సూక్ష్మశరీర ప్రయాణం-డా.న్యూటన్ -ఈ పుస్తకం. రవీందర్.

సూక్షశరీర ప్రయాణం

(Astral body Journey)

డా.న్యూటన్ కొండవీటి

సమకూర్పు -రవీందర్.

విషయ  సూచిక

1.        ఆత్మ ఙ్ఞానం                               

 2.        సూక్షశరీర ప్రయాణం అంటే ఏమిటి?                        

3.        సూక్షశరీర ప్రయాణం అపోహలు- వివరణ                4.        సూక్షశరీర ప్రయాణంలో నాలుగు స్థితులు.

     ఎ) వైబ్రేషన్ స్టేజి – మహ స్పందన స్థితి.

బి) సెపేరషన్ స్టేజ్ –  వేరుపడిన స్థితి.

సి) ఎక్సప్లోరేషన్ స్టేజ్ – అన్వేషణ స్థితి.

డి)  రి ఎంట్రి స్టేజ్  –  పున: ప్రవేశ స్థితి

5.        సూక్షశరీర ప్రయాణం టెక్నిక్స్ – మెథడ్స్                       1. నిద్రపోయే సమయం

2. మెలుకవ ,నిద్ర మధ్య స్థితి 

3. పిరమిడ్స్ లో ధ్యానం. .

4. సెల్ఫ్ ఎంప్లాయి టెక్నిక్.

5. ధ్యానం. 

6. ప్రిటెండింగ్ టూ డెత్ .

7. లెట్ గో – అన్ని వదిలివేయడం.

8. థర్డ్ ఐ గేట్ వే

9.యూజింగ్ సౌండ్ వైబ్రేషన్.

10.మార్నింగ్ మెథడ్..టెక్నిక్..

11. సిక్స్ ఫీట్ మెథడ్. 

12. అఫర్మేషన్స్ విత్ విల్ .

13. ఫిక్స్ డ్ ఆంకర్ మెథడ్.

14. ఆస్ట్రల్ ఆర్మ్స్ బ్రేకింగ్ త్రూ.

15. ఫ్లోటింగ్ బెలూన్ టెక్నిక్.

16. డైనమిక్ అవేర్ నెస్ మెథడ్.

17. కౌంటింగ్ మెథడ్.

18. క్రియేటివ్ విజువలైజేషన్ టెక్నిక్. 

19. వాకింగ్ టూవార్డ్స్ ఆన్ అబ్జెక్ట్ .

20. బ్రెత్,ఆడియో డ్యూయల్ ఫోకస్. 

21. గేజింగ్ టెక్నిక్ .

22. మణిపూరక చక్రంపై ధ్యాస. 

23. చేతిని పైకెత్తి ఉంచి నిద్రపోవడం.

24. మెమరి రిగ్రెషన్ మెథడ్. 

25. ది పాత్.  

26. శరీరంలో  ప్రత్యేక భాగంపై ఫోకస్.

27. సిల్వా మైండ్ కంట్రోల్ మెథడ్. 

28. నాధ బ్రహ్మ అనుభవం.

29. జంప్ టెక్నిక్.

30. థరస్ట్ టెక్నిక్.

31. స్ట్రెచ్ ఔట్ టెక్నిక్..

32. ఉయ్యాల టెక్నిక్.

33. వాహనం రుపోందించుకునే టెక్నిక్.

35. అధికంగా నిద్ర పోయే టెక్నిక్.    

36. స్టీమ్ మెథడ్,నిచ్చెన మెథడ్.  

37.మనస్సును శూన్యంలో నిలిపే టెక్నిక్.

38. కార్లోస్ కాస్టనెడా స్టేజ్ . 

39. పునర్జన్మ శ్వాస టెక్నిక్ 

40. మొక్క, జంతువు, స్థితికి మారడం.

41. చెట్ల తొర్రల  గుండా ఆస్ట్రల్ ట్రావెల్ 

42. సమాధి రొటేషన్ టాంక్.           

43. ఫోకస్ 10-  రాబర్ట్ మన్రో టెక్నిక్. 

 

1. ఆత్మ ఙ్ఞానం                                        

డా.న్యూటన్ గారు 2014 జనవరి మొదటివారంలో హైదరాబాదులో సాధకులను ఉద్దేశించి భోధించిన  సూక్షశరీర ప్రయాణం పాఠాలు ఇవి.

….

                        మనం  అనంతమైనటువంటి శక్తితో ఉన్నటువంటి ఙ్ఞానవంతులము.మన గురించి మనం తెలుసుకుందాం. నేను ఙ్ఞానవంతున్ని అని కొంత గుర్తిస్తున్నాం అంతే. మౌళికంగా అందరు ఙ్ఞానవంతులే.

          మనం ఇప్పటికే ఙ్ఞానవంతులం, కాకపోతే నిద్రపోతున్నాం . ఒకసారిగా నిద్రలేచి, ఆ.. నేను ఙ్ఞానవంతున్ని అని తెలుసుకుంటాం అంతే. ధ్యానం అంటే ఇది తప్ప మరేమి కాదు. మనం మేలుకోనాలి.

      దీన్నే నీ జేబులోనే వజ్రం ఉందని చెపుతుంటారు. మీరు వజ్రం కోసం ప్రతి

దగ్గర అన్వేషిస్తుంటారు. నా వజ్రం ఎక్కడ? నా వజ్రం ఎక్కడ ఉంది అని. కాని అది నీ జేబులోనే ఉంది. ఆత్మ ఙ్ఞానం,బ్రహ్మ ఙ్ఞానం అని మనం ఏదైతే వెతుకున్నామో అది అప్పటికి సిద్దంగా నీ దగ్గరే ఉంది. నువ్వే అది. దాంట్లోనే నీవు జీవిస్తున్నావు. కేవలం దాన్ని మనం గుర్తించలేదంతే. దాన్ని గుర్తించడానికి ఇప్పుడు సమయం వచ్చింది. మరి సిద్ధి అంటే కూడా అంతే. అందుకే ఎన్ లైటెన్మెంట్ అనేది ఒక విధ్యుత్. మనం ఇప్పటికే ఙ్ఞానులం, కాకపోతే మేలుకోంటున్నాం అంతే.

ఒకానొక రోజు మీ అంతటే మీరు నవ్వుతారు. ఇంత వరకు ఎంత వెదుకులాట చేసాను నేను…… అని ఒక నవ్వు వస్తుంది మీకు.

నేను ఇప్పటికే అది అయ్యి ఉన్నానని,అదే నేనని,ఆరోజున మీరు తెలుసుకుంటారు.

      ‘పాలో కోయిలో’ రాసిన అల్ కెమస్ట్రి పుస్తకాన్ని మీరు ఎందరు చదివారు?తెలుగులో కూడా ‘పరుసవేది’ అనే పేరుతో అనువాధం వచ్చింది. చక్కటి పుస్తకం.అందరు చదువాల్సిన పుస్తకం. బ్రెజిల్ దేశానికి చెందిన పాలో కోయిలో ఆ పుస్తక రచయిత. ఆపుస్తకంలోని  కథా సారంశం ఏమిటంటే కథానాయకుడు ఒక నిధి కోసం ఎన్నో దేశాల్లో అంతటా వెతుకుతాడు. ఆ నిధి,సంపద అతనికి ఎక్కడ దొరకదు.అంతా తిరిగి చివరకు ఇంటికే వస్తాడు. అతని ఇంట్లోనే ఆ సంపద ఉంది. 

               దాని అంతరార్థం ఏమంటే  ఆత్మ ఙ్ఞానం అంతా వెతుకుతాం, చివరకు మళ్ళీ మన దగ్గరకు మనం రావల్సిందే. ఈ గురువు అని, ఆ గురువు , ఆపుస్తకాలు అని , అది ఇది, ఎంతో ఆరాట పడి,ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, చివరకు మన దగ్గరకు మనం రావల్సిందే. అంతా మనదగ్గరే ఉంది. మన అత్మ సంపద మన దగ్గరే ఉంది. మీరు దాన్ని మర్చిపోయారంతే. 

  మనం ఈ మధ్యాహ్నం సూక్షశరీర యానం గురించి తెలుసుకుందాం. మన అందరికి తెలుసు, చాలమంది ఇప్పటికే చక్కటి అనుభవాలు పొందారు.(క్లాసుకు వచ్చిన ధ్యానులు) కాని ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం.

 

 

2. సూక్షశరీర ప్రయాణం అంటే ఏమిటి?                             

    ఆధ్మాత్మిక ఙ్ఞాన సముపార్జనలో అత్యుత్తమైన అనుభవాల్లో సూక్షశరీర ప్రయాణం అతిముఖ్యమైనది.ధ్యానం కొత్తగా మొదలుపెట్టిన వారినుండి మొదలుకుని సీనియర్ ధ్యానుల వరకు అందరికి ఈ అనుభవాలు కలుగుతుంటాయి, వస్తూ ఉంటాయి. వాటినుండి మనం ఎంతో నేర్చుకుంటూ ఉంటాం. ఈ అనుభవాల గురించి మనం ఎంతో చెప్పుకోవాలి.

డా.న్యూటన్: ఇక్కడ ఎంత మందికి మీ బాడి నుంచి సూక్షశరీరం బయటకు వచ్చింది? (క్లాసుకు వచ్చిన ధ్యానులను ఉద్దేశించి అడిగిన ప్రశ్న )

ఆ అనుభవం వచ్చిన కొందరు…… చేతులు ఎత్తారు.

డా.న్యూటన్: వెరిగుడ్.చాలమందికే అనుభవాలు ఉన్నాయి…ఏదో ఒక అనుభవం. కొందరికి ధ్యానంలో ఆ ఆనుభవం వచ్చి ఉండవచ్చును.లేదా మీ కలలలో మీ స్థూల శరీరం నుండి సూక్షశరీరం విడిపడడం జరిగి ఉండవచ్చును. లేదంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక్కోసారి ఒక్క క్షణిక కాలంలో ఆ అనుభవాలు కలుగుతాయి.అతి స్వల్ప వ్యవధి సూక్షశరీర ప్రయాణాలు అప్పుడు జరుగవచ్చును. ఒక సారి  నేను ధ్యానంలో ఉండగా మరొక స్థలంలో ఉండి అకస్మాత్తుగా నాశరీరంలోకి  తిరిగి వచ్చాను.అలాంటి అనుభవాలు జరిగి ఉండవచ్చును.కాని ఎరుకతో సూక్షశరీర ప్రయాణం చేయడం అనేది నేర్చుకోవాలి. దాని యెక్క దశలను,మెళుకువలను  నేర్చుకోవాలి.

