూస్తున్నారు కదా?
ఇంత సులభంగా సేత మహాశయుడు పామరుడికి అడ్వాన్సుడిగా కోటానుకోట్ల లోకాలు అని ఊరికే చెప్పేబదులు, ఏనక్ష్త్రత్రం చుట్టు తిరిగే ఏ గ్రహంలో ఎలాంటి జీవం ఉంది, ఆ జీవరాశి ధర్మాలు,జీవన విధాలు,వారి సత్యాలు ఎందుకు కట్టే , కొట్టే తెచ్చే అనే స్థాయిలో ఇంతవరకు చెప్పలేదు.
ఖగోళశాస్ర్తవేత్తల దగ్గర దాదాపు కొన్ని బిలియన్ కాంతి సంవత్సరాల దూరం వరకు ఉన్న నక్షత్రాలు,ఇతర పాలపుంతల వివరాలు, అలాగే నూతనంగా కనుకొన్న ఇతర నక్షత్రాల ఉన్న గ్రహాల గురించి క్లియర్ గా వివరాలు ఉన్నాయి. కనీసం జెమ్స్ కెమెరూన్ అటువంటిది అవతార్ సినిమాలో
పండోరా గ్రహం గురించి అధ్బుతంగా వీజువల్ రూపంగా ప్రజలందరికి చూపించాడు, ఒక్క అర్జునుడికి మాత్రమే శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించాడు. అదేమాదిరిగా ప్రజలందరికి సేత్ గా ఇప్పటి వరకు నమ్మశక్యంగాని విషయాలు జెన్ రాబర్ట్ ద్వారా చెప్పాడు.. జెన్ రాబర్ట్ మరణం తరువాత సేత్ చానెలింగ్ ఆగిపోయిందా ? వేరేవారి ద్వారా కొనసాగుతుందా? నా బాధల్లా సేత్ మహాశయుడు ఎందుకు సైంటిఫిక్ గా లెక్కలతో సహా చెప్పలేదు?
గతం లేదు భవిష్యత్తు లేదు వర్తమానం లేదు కాలం అంతా ఒట్టి భ్రమ అంటాడు సేత్ మాష్టర్…అన్ని జన్మలు ఒక్కసారే సంభవిస్తున్నాయి అంటాడు..మరి ఈ జన్మలో కూడా సేత్ ఉనికి ఉండవచ్చు కదా…జెన్ రాబర్ట్ శరీరంద్వారా చానెలింగ్ ఎందుకు?
సెత్ చెప్పేది మీ వాస్తవానికి మీరే కారణం అని చెప్పడం ఎలా ఉంటుందంటే, బైబిల్ కథమాదరిగా ఆడమ్ మరియు ఈవ్ లకు దేవుడు చెప్పినట్లు తోెటలో పళ్ళన్ని తినండి కాని ఆ చెట్టు పండు తినవద్దు అంటాడు..ఇక అక్కడి నుండి పోరాటం మొదలు..ఆచెట్టు పండే ఎందుకు తినవద్దన్నాడని దానికై ఇక మొత్తం ఆరాటం అంతా నడుస్తుంది..నీవు ఏం అనుకుంటే అది అవుతావు అని చెప్పి నెగటీవ్ ఆలోచన రానివ్వకు , అదే వాస్తవ రూపం దాలుస్తుందంటే అమాట విన్నప్పటి నుండి ఇక బాధ మొదలు..నెగటీవ్ ఆలోచన వద్దన్న రాకుండా పోదు.. కాల ప్రమేయం లేకుండా ఆలోచనలు వాస్తవ రూపం పొందుతాయి అని చెప్పుతాడు సంతోషం..మరి పలానది ఎందుకు వాస్తవరూపం చెందలేదు అంటే మరేలోకంలోననో అది వాస్తవ రూపం దాలుస్తుంది అంటాడు.. గొప్ప పలాయన వాదం అనాలా? ఆలోకాలు ఈ 3కొలతల భూభౌతిర ప్రపంచం అర్థం చేసుకునే మైళ్ళు, కాంతి దూరాల ప్రకారం సాంపిల్ గాకనీసం ఒక్కటన్నా ఎక్కడుందో చెప్పలేదనే కదా ఇంత పెద్ద ఆరోపణ …