 ఇప్పుడు సైకిల్ తొక్కడం అనేది ఉంది.ఆ సైకిల్ తొక్కడం లోని మెళుకువలు నేర్చుకోవాలి. సైకిల్ తొక్కడం ఎలా వస్తుంది? సాధన తోనే సైకిల్ తొక్కడం వస్తుంది. సైకిల్ తొక్కడం ఎలా అని ఒకరు పుస్తకం రాసారు. ఆపుస్తకం ఎన్నాళ్ళని చదువుకునేది? ఎన్నాళ్ళు చదివినా సైకిల్ తొక్కడం రాదు. సైకిల్ తొక్కడం అలా అని రెండురోజుల పాటు ఒక పెద్ద వర్క్ షాపు పెట్టారు.ఆవర్క్ షాపులో సైకిల్ తొక్కడం ఎలా అని ఒకాయన ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు దంచుతున్నాడు. అయిన కూడా విన్న వారికి సైకిల్ తొక్కడం రాదు. సైకిల్ ఎక్కి డైరెక్టుగా తొక్కాల్సిందే.

         ఈ సూక్షశరీర ప్రయాణం కూడా అలాంటిదే. అందుకే ఎక్కువ మాట్లాడకూడదు మనం. ఎంత పరిశోదించారో కేవలం అంతే చెప్పగలిగితే చాలు. నేను ఎంతైనా చెప్పనివ్వండి మీకు. అది మీరు స్వయంగా చేస్తే గాని తెలియదు.

       నాకు కలిగినటువంటి కొన్ని అనుభవాల్లో ముఖ్యమైన అనుభవం సూక్షశరీర ప్రయాణాలు. నాకు ఇష్టమైన అనుభవాలు అవి.

             నాకు మొదటిసారి ఆ అనుభవం జరిగినపుడు,ఇలా కూడా జరుగుతుందా అని నాకు ఒక ఆనందం వేసింది. ఆ అనుభవం బలే ఉంది శరీరం తేలికైపోయి, పైకెళ్ళిపోయి గది గోడకు అతుక్కుంటున్నాను. నా శరీరం బెలూన్ లాగ తేలి ఆడుతుంది. నేను ఏంటి ఇలా తేలి ఆడుతున్నాను అనుకున్నాను.కింద చూస్తే నా బాడి ధ్యానంలో కూర్చుని ఉంది. పైనుంచి నా శరీరాన్ని నేను చూసుకుంటున్నాను. చాల మంచి మధురానుభూతి అది. స్థూలము, సూక్షము విడిపడడం,వేరు కావడం. అవి రెండు వేరు పడడం అనే ఈ ప్రక్రియ ఉందే, అది చాల అందంగా ఉంటుంది.(స్థూల,సూక్ష్మశరీరాలు)

    ఎన్నో జన్మల సాధన లేకపోతే, ఈ జన్మలో ఎంతో సాధన చేస్తేగాని సాదారణంగా ఈ జన్మలో ఆస్ర్టల్ ట్రావెల్ రాదు. ఇంత క్రితం ఎన్నో జన్మల సాధన చేసిన వారికి కూర్చోగానే సూక్షశరీర ప్రయాణం వస్తుంది. కూర్చోగానే థర్డ్ ఐ విజన్స్ మొదలవుతాయి.

     మనకు మూడు శరీరాలు ఉన్నాయి. అన్నమయ కోశం,(స్థూల శరీరం) ప్రాణమయకోశం,(ఎథరిక్ బాడి)మనోమయ కోశం(అస్ట్రల్ బాడి-సూక్ష్మశరీరం)

       ఈ మూడు శరీరాలు వేరు పడడానికి , విస్తరించడానికి మన యొక్క గత జన్మల్లో చేసిన సాధనలు అన్ని కలిసివస్తాయి. ఇక్కడ మళ్ళీ మొదటి నుండే నేర్చుకొంటారు. ముందు ధ్యానం నేర్చుకుంటారు. నాకు ఏం తెలియదనట్లే సాధన చేస్తారు. కాని కొందరికి గత జన్మల్లో చేసిన సాధనల వలన చాలా తొందరగా ఆ అనుభవాలు కలుగుతాయి. చాల త్వరగానే వారి స్థూల శరీరం నుండి సూక్షశరీరం విడుదల అవుతుంది.

     అకస్మాత్తుగా ఈ విజన్స్ మొదలవుతాయి. కాని ఎందుకు వస్తున్నాయో ఈ విజన్స్ ముందుగా అర్థంకావు. అవి చిత్త భ్రమలని,ఊహలని అని ముందుగా అనుకుంటాం.  

      కాని తరువాత కొన్ని తిరుగులేని నిదర్శనాలు కనిపిస్తాయి.నేను చూసేది ఊహ కాదు, నా శరీరం బయటే ఉన్నాను, నిజంగానే సూక్షశరీరంలోనే ఉన్నానని  అని మీకు అర్థం అవుతుంది.

          ఈ రెండు శరీరాలకు మద్యలో ఒక సిల్వర్ కార్డ్ కనెక్షన్ ఉంటుంది.ఆ సిల్వర్ కార్డును చూడడం కూడా చాల బాగుంటుంది.

      మొదట్లో మనకు చాల తొందరగా సూక్షశరీర ప్రయాణాలు జరుగుతాయి. వాటిని మీరు గుర్తించను కూడా గుర్తించలేరు. తరువాత     మీరు పునర్ ఆలోచన చేసుకుంటే అర్థం అవుతుంది. ఔను, నేను నా శరీరం నుండి బయటకు వచ్చాను,గిర్రున తిరిగింది , అలా బొంగరంలా  తిరిగింది నా సూక్షశరీరం, దాని తరువాత వేరే దృష్యం కనిపించింది. అంటే నేను అక్కడ సూక్షశరీరంతో ఉన్నానని మీకు అవగతం అవుతుంది. కొందరు స్థూల శరీరానికి తిరిగి వచ్చేప్పుడు ఒక జర్క్ తో తమ శరీరంలోకి వచ్చిపడుతారు. మరికొందరికి శరీరం బయటకు వచ్చిన తరువాత సువాసనలు తెలుస్తాయి.మరికొంతమంది శబ్దాలు వినపిస్తాయి.ఆ శబ్దాలు ఎన్నడు విననటువంటి శబ్ధాలు, మధురంగా ఉండే ఫ్లూటు శబ్దాలు, గంటలు మోగినట్లు, శంఖాలు ఊదిన శబ్దాలు వినిసిస్తాయి.

    సూక్షశరీరం విడిపడినపుడు సర్వ సాధరణంగా వినపడే శబ్ధం ఏమంటే  ‘‘వుష్’’ శబ్ధం వస్తుంది. ఆస్ట్రల్ బాడి రిలీజ్ అయినప్పుడు ఆ ప్రకంపనాలతో వచ్చే శబ్దం ‘‘వుష్’’ శబ్ధం. ఒక విమానం, జెట్ ప్లేన్ వెళ్ళేప్పుడు  వచ్చే ఎలాంటి శబ్ధం వస్తుందో అలాంటిదన్నమాట. అత్యధిక స్థాయి ప్రకంపనాలతో కూడిన శబ్ధం వస్తుంది. మనం సూక్షశరీరంలో ఉన్నాను అనడానికి ఇవన్ని మనకు కొన్ని చిహ్నలు.

ఈ సూక్ష శరీర అనుభవాలు వివిధ స్థితుల్లో , వివిద పద్ధతుల్లో మనకు వస్తాయి.

    మొదటి పద్దతి ధ్యానం. సూక్షశరీరయానానికి ధ్యానం అనేది అత్యున్నత మార్గం. సర్వసాదారణంగా ధ్యానం చేసేవారందరికి ఏదో రకంగా సూక్షశరీర అనుభవాలు కలుగుతాయి.ధ్యానం చేసేవారందరు ఏదో ఒక రోజున తమ శరీరం నుంచి బయటపడుతారు.  

     రెండవది స్వప్నం నిద్రాస్థితిలో. మన స్వప్నాల్లో మన శరీరం నుండి బయటకు వెళుతుంటాం. స్వప్నావస్థలో మన శరీరం నుండి బయటకు వెళ్ళడం.

   మూడవది మృత్యు సమీప అనుభవాలు. మృత్యువు చేరువగా వెళ్ళి రావడం. డాక్టర్స్ చెక్ చేసినపుడు వాళ్ళ నాడి , గుండె స్పందన, రక్తపోటు , ఇ.జి.యేస్ అన్ని ప్లాట్ మీదకు రావడం చూస్తారు. ఇవన్ని కూడ సైన్స్. అలాంటి స్థితిలో డాక్టర్లు లీగల్లి అతను చనిపోయాడని సర్టిఫై చేస్తాడు.అలాంటి కేసుల్లో కూడా చాలమంది కూడా వెనక్కి రావడం జరుగుతుంది. అలాంటప్పుడు మళ్ళి అన్ని వేవ్స్ కదలిక మొదలవుతుంది.

 సినిమాల్లో చూపిస్తుంటారు వాళ్ళ(హీరో)ఇ.సి.జి, మానిటర్ మీద ప్లాట్ గా అయిపోతుంది. అవతల హీరోయిన్ ప్రేమతో పిలుస్తుంది. దాంతో ఒక్కసారిగా అతని హార్ట్ కొట్టుకోవడం మొదలవుతుంది.(క్లాసులో నవ్వులు)అంతా కామన్ గా చూపిస్తుంది. వాస్తవంగా అట్లాగే జరుగుతుంది. అత్యంత ప్రేమించే వ్యక్తులతో ఎవరికైతే అతి గాఢమైన ఆత్మస్థాయి అనుభందం ఉంటుందో,తల్లి- బిడ్డ, భార్య-భర్త, ఫ్రేయసి-ప్రియుడు అలాంటి సంధర్బాలో అవతలి వారి ఆత్మ వెనక్కి తిరిగి వస్తుంది. దీని గురించి మరోసారి వివరంగా  తరువాత టాపిక్ లో తెలుసుకుందాం.

     తరవాత గాయాలు బలంగా తగిలినప్పుడు కలిగే శరీర విర్మరణ-విస్మరణ. అంటే ఎవరైకైనా అక్సిడెంట్స్ జరిగినప్పుడు తాత్కాలికంగా తమ శరీరం నుండి బయటకు వస్తారు.బయటకు వచ్చి తమ శరీరాన్ని తాము చూసుకుంటారు.వాళ్ళ కాళ్ళు విరిగిపోయింటాయి, నొప్పుంటుంది, రక్తం కారుతుంటుంది.కాని వాళ్ళకి ఆ నొప్పి తెలియదు.ఎందుకంటే వారు తమ శరీరం బయట ఉన్నారు కాబట్టి. తమను ఆసుపత్రిలో చేర్పించడం,ఆర్థోపెడిషియన్ వచ్చి విరిగిన ఎముకలన్ని తిరిగి సక్రమంగా అమర్చడం ఇదంతా కూడ వారు పైనుండి చూస్తుంటారు. శరీరం లోపలికి రాగనే మాత్రం నొప్పి ఉంటుంది.

తమ శరీరం బయట ఉండటం వలన వారికి ఆ నొప్పి తెలియదు.ఇలాంటి సందర్బాల్లో కూడా ఈ అనుభవాలు వస్తాయి.

 చాలమందికి ఈ అనుభవాలు వస్తాయి.ట్రోమా కేర్ సెంటర్స్ లలో, హస్పటిల్స్ ఎమర్జెన్సీ వార్డుల్లో ఇవి చూడవచ్చు. నేను కర్నూలు లొని హస్పటిల్లో ఎమర్జెన్సీ కాజువాలిటిలో డాక్టర్ గా జాబ్ చేస్తున్నప్పడు , నేను వారికి ట్రీట్ మెంట్ చేయడం కంటే ఎక్కువగా వారికి కలిగే అనుభవాల మీద ఆసక్తి చూపించేవాణ్ని. తలమీద బలంగా గాయమైన వారితో ‘‘నీకు అప్పడు ఎలా అనిపించింది’’ అని అడిగేవాణ్ని. ఎవరైనా చనిపోతున్నప్పుడు  కూడ  దాన్ని క్లోస్ గా చూసేవాణ్ని. క్లినికల్ గా వాళ్ళు చావు దగ్గరకు వెడుతున్నప్పడు వారి ఆస్ర్టల్ బాడిలో ప్రాణమయ కోశంలో ఏమార్పులు సంభవిస్తున్నాయి?భౌతిక శరీరంలో ఏమార్పులు వస్తున్నాయి? అని వారికి  అతి సన్నిహితంగా ఉండి గమనించేవాణ్ణి.

      సూక్షశరీర ప్రయాణానికి మరొక పద్దతి సృహ తప్పించే వినియోగ స్థితి. అంటే కొంత మంది డాక్టర్లు సర్జరి చేయడానికి ముందు పేషెంట్లకు అనెస్థేషియా  ఇస్తుంటారు. అలాంటప్పుడు కూడా ఇలా శరీరం నుండి బయటకు వచ్చే అనుభవాలు కలుగుతాయి.పేషెంట్స్ తమకు డాక్టర్స్ చేసే సర్జరినంతా శరీరం బయట నుండి చూస్తుంటారు. ఆసమయంలో వారికి నొప్పి ఏం తెలియదు. వారు సర్జరి తరువాత డాక్టరుకు అంతా చెప్పగలుగుతారు. ఆ సమయంలో డాక్టర్ , నర్స్ ఏమేం మాట్లాడుకున్నారో, ఆ డాక్టర్ కు ఏమేం ఎమోషన్స్ కలిగియో అంతా చెప్పేయగలరు.అవి విని డాక్టర్స్ ఆశ్యర్య చకితులు అవుతారు.

      ఒకసారి ఒక డాక్టర్ సర్జరి చేస్తూ పేషెంట్ మీద ఒక స్థాయిలో జోకులు వేస్తున్నాడు.సర్జరి తరువాత పేషెంటును ఆపరేషన్ తరువాతి కేర్ వార్డులో ఉంచినప్పుడు , ఆ డాక్టర్ పేషెంట్ దగ్గరకు వెళ్ళగానే సృహలో ఉన్న పేషెంట్ డాక్టర్ ను అడిగాడు.‘‘ఎందుకండి డాక్టర్ , నేను సృహలో లేనప్పుడు నామీద అలా జోకులు వేసారు?నేను చాలా బాదపడ్డాను’’ అని . ఆమాటలు విన్న డాక్టర్ షాకైపోయాడు. ‘‘మేము నీకు అనెస్థేషియా ఇచ్చాము కదా? నికేలా వినపడింది?ఎవరైనా చెప్పారా నీకు ?’’ అని డాక్టర్ అడిగాడు.

 పేషేంట్ ‘‘నేను పైనుండి అంతా చూసాను.మీరు ఎమేం మాట్లడారో నేను అంతా విన్నాను’’ అన్నాడు.

       సూక్షశరీరం అంతా వినగలుగుతుంది, చూడగలుగుతుంది. అనెస్థేషియా ఇచ్చినప్పుడు మాత్రం స్థూల శరీరం రిలాక్స్ అయిపోతుంది.

 డా.న్యూటన్ : ‘‘ఈ గ్రూపులో అలాంటి అనుభవాలు ఎవరికైనా కలిగాయా?సర్జరీ చేసినప్పుడు శరీరం బయటకు రావడం లాంటివి?’’

ఒక సాధకురాలు తనకు వచ్చిన అనుభవాలు చెప్పింది.‘‘నా డెలివరి సమయంలో సిజేరియన్ అపరేషన్ అని చెప్పారు.పడుకోబెట్టారు. పేయిన్స్ మొదలైనాయి. అనెస్థేషియా ఇచ్చారు.తరువాత కొద్దిసమయానికే మత్తులో ఎవరో వచ్చారు. ఇలా రామ్మా అని తీసుకు వెళ్ళారు. నేను మొత్తం వైట్ గా ఉన్నాను. అతను మొత్తం చూపిస్తున్నాడు. అతనెవరో నాకు తెలియదు. ఈలోపల నాకు డాక్టర్స్ అన్ని మాట్లాడుకునే మాటలు వినపడుతున్నాయి.అటు చూస్తున్నాను,ఇటు డాక్టర్స్ మాట్లాడే మాటలు వింటున్నాను.చివర్లో మాత్రం అతను నీ పని అయిపోయింది, ఇక నువ్వెళ్ళు అని నా శరీరం దగ్గర తీసుకువచ్చి వదిలేసాడు.’’

డా.న్యూటన్ : ‘‘వండర్ ఫుల్ అనుభవం..సాదారణంగా ధ్యానంలో

ఈ అనుభవాలు వస్తుంటాయి’’ అన్నారు.

అప్పడు మరో సాధకురాలు తన పిరమిడ్ ధ్యాన అనుభవాలు చెప్పింది.

మరో సాధకురాలు తనకు అనెస్తేషియా ఇచ్చినప్పడు వచ్చిన అనుభవాలను

షేర్ చేసుకోవడం జరిగింది.

డా.న్యూటన్ : మీలో ఎవరికైనా మృత్యు సమీపంలోకి వెళ్ళి వచ్చిన అనుభవాలు కలిగాయా?

ఒక సాధకురాలు తన చావు అనుభవాన్ని చెప్పింది.‘‘ఆసమయంలో నేను చనిపొతున్నానని అందరికి చెపుతున్నాను.కాని బతికే ఉన్నాను.’’

    డా.న్యూటన్: కాబట్టి మృత్యు సమీప అనుభవాలు కూడా సర్వసాధారణం. మనదేశంలో మరీ ఎక్కువ.మనం అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో కూడా చుస్తుంటాం.ఒక సారి ఒక స్త్రీ శవాన్ని దహన సంస్కారాల కోసం శ్మశానం వరకు తీసుకువెళ్ళారు.తీరా అక్కడికి వెళ్ళాక ఆమె అకస్మాత్తుగా లేచి పోయింది. తన శరీరాన్ని గుర్తుపట్టి ‘‘నేను, నన్ను కాదు, పక్కవీధిలో ఉండే లక్షమ్మను తీసుకువెళ్ళాలి.పొరపాటున నన్ను తీసుకువెళ్ళరు’’ అని.

   ఈమె పేరు కూడా లక్షమ్మ కావడంతో ఆస్ర్టల్ గైడ్స్ అక్కడ కొద్దిగా అయోమయం చెందారు.. ఇలాంటి సందర్భాలు చాల ఉన్నాయి.

     ఒక్కోసారి ఆస్ర్టల్ వరల్డ్ లో కూడా పొరపాట్లు జరుగుతుంటాయి.దాంతో ఒకరిని బదులు ఒకరిని తీసుకువెళ్ళడం లాంటివి జరుగుతుంటాయి.

 షిరిడి సాయిబాబా తాను జీవించి ఉండగా చక్కటి ఆస్ర్టల్ ట్రావెల్స్ చేసేవాడు.ఒక సందర్భంలో మూడు రోజుల ఆస్ర్టల్ ట్రావెల్ చేసాడు. అంతకు ముందే తన చుట్టు ఉన్నవారికి ‘‘నేను మూడు రోజుల తరువాత తిరిగి వస్తాను, నా శరీరాన్ని ఏమి చేయవద్దు’’అని చెప్పాడు .

 మన అందరికి తెలిసిన విషయం ఏమంటే ఒక ధ్యాని సాధారణంగా గంటన్నర వరకు తన స్థూల శరీరాన్ని వదిలి బయట ఉండగలడు. మూడు రోజులు శరీరం బయటే ఉండడం అంటే ఒక పరకాష్టకు చెందిన ఒక మాష్టర్ కు మాత్రమే అది సాధ్యం. దానిపై ఉన్నత స్థాయి,ఎరుక స్థాయి ఉండాలి. సాధన చేస్తే మనం కూడా మూడురోజుల పాటు  చేయగలుగుతాం.కాని మీ గది బయట ‘‘నేను సూక్షశరీరం ప్రయాణంలో ఉన్నాను అని మీ గది బయట బోర్డు పెట్టాలి’’.(క్లాసులో నవ్వులు)

      అస్ట్రల్ ట్రావెల్ లో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు.ఇతరులతో ఎలాంటి స్పర్శ,ఎలాంటి శబ్దాలు,మిమ్మల్ని ఎవరైనా పేరుపెట్టి పిలవడం లాంటివి ఏం ఉండకూడదు.

ఒకసాధకుడు: ఆస్ట్రల్ ట్రావెల్ చేసేప్పుడుశరీరం స్ట్రెచ్ అవుతుందా?

డా.న్యూటన్ : ఔను స్ట్రెచ్ అయిపోతుంది. మినిమం మెటబాలిజం(కనీస శరీర విధ్యుక్త ధర్మాలు) జరుగుతుంటుంది. మన యొక్క ఆస్ట్రల్ బాడి ఒకానొక శరీరం మాత్రమే.ప్రాణమయ కోశం అక్కడే ఉంటుంది. కేవలం మనో మయ కోశం మాత్రమే బయటకు వెళుతుంది. శ్వాస నడుస్తుంటుంది.చాల కనీస మొత్తంగా సూక్ష స్థాయిలో శ్వాస నడుస్తుంది. చాలమంది బయటి నుండి చూసే వాళ్ళు బ్రీతింగ్ నడవడం లేదు ఆగిపోయింది అనుకుంటారు.ఒక శవం మాదిరి స్థితే ఉన్నప్పటికి పల్స్, బ్లడ్ ప్రెషర్ అన్ని మినిమం స్థాయిలో పనిచేస్తుంటాయి.

ఒక సాధకురాలు : ‘‘షిర్డి సాయిబాబా ఆస్ట్రల్ ట్రావెల్ చేసినపుడు డాక్టర్స్ టెస్ట్ చేసినప్పుడు , బాబా నాడి కొట్టుకుందా? ’’

డా.న్యూటన్ : షిర్డిసాయిబాబకు నాడిపరిక్ష చేస్తే , నాడి దొరకలేదు,దాంతో  డాక్టర్ సాయిబాబ తన శరీరంలో లేరు అనుకున్నారు. షిర్డి బాబా అసలు వాస్తవానికి చేసింది  కేవలం సూక్షశరీర ప్రయాణం కాదు , ఆత్మ ప్రయాణం, తన  అన్ని బాడీస్, పంచ కోశాలు, విశ్వమయ కోశం, నిర్వాణమయ కోశంతో పాటే అయన వెళ్ళారు. షిర్డిబాబా కేవలం సూక్షశరీర ప్రయాణం కాకుండా సోల్ తో కాస్మిక్ ట్రావెల్ చేశారు.శంకరాచార్యకూడా ఆస్ర్టల్ ట్రావేల్, సోల్ ట్రావెలే కాకుండా పరకాయ ప్రవేశం కూడా చేసారు. జగద్గురు ఆదిశంకరచార్య కొత్త సినిమాలో సుబాష్ పత్రిగారు కూడా ఆ సినిమాలో నటించారు,ఆది శంకర చార్య గురువుగా,ఎంత చక్కగా నటించారో.