ఐన్ స్టీన్ విశ్వం సైజు గురించి వివరణ ఇస్తూ విశ్వం అపరిమితం కాదు, పరిమితం కాకపోతే తనమీదకు తాను వంపు తిరిగి మూసుకుపోతుంది, ఆ వంపు ఎంత ఉంటుందో ప్రత్యక్షంగా చూడాలనుకుంటే పెద్ద నక్షత్రాల దగ్గరనుండి వచ్చే కాంతి సూర్యుడి పక్కన ఎంత వంపుతిరుగుతుందో, సంపూర్ణ సూర్యగ్రహణం రోజున భూమిమీద నుండి స్వయంగా కొలత వేసి లెక్కవేయవచ్చు , డౌట్ ఉంటే చెక్ చేసుకోండి అన్నాుడు(1916లో)..మూడు సంవత్సరాల తరువాత(1919లో) వచ్చిన సూర్యగ్రహణం తరువాత చెక్ చేస్తే ఏదో కాసింత తేడా తప్పితే సరిగ్గా ఐన్ స్టీన్ ఇచ్చిన లెక్కకు సరిపోయింది..( 1.75సెకన్లు లెక్కేస్తే, వాస్తంగా 1.63 సెకన్లు లెక్క తేలింది.)అలా ఐన్ స్టీస్ విశ్వానికి అద్యంతాలు లేవు కాని అది పరిమితం,తనమీదకు తానే వంపు తిరిగి మూసకుపోతుంది అన్నది చాలెంజిగా నిరూపించాడు. అలాగే కాలం అనేది , చలనం అనేది, స్తబ్దత అేది ఏది కూడా కేవలం (అబ్సల్యూట్ )కాదు. అన్ని మరోకదాని సాపెక్షంగా పోల్చిమాత్రమే అర్థం చేసుకోవాలని ఇచ్చిన ప్రతి వివరణ ఫర్ ఫెక్ట్ గా ఉంటుంది.. మరి సేత్ మహాశయుడు స్థలం కాలం,యుగాలు, మల్టి డైమెన్సన్ లెక్కలు చెప్పేడు ఎంతసేపు వాటిని కవిత్వంలా చెప్పేకంటే ఐన్ స్టీన్ లా సూటిగా చెపితే బాగుంటుంది.సేత్ మాష్టర్ ను .నాతో మాట్లడమనండి,నాకు అర్థం అయ్యేలా చెప్పమనండి వీటన్నింటిని..ఈ భూమి మీద ఉన్నవారికి అర్థం అయ్యే భూభౌతిక 3డైమన్షన్ లెక్కల ప్రకారం అందరికి అర్థం అయ్యేలా వివరిసిస్తాను, ఎక్కడ నస లేకుండా, చెప్పిందే ఛెప్పకుండా సూటిగా వివరిస్తాను..అధ్యాత్మికం లో ఉన్న పెద్ద పలాయన వాదం ఏమంటే నిరూపణ టాపికి్ వచ్చే సరికి అడిగే వాడికి అర్వత లేదనో,వాటిని చూపించడానికి వీలు కాదనో తప్పించుకోవడం..ఏందుకు ఈ దురావస్థ…ఈ దురావస్థ కారణంగానే రోజురోజుకు పాపభీతిలేకుండా , ఇతరులను ఇబ్బంది పెడుతూ (ఒక సాపేక్షంగా..) అధిక శాతం జీవిస్తున్నారు..
చెప్పడం ఎంత సూటిగా ఉండాలంటే…. మనిషికి ఆవరించుకుని ఆరా ఉంటుంది,అతని భావాలకు అనుకూలంగా ఆరా రంగులు మారుతుంటాయి అని చెపుతుంటే వాటి గురించి తెలియిని వారు అది ట్రాష్ అంటారు..నీవు సాధన చేయి వాటిని చూడవచ్చు అని చెపితే ఏళ్ళ తరబడి సాధన గురించి చెప్పగానే వారు అంతటితో దానికి గుడ్ బై చెపుతారు.. అదే నేనైతే చెప్పేది ఎలా ఉంటుందంటే … సూర్యుడి వెలుతురులో చెట్టువేపు చూస్తూ నీ వేలును చెట్టుకు అడ్డం పెట్టుకోని నీ వేలి చివరి నుండి చెట్టును ఒంటి కంటితో చూడు….నీ వేలి చుట్టు ఉన్న ఆరా కనిపిస్తుంది..నీ భౌతిక ఇంద్రియమైనా కళ్ళతో ఇప్పడే ఈ క్షణమే అని చెపుతాను… అంత సూటిగా ఉండాలి సమాధానం ఏదైనా… రవీందర్…