  పరకాయ ప్రవేశంలో బయటకు వచ్చేసి ఇంకోక శరీరంలో ప్రవేశిస్తారు. టిబెట్,హిమాలయాల్లో ఉండే యోగులు చాలమంది ఇది చేస్తారు.అక్కడ చనిపోయి పడిఉన్న దేహాల్లోకి పరకాయ ప్రవేశం చేస్తారు. ఎందుకంటే వారి శరీరం అప్పటికే రెండు మూడు వందల ఏళ్ళుగా చిక్కి శల్యమై ఉంటుంది.అనుకోకుండా లబించే 40,50 ఏళ్ళలోపు యవ్వన డెడ్ బాడీస్ లోకి వాళ్ళు ప్రవేశించి,తాము చేయాల్సిన  తదుపరి ఆధ్యాత్మిక జీవిత ప్రణాళికను కొనసాగిస్తారు. కాబట్టి మనకు ఈ శరీరం కేవలం ఒక వాహనం మాత్రమే.  

 నాకు ఒక్క అనుభవం ఉంది. హస్పెట్ (కర్ణాటక)ఋష్య మూక పర్వతం దగ్గర ధ్యానం చేస్తున్నాము. అదొక గొప్ప శక్తి కేంధ్రం. హనుమంతుడు తన వానర సేనను అంతా అక్కడ జమచేసేవాడు. హాస్పెట్ అతి గొప్ప శక్తి క్షేత్రం. రామాయణ కాలంలో జరిగిన చాల సంఘటనలు కిష్కంద కాండతో సహా అక్కడే జరిగాయి.

 ఆ ప్లేస్ ఒక గుహ ఉంది.చాలామంది యోగులు ఆ గుహలో ధ్యానం చేసారు.ఆగుహను ఇప్పుడు ముసేసారు.ఆరోజున మేము బయటే కూర్చుని ధ్యానం చేస్తున్నాము. మొదటి దృష్యంలో ఒక కోతి కనిపించింది.నాతో ఆ కోతి ‘‘నా శరీరాన్ని వదిలేస్తున్నాను, నువ్వు నా శరీరంలో ప్రవేశించు’’ అని. ఆ కోతి తన శరీరం వదిలేసింది. నేను దాని శరీరంలో సూక్షశరీరంతో ప్రవేశించాను.నా కోతి శరీరంలోకి ప్రవేశించాక, చిన్న కోతిలాగ, చెంగు చెంగున ఎగరుకోవడం,నా తోక, నా మూతి కోతిలాగ చాలా తమాషగా అనిపించింది.

     ఆతరువాత ఆగుహలోని చిన్న ద్వారంలోనుండి ఆ కోతి అవతారంతో లోపలికి వెళ్ళిపోయాను.మనిషైతే దూరడం కష్టం.చాలా సునాయసంగా లోపలికి వెళ్లిపోయాను.అక్కడ చూస్తే నిజంగా లోపల కోతులు ఉన్నాయి.అవి ఏంచేస్తున్నాయా అని పరిక్షగా చూసాను.అన్ని నిశబ్దంగా ఉన్నాయి.ఇంకా ఆశ్యర్యం అనిపించింది.కోతులు నిశబ్దంగా ఉండడమా?ఎక్కడ చూడని విడ్డూరమే అని చూస్తే అక్కడ హనుమంతుల వారు కూర్చున్నారు.ఆ కోతులన్నింటికి శిక్షణ ఇస్తన్నారు.ఆనాపానసతి.మంచి మనుసును కలిగి ఉండడం, మనుసును నిశ్చలం చేసుకోవడం ఎలాగో వాటికి శిక్షణ ఇస్తున్నాడు.హనుమంతుడి దగ్గరకు వెళ్ళాను. హనుమంతుల వారు ‘‘మన మనస్సు కోతి లాంటిది,దాన్ని అభ్యాసం,శిక్షణ తో  ఎలా నిశ్చలం చేసుకోవాలని చెపుతూ,దాని కోసమే కోతులన్ని అక్కడకు వచ్చాయని, అందుకే ఆ శిక్షణ అక్కడ నడుస్తుందని చెప్పారు. రామయణ కాలంలో కూడా తాను చేసింది అదే అని, అన్ని కోతుల్ని,కోతుల లాంటి మనుషుల్ని వానరసేనగా చేసాను’’ అని చెప్పాడు.

 ‘‘శిక్షణ ద్వారానే వాటిలోని శక్తిని సరిగ్గా వెలికితీసి,రావణసూర వధకు సమాయత్తం చేయడం జరిగిందని’’ అని ఆంజనేయులు చెప్పారు. ఈ అనుభవం అంతా గంటన్నర పైనే జరిగింది.ఆ గంటన్నర సమయం నేను కోతి శరీరంలో ఆగుహలో , ఆ కోతిమూకతో అక్కడే  ఉన్నాను. తరువాత బయటకు వచ్చాను. ఫూర్తి శక్తితో అప్పడు ఉన్నాను. మొదటి సారి అప్పట్లో అనిపించేది ఇది కూడా ఒక  పరకాయ ప్రవేశం అని. కాబట్టి ఆదిశంకరాచార్యుల వారికి ఒకసారి చప్పట్లు కొడుతాం.(అందరి చప్పట్లు)

 

3. సూక్షశరీరయానం అపోహాలు – వివరణ       

           సూక్షశరీరయానంలో ఉండే అపోహాల గురించి కొన్ని తెలుసుకుందాం.చాలమందికి అపోహలు ఉంటాయి.

Äమొదటి అపోహ : అస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడల్లా వారి యొక్క జీవిత కాలం తగ్గిపోతుంది అని…ఇది కొంతమంది నుంచి విన్నాను నేను. కాని అది నిజం కాదు. వాస్తవానికి అస్ట్రల్ ట్రావెల్ చేసినప్పడల్లా మీ జీవితకాలం ఇంకా పెరగుతుంది. అస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడల్లా పదేళ్ళు జీవితకాలం తగ్గిపోతుందని నాతో ఒకరు చెప్పారు.(నవ్వుతో) వాస్తవానికి ఆస్ట్రల్ ట్రావేల్ చేసినప్పుడల్లా  పదేళ్ళ జీవితకాలం పెరుగుతుంది. అంతటి ఆస్ట్రల్ ఎనర్జీ మీరు అపుడు తీసుకోగలుతుతారు.

Äరెండవ అపోహ: అస్ట్రల్ ట్రావెల్ అనేది చాల కష్టమైనది…ఇది కూడ కేవలం అపోహం.సైకిల్ తొక్కడం,బైక్ నడపడం,ఈత కోట్టడం ఎంత సులభమో అస్ట్రల్ ట్రావెల్ చేయడం అంత సులభం. ఇది ఒక చాకచక్యం.దాన్ని మీరు పట్టుకోవాలి. ఈత కొట్టడం కూడ మీకు ఎవరు నేర్పించలేరు.ఆ నీళ్ళల్లో ఎలా ఈత కొట్టడం అనేది మీకే తెలుస్తుంది. స్విమ్మింగ్ పూల్లో ఈత శిక్షకుడు మీకు సీతాకోక చిలుక రెక్కల్లా చేతులు కదిలించమని,శ్వాస ఎలా ఆదీనంలో పెట్టుకోవాలో అని కేవలం సలహాలు చెపుతాడు.అలాగే ఆస్ట్రల్ ట్రావెల్ కూడా అంతే.

     సూక్షశరీర ప్రయాణంలో ఉన్నప్పుడు , మీరు ఏయే మెళుకవలు కలిగి ఉండాలో,ఎలా ఎరుకతో ఉండాలో అనేది ముందుగా గుర్తుంచుకోవాలి.

స్థూల శరీరం బయట సూక్షశరీరంతో ఉన్నప్పుడు నువు ఎమేం చేయాలో గుర్తుంచుకుంటే మీరు శరీరం బయట చాల సమయం ఉండవచ్చును. ఆస్ట్రల్ ట్రావెల్ లో ఉన్నప్పుడు మీరు ఏంచేయాలో కూడా తెలుసుకుంటే మీరు చాల చాలా చేయవచ్చును.

Äమూడవ అపోహ: నేను శరీరం బయటకు సూక్షశరీరంతో వెళ్ళిపోయిన తరువాత , వేరే అత్మ వచ్చి నా శరీరంలో దూరితే , నేను వెనక్కి వచ్చిన తరువాత నా స్థూల శరీరంల లేకుంటే కష్టమని కొంతమందికి భయం ఉంటుంది. కాని అదేం జరగదు.మీ శరీరం ప్రకంపనాల పరంగా వేరే వాళ్ళకు సరిపోదు.కేవలం అత్యున్నత ఆత్మ చైతన్యం ఉన్నవారు , కనీసం ఆరవ శరీర చైతన్యం సాధించిన(లేదా ఆరవ తలంనుండి వచ్చిన)అత్యున్నత మాష్టరు ఆత్మలు(బుద్దుడు లాంటి)మాత్రమే మీలో ప్రవేశించగలరు. ఆలాంటి మాష్టర్ ఆత్మలు మీరు ఎలాంటి ప్రకంపనాల స్థితిలో ఉన్న కూడా మీశరీరంలో ప్రవేశించి మీద్వారా చానెలింగ్,వీడియోషిప్ చేయగలుగుతారు.అంతే తప్ప మిగితా వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని చికాకు పెట్టరు.

Äనాలుగవ అపోహ: నేను అస్ట్రల్ ట్రావెల్ చేసినపుడు ఏ రాక్షసలోకానికో, దయ్యాల లోకానికే, నాగలోకానికో వెళ్ళిపోతాను, అక్కడి నుంచి రాలేను అని. అప్పడు దయ్యం అత్మలన్ని నన్ను అక్కడ అటాక్స్ చేస్తాయి అని భయపడుతారు.అదేం జరగదు. నిజంగా అక్కడి కంటే పెద్ద దయ్యం మనలోనే ఉంటుంది.(నవ్వులు)మన యొక్క ఆలోచనలు బట్టే మన సూక్షశరీరం ప్రతిస్పందిస్తుంది. మీరు భయంతో ఉండి నేను నాగలోకానికి వెళుతాను అని భయపడుతు ఉన్నారనుకోండి అలాగే జరిగినట్లు అనిపిస్తుంది.జరుగుతుంది కూడా.మీరు ఆస్ట్రల్ ట్రావెల్ లో ఉండి, మీరు వెలువరించే ప్రతి ఆలోచన అక్కడ వెనువెంటనే ప్రత్యక్షం అవుతుంది. అందుకే సూక్షశరీరాన్ని ఆలోచన శరీరం(థాట్ బాడి) అంటాం.ఆలోచనతో అది ప్రయాణిస్తుంటుంది.

  మీరు ఆస్ర్టల్ బాడిలో ఉన్నప్పుడు ఏ ఆలోచన వెలువరిస్తారో,ఆలోచిస్తారో వెనువెంటనే అక్కడ జరుగుతుంటుంది. మీరు పులి వస్తుంది అని అనుకుంటే అక్కడ ఆస్ట్రల్ పులి తయారయిపోతుంది.అది మిమ్మల్ని అటాక్ చేసి తినేస్తుంది అని మీరు భయపడితే  అదినిజంగానే అటాక్ చేస్తుంది.(మీ భౌతిక శరీరానికి ఏమి కాదు) అక్కడ అంతా వెనువెంటనే జరుగుతాయి. కాబట్టి మీ ఆలోచనలన్ని వెంటనే అక్కడ వాస్తవరూపం పొందుతాయి. అలాంటి వాటితో విసుగనిపించిందా అందుకే ఈ భౌతికతలం.

Äఐదవ అపోహా : అస్ట్రల్ ట్రావెల్లో నా వెండితీగ(సిల్వర్ కార్డ్) తెగిపోతుంది అని. స్థూల శరీరంనుండి సూక్షశరీరంగా బయటకు వెళ్ళనప్పడు నిరంతరం అనుసందానం అయ్యి ఉండే ఈ సిల్వర్ కార్డ్ తెగిపోతే ఎట్లా ? మరణమే కదా అని భయపడుతారు. అలా ఏం జరుగదు. ఎవరి  సిల్వర్ కార్డ్ తెగిపోవడం అనేది జరుగదు, మీ అంతట మీరే తెంపగొట్టాలనుకుంటే తప్ప. ఇచ్చామరణమే, అన్ని మరణాలు ఇచ్చా మరణాలే. ప్రతి మరణం కూడా . అత్యన్నత మాష్టర్స్ ధ్యాన సమయంలో తమ స్థూల శరీరాన్ని వీడి,మరణించే శక్తి సామర్ధ్యాలు కలిగి ఉంటారు. వాళ్ళ సిల్వర్ కార్డును వాళ్ళే తెగ గొట్టుకోగులుగుతారు.వాళ్ళ సిల్వర్ కార్డును వారే తెగగొట్టి , వారి హైయ్యర్ సెంటర్స్ నుండి తమ శరీరాన్ని విడుదల చేసుకుంటారు.సాదరణంగా దీన్నే జీవ సమాధి అంటారు.

 జీవబ్రహ్మ స్వామి,వీర బ్రహ్మేంద్ర స్వామి తదితర ఎంతో మంది మాష్టర్స్ ఇలా చేసారు.హస్పేట్ దగ్గర చాలమంది మాష్టర్స్(ఏడుగురు)అలా జీవసమాది చేసారు.అలాగే సదానంద యోగి గారు..తదితరులు. ఇచ్చామరణం అంటే చెప్పిన టైముకు వాళ్ళు ఖచ్చితంగా తమ శరీరాన్ని వదిలిపెడుతారు.మరో భయం ఏంటంటే మరెవ్వరో మీ సిల్వర్ కార్డును తెంపగొడుతారని. అలా ఎప్పటికి కూడా జరగదు.

Äఆరవ అపోహా: ఇంకో భయం ఏమిటంలే నేను ఆస్ట్రల్ ట్రావెల్ లో ఉన్నప్పుడు,వారి(ఇతరుల) సిల్వర్ కార్డ్స్, నావి పెనవేసుకుపోయి ట్రాఫిక్ జాం లో ఇరుక్కుపోయినట్లు ఇరుక్కపోతాయని.(నవ్వులు) ఆస్ట్రల్ గా ఎక్కడికో వెళ్ళిపోయి,తిరిగి వచ్చేప్పుడు నా రూం మర్చిపోతే వెనక్కి తిరిగి రావడం కష్టమని. అలా ఏం జరుగదు.ఆస్ట్రల్ ట్రావెల్ కు జి.పి.ఎస్ అనేది ఉంటుంది. (నవ్వులు)(జీవకణ పొజిషన్ సిస్టం.)గూగుల్ వాళ్ళది ఉంది కదా అలా.(గ్లోబల్ పొజిషన్ సిస్టం) మన ఆత్మలో సహజ సిద్ధంగా ఈ సమాచారం అనే ది మొత్తం ఉంటుంది. మీ శరీరంలోకి తిరిగి ఎలా రావాలో దానికి క్లియర్ గా తెలుసు. మీరు అస్ట్రల్ బాడితో శరీరం బయట ఉన్నపుడు మీ స్థూల శరీరంలో ఏ అసౌకర్యం ఏర్పడిన కూడా సిల్వర్ కార్డ్ ద్వారా సూక్షశరీరానికి తెలుస్తుంది.మీకు మూత్రంకోశం నిండి మూత్రం వచ్చే పరస్థితి ఉన్నా కూడా వెంటనే సూక్షశరీరాన్ని వెనక్కి రమ్మని సిగ్నల్స్ వెళుతుంటాయి. ఏలాంటి ఇబ్బంది వచ్చినా సిల్వర్ కార్డు ద్వార వెంటనే సూక్ష శరీరానికి సిగ్నల్స్ వెళుతుంటాయి.

     కాబట్టి ఇవన్ని కూడా మనం భయపడనవసరంలేని అపోహాలు. అస్ట్రల్ ట్రావెల్ అనేది ఒక సరదా కార్యక్రమం. అస్ట్రల్ ట్రావెల్ ఒక సహసపూరిత యాత్ర. అస్ట్రల్ ట్రావెల్ అనేది మీ అత్మోన్నతికి దోహదపడే చర్య.మీ అత్మ యొక్క అమరత్వానికి అది చిహ్నం.ఒక్క సూక్షశరీర ప్రయాణం మీ జీవితాన్నే మార్చేస్తుంది.ఒక ప్రకటన ఉంది.(ఐడియా సెల్ ఫోన్ వారిది).ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది అని (నవ్వులు) అలాగే నిజంగా అస్ట్రల్ ట్రావెల్ కూడా అందరు చేయదగ్గ అనుభవం ఇది. జీవితం పట్ల మీకు ఇప్పటి వరకున్న దృక్పధం 360 డిగ్రీల్లో పూర్తిగా మారిపోతుంది. మీకు తెలుస్తుంది అప్పుడు నేను ఈ స్థూల శరీరాన్ని కాదు,సూక్షాన్ని అని.అదొక్కటి చాలు. మనకు తెలియనటువంటి అవిధిత యధార్థం ఎంతో ఉంది తెలుసుకోవాల్సింది. ఆ ఒక్కటే మిమ్మల్ని పైకి తీసుకువెళుతుంది.

       కాబట్టి పై అపోహలనుండి ముందుగా బయట పడాలి.అస్ట్రల్ ట్రావెల్ చేయాలని,ఆకాంక్షించే వారు,కోరుకునే వాళ్ళు, ఆశించేవారు, ఆశయం ఉన్నవారు. కనీసం వీటిల్లో ఒక్క భయం ఉన్నా కూడా మీరు మీ శరీరం నుండి బయటకు రాలేరు. అస్ట్రల్ ట్రావెల్ అనేది ఒక సరదా విషయం అనేది మీకు తెలియాలి. అస్ట్రల్ ట్రావెల్ ఒక ఆనందం.అస్ట్రల్ ట్రావెల్ ఒక మధురమైన సాహసయాత్ర. అస్ట్రల్ ట్రావెల్ అనేది ఒక అధ్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం.

 ఒక సాథకుడు లేచి తన అనుభవం చెప్పాడు.ఒక యోగి అత్మకథ పుస్తకం చదివి అర్జెంటుగా మహావతార్ బాబాను కలుద్దామని బయలుదేరి చివరకు అనంతపురం జిల్లా లోని ఉరవకొండ పిరమిడ్ ధ్యానకేంద్రంలో పదిరోజుల మౌన ధ్యానం చేయడం,ఆస్ట్రల్ ట్రావెల్ చేయడం , దాంతో తన తనకున్న ఎన్నో భయాలు తొలిగిపోయి అప్పటినుండి ధ్యాన ప్రచారంకు దిగడం,వేల కొద్ది ధ్యానం క్లాసులు తీసుకోవడం అన్నీ వివరించాడు.(క్లాసులో చప్పట్లు)

 డా.న్యూటన్ : ఒక్క అనుభవం చూడండి,జీవితాన్ని ఎంతగా మారుస్తుందో. ఒక్క సూక్షశరీర ప్రయాణం మీ జీవితంపట్ల సంపూర్ణ అవగాహనను, అవలోకనాన్ని, దృక్కోణ్ణాన్ని , దృక్పదాన్ని మార్చివేస్తుంది. వేలమంది  ధ్యానుల అనుభవం కూడా ఇదే చెపుతుంది. ఇది ఒక రకంగా హనిమూన్ ఎక్స్ పీరియన్స్ లాంటిది.అంతా అధ్బుతంగా ఉంటుంది.మరొక దానితో పోల్చలేనటువంటుంది.హనిమూన్ ఎక్స్ పీరియన్స్ అనేది ఒక ప్రాథమిక స్థాయి అనుభవం. దానికంటే ఇది లక్షల రెట్ల ఉన్నత మైనది.

 అతి మధురమైన అనుభవం ఇది. మీరు ఎరుకతో ఉండి సూక్షశరీర ప్రయాణం చేస్తే వచ్చే ఆ అనుభూతి అత్యంత మధురమైనది, అత్యున్నతమైనది. దాని కోసం ఎంత ప్రయత్నాలు చేస్తారంటే , హిమాలయా యోగులు కూడ ఎరుకతో సూక్షశరీర ప్రయాణం చేయడానికి గుహాల్లో కూర్చొని ధ్యానం చేసుకుంటారు.

 కాబట్టి మితృలారా ప్రతి రాత్రి మనం స్వప్నావస్థలో ,తురియ అవస్థలో , ధ్యానులైతే వారి జాగృతావస్థలో సూక్షశరీర ప్రయాణాలు చేస్తుంటాం. వీటినే  ఒ.బి.ఇ స్ అంటాం. ఔట్ ఆఫ్ బాడి ఎక్స్ పీరియన్స్ అంటారు.( OBE’s

Out of body experience) మనం పడుకున్న తరువాత ఫ్లోటింగ్ సెన్సేషన్ వస్తుంది.

డా.న్యూటన్: ఇక్కడ ఎంత మందికి నిద్రలో అలాంటి అనుభవం కలిగింది?

ఒక సాధకురాలు తన అనుభవం చెప్పింది.

డా.న్యూటన్ : ఔను అది అందమైన అనుభవం.మెడిటేషన్ లో అస్ట్రల్ ట్రావెల్ అనుభవం రాని వారికి కలల్లో అదిజరుగుతుంటుంది.వాళ్ళకప్పుడు ఆస్ట్రల్ అనుభవాలన్ని కలల్లో జరుగుతుంటాయి. చాల వరకు కలలన్ని సూక్షశరీర ప్రయాణాలే.దాదాపుగా పదిశాతం మాత్రమే మాముల కలలు. మిగితా తొంబై శాతం కలలన్నీ మన సూక్షశరీరంతో,లేదా ఇతర హైయ్యర్ బాడీస్ తో సంబంధం ఉండే సూక్షశరీర ప్రయాణాలే. కాబట్టి ఇది మనం గుర్తు పెట్టుకోవాలి.

        కొన్ని సాదారణ కలలు మాత్రమే ఇందుకు మినహాయింపు.మనకు ఎవరిమీదో కోపంగా ఉంది. ఆ కలలో ఆ కోపం వ్యక్త పరుచబడుతాం. ఆకోపాన్ని ఆవ్యక్తిమీద వ్యక్తపరుస్తాం. లేదంటే ఆరోజు మీరు ఏం అహారం తినలేదు. కలలో మంచి బోజనం చేస్తుంటారు.రైలు తప్పిపోవడం, బస్పు తప్పిపోవడం,పరిక్షాపేపర్ రాయలేకపోవడం ఇట్లాంటివన్ని సాదారణ కలలు. కాని ఇతర చాలవరకు కలల్లో స్వప్నావస్థలో సూక్షశరీరం విడుదల అవుతుంది.కొంత మందికి ఎరుకతో జరుగుతుంది.

ఇందాక మనం చెప్పుకున్న  ఎన్నో అనుకూల , వ్యతిరేక గుణాలు ఈ ఆస్ట్రల్ ట్రావెల్ లోఉన్నాయి. ఎంతో మంచి మార్పు అనేది మనలో జరుగుతుంది.

ఇందాక మీరు చెప్పినట్లుగా (ఉరవకొండలో ధ్యానం చేసిన సాధకున్ని ఉద్దేశించి) మీ నిర్ణయం మార్చుకున్నారు.హిమాలయ పర్వతాలకు ఇప్పడు మీరు వెళ్ళనక్కరలేదు. హిమాలయ వర్వతాలే మీ దగ్గరకు వస్తాయి. మీరు రెడిగా ఉన్నప్పుడు మహాఅవతార్ బాబాజియే మీ దగ్గరకు వచ్చి కలుస్తాడు. మీరు చేయాల్సింది ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చారు మీరు.కాబట్టి ఆ మెసేజి ట్రాన్సఫర్మేటీవ్ మేసేజ్. మీరు చక్కగా మీ ధర్మాన్ని మీరు నేరవేర్చారు. వేలకొద్ది క్లాసులు తీసుకోగలిగారు. అది  అందమైన ట్రాన్సఫర్మేషన్.

అలాగే హీలింగ్ ఎక్స్ పీరియన్స్. నాలుగురోజులు పిరమిడ్ లో ఉంటే మాష్టర్స్ అంతా వచ్చి ఆమె మీద సర్జరి చేయడం. ఆస్ట్రల్ బాడిలో ఆవిడకు ఎనర్జీ కరెక్షన్స్ అన్నీ చేసారు. వీటిని హిలింగ్ ఎక్స్ పీరియన్స్ అంటారు.

మన అస్ట్రల్ ట్రావెల్ లో ఆస్ట్రల్ గైడ్స్ ను కూడా కలుస్తాము. ఎలాగైతే మనం ఎ.కె.జి,యుకేజి,ఫస్ట్,సెకండ్ స్టాండర్స్  చదువుతున్నప్పుడు కనీసం ఇద్దరు టీచర్సన్నా ఉంటారు కదా. అలాగే మనందరికి ఒక్కోకరికి ఇద్దరు చొప్పన ఆస్ట్రల్ గైడ్స్ ఉంటారు. ఒక్కరు కాదు, ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరు మనకు రక్షణ కల్పిస్తుంటారు.మీరు ఎప్పడు అస్ట్రల్ ట్రావెల్ ఐనా చేయ్యండి, మీరు ఒంటరిగా వెళుతున్నానని మాత్రం భయపడకూడదు మీరు గుర్తించకపోయినా,మీరు చూడకపోయిన, ఆ ఇద్దరు మీ వెన్నంటే ఉంటారు. మీరు పరీక్షగా చూస్తే వాళ్ళ ఉనికి మీకు తెలుస్తుంది. ఈ గైడ్స్ మధ్యలో మారు తుంటారు. ఎప్పుడంటే, మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకున్నతరువాత హైయర్ గైడ్స్ దిగుతారు.మీకు ఎల్.కె.జీ, యుకేజి అనుభవాలు,నేర్చుకోవాల్సిన విషయాలు అయిపోయాయి తరువాత చెప్పగలిగే  మాష్టర్ గైడ్స్ వస్తారు. ఆవిషయం మీకు కూడా తెలుస్తుంది. ఈ గైడ్ తో అయిపోయింది మరో గైడ్ వచ్చారని.

         ఇలాంటి చక్కని అనుభవాలు కలుగుతాయి. మీ వ్యక్తిత్వ  కూడా ఉన్నతంగా మార్పుచెందుతుంది. ఒక్కసారి ఆస్ట్రల్ ట్రావెల్ చేసాకా మీ ఆలోచనల్లో గొప్ప సృష్టత వస్తుంది. సరిగ్గా చూడడం వస్తుంది. మనకు దేన్ని సరిగాచూడడం రాదు. ఏది చూసిన కూడా సరియైన విధంగా చూడాలి.

మేలు ఎంచి కీడు ఎంచు అన్నారు. సరిగ్గా చూడకపోతే కీడు ఎంచి మేలు ఎంచుతాం.ముందుగా కీడు ఎంచుతాం. వారిలోని వ్యతిరేక దుర్గుణాలన్ని చూస్తాం.వారితో వైరం పెంచుకుంటాం. మనం చేయాల్సింది ముందుగా ఎదుటి వారిలో ఉన్న సుగుణాలు చూడాలి. మనం ఆస్ట్రల్ ట్రావెల్ చేసాకా సరైనా దృక్పదం,సరైన ఆలోచన,సరైన అవగాహన మనకు లబిస్తాయి. ఏది తప్పో , ఏది ఒప్పో సరైన నిర్ణాయత్మక శక్తి మనకు కలుగుతుంది. మీ అంతర్గత సామర్ధ్యం వంద రెట్లు పెరిగిపోతాయి.మీ అంతర్వాణి చెప్పేది మీరు సరిగ్గా వినగలుగుతారు. టెలిపతి, మరొకరు మీతో చెప్పే సందేశం, వారు చెప్పకముందే మీకు తెలుస్తుంటుంది. వారు చెప్పదలిచే పదాలు సరిగ్గా వాటినే మీకు ముందే వచ్చేస్తాయి.

క్లియర్ వాయిన్స్, కొన్ని దృశ్యాలు మీకు ముందే కనపడుతాయి. వీటన్నింటిని అతీంధ్రయ శక్తులని, సిక్త్ సెన్స్ అని అంటాం.వీటన్నింటిని మనం అతి గొప్ప అతీంధ్రయ శక్తులు కావు. వీటిని సహజమైన శక్తులనే చెప్పుకోవచ్చును. కాకపోతే మనం వాటిని గుర్తించ లేదంతే.వాటిని నిజంగా మనం గుర్తించేవరకు సరిగ్గా ఎదుగలేము. నిత్య జీవితంలో వీటన్నింటిని మనం ఉపయోగించవచ్చును. మనం అంతర్వాణి ప్రతి సారి చెపుతుంటుంది, ఏది సక్రమం ఏది సక్రమం కాదు అని. ఈ నిర్ణయం తీసుకోవాలా వద్దా  అనికూడా  ప్రతి సారి మన అంతర్వాణి చెపుతూనే ఉంటుంది. హీలింగ్ అనుభవాలు కూడా కలుగుతుంటాయి.గత జన్మ సృతులు కూడా వస్తాయి.సూక్షశరీర ప్రయాణం చేసేప్పుడు మన ఆస్ట్రల్ బాడి గత జన్మ ఙ్ఞాపకాల వరకు కూడా వెళుతుంది.

మీ అస్ట్రల్ బాడి రిలీజ్ అయిన తరువాత ఏదైతే ముఖ్యమైన గత జన్మల ప్రభావం ఉన్నాయో అవి మొత్తం ఒక్కోక్కటి బయటకు వస్తాయి. తరువాత మనం ఎంతో మంది మాష్టర్స్ ను కలుస్తాము. అస్ట్రల్ బాడి ఆస్ట్రల్ తలలాకు,లోకాలకు వెళుతుంది. లోయర్ , హైయ్యర్ అస్ట్రల్ వరల్డ్స్ అని ఉంటాయి. ఎన్నో ఆస్ట్రల్ వరల్డ్స్.అక్కడకు వెళితే మనకు రాబుద్ది కూడా కాదు. ఈ ప్రయాణం పూర్తి వినోధంగా, విఙ్ఞాన భరితంగా ఇన్ స్పిరేషన్ గా ఉంటుంది. ఎంతో మంది ఆస్ట్రల్ ఫ్రెండ్స్ ను కలుస్తాము. ఎంతమందిని కలుస్తాం అంటే , మీరెప్పుడు ఒంటరి అని ఫీల్ కానేకారు. ఆ అస్ట్రల్ ఫ్రెండ్స్ ఎంతగా మిమ్మల్ని ఆత్మ స్నేహితుడుగా ఫీలవుతారంటే ఇక్కడి మాదిరిగా దూరాలు ఉండవు.

 ఇక్కడ భూమ్మీద నువ్వు వేరు నేను అనే భావనతో ఉంటాం. అక్కడికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనమంతా ఒక్కటే అనే ప్రభావంతో మీతో ఉంటారు. చాలమంది అంటుంటారు….ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తే, ఇంకా అంతా అన్ని అస్ట్రల్ వరల్డ్స్ నే కదా అని. ఇక ఈ భౌతిక ప్రపంచాన్ని మరిచిపోతామని. అలా కాదు. ఒకసారి అస్ట్రల్ ట్రావెల్ చేసాకా మన భౌతిక ప్రపంచం పట్ల మరింతగా గౌరవం పెరుగుతుంది. మన జీవితం పట్లకూడా గౌరవం పెరుగుతుంది. మన జీవితం ఇంకా అత్యున్నతంగా జీవించవచ్చు అనే  ఙ్ఞానం పెరుగుతుంది.

ఎంత అధ్బుతంగా ఆనందంగా జీవించవచ్చు అనే ఙ్ఞానం మనకు దొరుకుతుంది. చాలమంది అస్ట్రల్ ట్రావెల్ గురించి, ఇక్కడ భూమి మీద ఏంలేదు, అంతా అక్కడే (ఆస్ట్రల్ ప్రపంచం)ఉంది అనుకుంటారు. కాదు. మనమే ఎంచుకుని ఇక్కడ భూమండలం మీదకు వచ్చామని ఙ్ఞానం కలుగుతుంది.

(ఈ భూమి, ఈజీవితం ఎంతో గొప్పవనే అవగాహనకు వస్తాం)

4. సూక్షశరీర ప్రయాణంలో నాలుగు స్థితులు. 

తరువాత ఇప్పుడు ఇక ఆస్ట్రల్ ట్రావెల్ లోని వివిధ స్థాయిల గురించి తెలుసుకుందాం.అస్ట్రల్ ట్రావెల్ లో వివిద రకాలైన స్థాయిల్లో ఈ ఆస్ట్రల్ ట్రావెల్ జరుగుతుంది. ఈ భూమండలం మీద అన్ని ప్రపంచదేశాలనుండి అమెరికా,ఐరోపా,అస్ట్రేలియా,ఇండియా అంతాటా కల ఒక 1000 మంది ధ్యానుల అనుభవాలన్ని క్రోడికరిస్తే అందరినుండి ఇదే ఙ్ఞానం వచ్చింది.అందరు కూడా ఇదే విషయం చెప్పారు. నాలుగు స్థాయిల్లో ఈ ఆస్ట్రల్ ట్రావెల్ జరుగుతుందని.

ÄÄÄÄ  నాలుగు స్థాయిల్లో జరిగే సూక్షశరీర ప్రయాణం.    

1) మొదటి దశ – మహ స్పందన స్థాయి స్థితి. (వైబ్రేషన్ స్టేజి)

  

మీ ఆస్ట్రల్ బాడి రిలీజ్ అయ్యేముందు మీ శరీరంలో ప్రకంపనలు పెరుగుతాయి(బాడిలో వైబ్రేషన్స్). శరీరం తక్కువ ప్రకంపనల స్థాయి నుండి ఎక్కవ స్థాయి  ప్రకంపన స్థాయికి వెళుతుంది. మీ ఎనర్జీ లెవల్స్ పెరిగిపోతాయి. ప్రకంపణాల స్థితి వస్తుంది. సాదారణంగా మన కాళ్ళ వేళ్ళ నుండి ప్రకంపణాల స్థితి మొదలయ్యి మొత్తం శరీరం అంతా వ్యాపిస్తుంది.ఆ ప్రకంపణలు అసౌకర్యంగా ఏమి ఉండవు. శరీరంలో సౌకర్యంగానే ఆ ప్రకంపనల సెన్సేషన్స్ ఉంటాయి. ఆ ప్రకంపణాలను చూస్తే ముందుగా భయమేస్తుంది. ఏంటి నా శరీరం ఊగిపోతుంది,ఏదో తిమ్మిరి తిమ్మిరిగా ఉంది,బరువెక్కిపోతుంది అనిపిస్తుంది. చాలమందికి వారి శరీరం వేల కొద్ది కిలోల ,టన్నుల బరువు ఎక్కువైనట్లు అనిపిస్తుంది. ఒక ఏనుగును మీ మీద పెట్టేస్తే ఎంత బరువు ఉంటుంది? అ మొదటి స్థితిలో మీ శరీరం అంతా బరువెక్కిపోతుంది.

 ధ్యానంలో కూర్చుంటారు.చాలా విపరీతమైన బరువు వచ్చేస్తుంది.శరీరం బరువెక్కింది,తిమ్మిరెక్కింది అని భయమేస్తుంది.  స్ప్రహ కోల్పోతామే ఏమో అని కూడా అనిపిస్తుంది. అది ఏమంటే మహా స్పందన స్థాయి.(వైబ్రేషన్ స్టేజి)ఇది మీరు నిద్రపోతున్నప్పుడు కూడా కలుగువచ్చును. మీరు నిద్రపోతున్నప్పడు, సరిగ్గా నిద్రలోకి జారుకునే సమయంలో ఒక సంధి ఆవస్థలో అటూ చైతన్య స్థితినుండి చైతన్యం లేని స్థితిలోకి జారిపోతుంటారు. ఈ రెంటికి మధ్యలో ఒక దశ ఉంటుంది.

అటూ పూర్తి చైతన్యం (కాన్షియష్)కాదు, చైతన్యం లేని స్థితి (ఆన్ కాన్షియష్ ) కాదు. మద్యలో ఉంటారు.

 సూక్షశరీర ప్రయాణంలో అలాంటి స్థితే, మొదటిదైన మహ స్పందన స్థాయిలో ప్రకంపనలు పెరిగిపోయి మీ శరీరం విపరీతంగా బరువు పెరిగిపోతుంది. అప్పుడు మీకు భయమేస్తుంది. మీ చేతులను ఎత్తాలనుకుంటారు.కళ్ళు తెరువాలనుకుంటారు. చేతులు ఎత్తలేరు. కళ్ళు తెరువలేరు. తరువాత ఎవరినైనా పిలువాలనిపిస్తుంది. గొంతెత్తి ‘‘నాకు ఇలా అవుతుంది రండి రండి’’ అని ఎవరినైనా పిలువాలనిపిస్తుంది.అప్పడు ఎవరిని మీరు పిలువలేరు.ఒక్క మాట కూడా మీ గొంతులోనుండి రాదు.

 అలాగే మీ చాతి బరువెక్కిపోతుంది. ఎంత బరువెక్కిపోతుంది అంటే ఏదో దయ్యం మొచ్చి కూర్చుంది అని భయమేస్తుంది. అది దయ్యం కాదు మీ సూక్షశరీరమే,మీ స్థూల శరీరం నుండి విడుదల కావడానికి సిద్ధంగా కూర్చుంది. చాలమందికి ఆ భయంలో ఏదో అస్ట్రల్ ఘోస్ట్ వచ్చి నా మీద కూర్చుందని, మాములుగా అయితే దయ్యం తొక్కిందని అంటారు. పల్లెల్లో తెలియక నన్ను దయ్యం తొక్కిందని అంటుంటారు. కాదు. ఆదయ్యం మీదే. మీ శరీరం నుండి బయటకు వచ్చే క్రమంలో ముందుగా అక్కడ అతిభారం అయిపోతుంది.కాబట్టి ఇది మహా స్పందన స్థాయి. కాబట్టి ఎవరైతే మహాస్పందన స్థాయి అనే ఈ భయాన్ని అధిగమిస్తారో , వారు రెండవ స్థితి

అయిన సూక్ష్మ శరీరం విడిపడడం అనే స్ధాయికి వెళ్ళిపోతారు.


2) రెండవ దశ.  స్థూల శరీరం నుండి సూక్ష్మశరీరం విడిపడే స్థితి.   

 స్థూల శరీరం మరియు సూక్షశరీరం రెండు విడిపోవడం.ఈ స్థితి జరిగేప్పుడు కూడా మనకు కొన్ని వాసనలు,సువాసనలు రావడం శబ్ధాలు వినపడడం జరుగుతాయి. సాదారణంగా శబ్దాలు వినపడుతాయి. ఒక చక్కని మ్యూజికల్ సౌండ్స్ వినిపిస్తాయి. వివరీతంగా గాలి హోరెత్తినట్లుగా,వీస్తున్నట్లుగా అనిపిస్తుంది. లేదంటే అప్పటివరకు బరువుగా ఉన్న శరీరం ఒక్కసారిగా తేలిక అయిపోతుంది.

ఎంత తేలిక అయిపోతుందంటే బెలూన్ లాగా పైకి తేలిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ సమయంలో మీరు శరీరం బయట ఉన్పప్పుడు మీకు భయమేస్తుంది. నేను చనిపోయానేమో,మరణించానేమో, ఇక నా పిల్లల గతి ఏంటి అనే ఒక భయమేస్తుంది. సాదారణంగా మనకు ఆ భయం ఎప్పుడు వస్తుందో మనం ఆటోమెటిగ్గా మన స్థూల శరీరంలోకి దూకుతాం(జంప్ చేస్తాం) వచ్చి ధాం..అని పడిపోతాం.ఈ భయాన్ని కూడా జయించాలి…ఈ రెండో స్థితిల కూడా భయం కలుగుతుంది.

(అప్పడు ..ఒక సాథకురాలు తనకు ఫూణెలోని ఒషో మెడిటేషన్ సెంటర్లో వచ్చిన అనుభవం చెప్పింది. వేరేలోకంలో ఒక మీటింగ్ కు హజరైన్నట్లు,తరువాత భయమేసి వెంటనే కళ్ళు తెరిచి చూడగానే తిరిగి స్థూల శరీరంలో ఉన్న స్థితికి రావడం వర్ణించింది.)

   కాబట్టి నేను ఎక్కడ ఉన్నాను అనే భయం కల్గినప్పడు తిరిగి స్థూల శరీరంలోకి వచ్చిపడుతాం.దానిని కూడా మనం అధిగమించాలి.ఇవన్ని మెళుకువలు.సూక్షశరీర ప్రయాణంలో ఇవన్ని నేర్చుకోవాల్సిన మెళుకువలు.వాటిని గుర్తించాలి.ఎరుకతో ఉండాలి.మహ స్పందన స్థాయి వచ్చిందంటే అది మొదటి స్థితి అని వాసనలు,శబ్దాలు,శరీరం తేలిక అయిపోయే స్థితి వచ్చిందంటే అది రెండవ స్థితి అని గ్రహించగలగాలి.కారులో మొదటి గేరు నుండి రెండవ గేరు వేసుకన్నట్లు , రెండవగేరు నుండి మూడవ గేరుకు వేసుకున్నట్లు .. మూడవ గేరుకు వెళ్ళినప్పడు మూడవ స్థితి.. అన్వేషణ స్థాయి.(ఎక్స్ ప్లోరేషన్ స్టేజి).

 సి) మూడవ స్థితి.. అన్వేషణ స్థాయి.

 మీ సూక్షశరీరం బయటకు వచ్చిన తరువాత అన్వేషణ స్థితిలోకి వెళ్ళాలి.మీ శరీరం బయట ఉన్నప్పడు మీకు తెలిసిపోతుంది, నా స్థూల శరీరం అక్కడ నిద్రపోతుందా లేదా ధ్యానం చేసుకుంటుంది అని. తరువాత మీగదిలో పక్కన ఉన్న గోడలు చూస్తారు. ఇష్టమున్న ప్రకృతిని చూస్తారు. ఏమేమి ఉన్నాయో అన్ని చూడగలుగుతారు. సూక్షశరరీంతో మీకు ఎలాంటి దృష్టి (విజన్) వస్తుందంటే 360 డిగ్రీల విజన్ వస్తుంది. స్థూల శరీరంతో ఉన్పప్పడు మీరు ఒక్క ముందున్నవి మాత్రమే చూస్తారు. సూక్షశరీరానికి అన్నీ కళ్ళే. మొత్తం చుట్టూరుగా ఉన్నదంతా తెలిసిపోతుంది.క్రిస్టల్ క్లియర్ క్లారిటి విజన్ ఉంటుంది.ప్రతీది కలర్స్ తదితరం క్లియర్ గా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఆరా కలర్స్ కనిపిస్తాయి. మీ పడక గదిలో గడియారం ఉందనుకోండి. ఆస్ట్రల్ బాడిలో ఆ గడియారంలో టైం చూడడానికి ట్రైచేసారనుకోండి. ఆ గడియారం గడియారం రూపంలో కనిపించదు. దాని శక్తి స్వరూపం(ఎనర్జీ ఫామ్) కనిపిస్తుంది మీకు.వేరే కలర్ లో వేరే రూపంలో దాన్ని చూస్తారు.టైంను క్లియర్ గా చూడగలుగుతారు.ప్రతిదాంట్లో దాని ఆరా కలర్స్ కనిపిస్తాయి. గోడ కలర్స్ చూస్తే దాని ఆరా తెలుస్తుంది మీకు.మీరు భౌతికంగా చూసినప్పడు మాదిరిగా కాక దాని ఆరా కలర్స్ మీకు కనిపిస్తాయి.

 కాబట్టి ఈ మూడవదైన అన్వేషణ స్థాయిలో మీరు ఏం చేయవచ్చంటే , మీ శరీరంనుండి బయటకు వచ్చిన తరువాత వెంటనే ఎక్కడికో వెళ్ళిపోకుండా మీ ఎరుకతో ఎక్కడున్నారో చూసుకోవాలి.మీ స్థూల శరీరాన్ని మీరు చూసుకోవాలి.ఆ ఎరుకను మీరు సాధించాలి.మీ సిల్వర్ కార్డును మీరు చూసుకోవాలి.ఆ తరువాత మీరు ప్రయాణం చేయవచ్చును, ఎక్కడికైనా…ఫ్రీ టికెట్.. ఈజిప్ట్ అంటే ఈజిప్ట్..హిమాలయా పర్వాతాలు అంటే హిమాలయా పర్వాతాలు.ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు.నో వీసా..నో పాస్ పోర్టు. ఏ కంట్రీ కైనా మీరు వెళ్ళిపోవచ్చు. అన్వేషణ స్ధాయిలో మనం టూర్ ప్రోగ్రాం సిద్ధం చేసుకోవచ్చు.(ఐటనరి ప్రిపేర్)

 నేను ఇక్కడికి వెళ్ళి.నా ఆస్ట్రల్ గైడ్ ను కలిసి ,ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి,నా ఫ్రెండ్ కు కూడా బై చేప్పి , అటునుంచి ఇటు వచ్చేస్తాను అని ప్రోగ్రాం సిద్ధం చేసుకోవచ్చు.కాని ఆ ఎరుకను పంపాదించడానికి మీరు ఆరంభంలో చాలా ఆస్ట్రల్ ట్రావెల్ చేసి ఉండాలి.మీ ఆస్ట్రల్ బాడి కనీనం  పదిసార్లు  తరుచుగా రిలీజైతే తరువాత మీ ప్రొగ్రాం ప్రకారం వెళ్ళగలుగుతారు. మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళగలుగుతారు.లేదంటే మన అస్ట్రల్ బాడి రిలీజ్ కాగానే కొత్తలో దానంతట అదే ఎక్కడికో వెళ్ళిపోతుంది.మీ ప్రమేయం లేకుండానే ఎక్కడికో వేరేలోకంలోకి ప్రయాణిస్తుంది. కొత్తలో అలా జరుగుతుంది.కాని కనీసం ఒక పది అస్ట్రల్ ట్రావెల్స్ చేసాక మీరు నిర్ణయించుకుంటారు.మీరు ఎక్కడికి వెళ్లాలి అనేది చక్కగా  మీ నిర్ణయం ప్రకారమే జరగుతుంది.ఈ రోజు అక్కడికి వెళ్ళి నా ఆస్ట్రల్ గైడ్ ను కలువాలి అనుకుంటే ఆ గైడ్ నే కలుస్తారు.ఈ రోజు ఆ మాష్టరు దగ్గరే నేర్చుకోవాలి అని ప్రోగ్రాం సిద్దం అంటే అట్లాగే జరుగుతుంది. కాబట్టి ఇది మూడవదైన అన్వేషణ స్థితి.

డి) నాలుగవ దశ. పున ప్రవేశ స్థాయి స్థితి.(రి ఎంట్రి స్టేజి)

 మీ అస్ట్రల్ ట్రావెల్ ఆరోజుకు పూర్తయ్యింది.మీరు అనుకున్న ఆప్రయాణంలో నేర్చుకోవాల్సింది నేర్చుకుని పొందాల్సిన అనుభవాన్ని ,అనుభూతిని పొందారు.ఆ అడ్వంచర్ పూర్తయింది. మీ శరీరం దగ్గరకు వెనక్కి వస్తున్నారు.వెనక్కి వచ్చినప్పుడు మీ స్థూల శరీరంలోకి ధన్ మని పడిపోకుండా నెమ్మదిగా చేరుకోవాలి. స్లోగా లాండింగ్ కావాలి.

ఇంతకు ముందు ఒక జోక్ ఉండేది . లాండింగ్  కావడం గురించి అందరు, కింగ్ ఫిషర్ ఏయిర్ లైన్స్ కు, ఇండియన్ ఏయిర్ లైన్స్ ను కంపారిజన్ చేసేవారు.

ఇండియన్ ఏయిర్ లైన్స్ విమానం ఎక్కిన వారంత గజగజ వణికి పోతారు. ఎందుకంటే, ఆ ఫైలట్ ఫ్లైట్ లాండ్ చేసేప్పుడు ఏదో క్రాష్ చేసిన మాదిరిగా లాండ్ చేస్తాడు, ఏయిర్ లైన్స్ ఫైలట్స్ అందరు కూడా. విమానం లాండింగ్  అయ్యేప్పడు అది దబ దబ అని శబ్దం చేస్తూ లాండ్ అవుతుంటే, అది కూలిపోతుందేమో, చచ్చిపోతామేమో అనిపించేది అందరికి. ఎట్లాంటి వారైన వణికిపోయేవారు. అదే కింగ్ ఫిషర్ విమానం అయితే చాలా స్మూత్ లాండింగ్ ఉంటుంది. అసలు లాండింగ్ అవుతుంటే దిగినట్లే ఉండదు. అలా లాండింగ్ చేయాలి. కింగ్ ఫిషర్ విమానంలా మన బాడిలోకి లాండింగ్ చేయాలి. రి ఎంట్రి స్టేజి అంటే పునః ప్రవేశించడం. సూక్షశరీరం తిరిగి స్థూల శరీరంలోకి తిరిగి రావడం. నిదానంగా మీ శరీరంలోకి స్టెప్ బై స్టెప్ జాయిన్ కావడం.

          జాయిన్ అయినప్పుడు మళ్ళి మీ శరీరాన్ని ఎరుకతో గమనించాలి.అది కంప్లీట్ ఆస్ట్రల్ ట్రావెల్. సాదారణంగా గంటన్నర పాటు

ఆస్ట్రల్ ట్రావెల్ చేయడం జరుగుతుంది.సర్వసాధారణంగా  కొత్తలో అంతకంటే తక్కువే ఉంటుంది. తరువాత దశల్లో మీ స్థాయిని పెంచుకోవచ్చు, మీ ఐటనరి (తిరిగే ప్రయాణం) ప్రకారం. ఇది ఒక అధ్బుతమైనటువంటి అనుభవం. ఎందుకు ఈ స్టేజెస్ గురించి చెపుతున్నానంటే , సాదరణంగా కొత్తలో కొన్ని స్టేజెస్ ను మద్యలో వదిలి(స్కిప్) వేస్తారు. ఈ మహా స్పందన స్థాయి వైబ్రేషన్ వచ్చిన తరువాత సడెన్ గా ఎక్స్ప్ ప్లోరేషన్ లోకి వెళ్ళిపోతారు. అప్పడు ఈ స్టెప్స్ బైపాస్ అవుతాయి. ఇట్స్ ఓ.కె.  కొంత మందికి ఒకదాని తరువాత ఒక స్థాయి రిలీజ్ అవుతుంది. మనం ఎరుకతో ఉంటే మాత్రం ఒకదాని తరువాత ఒక దశను, స్థితిని మనం గుర్తిస్తాం.

 ప్రతిరోజు రాత్రి మీరు ప్రయత్నించవచ్చును.అందరు కూడా మీరు నిద్రపోయేప్పడు శవాసనంలో పడుకుని ఉండి, నిద్ర వచ్చేప్పటి సమయం

(అబౌట్ టూ స్లీప్) స్టేజ్ లో మిమ్మల్ని మీరు ఎరుకతో గమనించుకోవాలి.

      ఒకే సారి నిద్రలోకి వెళ్ళిపోకుండా,నిద్రలోకి జారిపోకుండా మహా సూక్షంగా

ఎట్లా నిద్రలోకి వెళుతున్నామో ఆ సంధి సమయాన్ని మహా జాగ్రత్తగా

గమనించాలి.

     ఆ స్టేజిలో మహా స్పందన స్థాయిని మీరు గుర్తిస్తారు. అందరికి కామన్ గా

ఆ స్థితిని త్వరలోనే గుర్తిస్తారు. శరీరంలో ఆ వైబ్రేషన్స్ తెలిసిపోతాయి. ఎనర్జీ క్రష్ అవుతుంది. ప్రాణమయ కోశం అంతా ఎనర్జీ సాచురేషన్ వస్తుంది. ఆ తరువాత శరీరం తేలిక అయ్యి, సూక్షశరీరం రిలీజ్ అయ్యే స్టేజి వస్తుంది. ఆ టైంలో మీరు క్యాచ్ చేయాలి. ఆ తరువాత మీరు కాన్షియస్ గా (మెళుకువ స్థితిలో) ఆస్ట్రల్ ట్రావెల్ చేసుకోవచ్చు.

       ప్రతిరోజు రాత్రి నిద్రపోవడానికి ముందుండే సమయం ధ్యానం చేసుకోవడానికైనా, ఆస్ట్రల్ ట్రావెల్ టైం కైనా అత్యున్నతం.

       ఈ దిగువ బొమ్మల్లో  కొన్నింట్లో అస్ట్రల్ బాడి థర్డ్ ఐ అయిని పీనయిల్ గ్లాండ్ దగ్గర కనెక్ట్ అయినట్లు మరికొన్నింట్లో బొడ్డునుండి కనెక్ట్ అయినట్లు కనపడుతుంది. అసలు అస్ట్రల్ బాడి శరీరంలో  ఎక్కడినుండి రీలిజ్  అవుతుంది అని మీరు నన్ను అడుగవచ్చును.

           ఇప్పటి వరకు చాలామంది వారి అనేకరకాలైన అనుభవాలను

తెలియచెప్పారు. చాలా మందికి థర్డ్ ఐ ఫీనయిల్ గ్లాండ్ ద్వారా తలపైభాగన్నుండి  రీలీజ్ అయ్యిందని చెప్పారు.

                అస్ట్రల్ బాడి రిలీజ్ అయినప్పుడు తలవెనుకాల నుండి రిలీజ్ అయినట్లు చెప్పారు.మరి కొంత మందికి బొడ్డునుండి తేలిక అయిపోయి రీలీజ్ అవుతుంది. వారికి సిల్వర్ కార్డు బొడ్డునుండి కనెక్ట్ అయినట్లుగా తెలుస్తుంది. కాబట్టి అనేక రకాల అనుభవాలకు కూడా సంభావ్యత ఉన్నది.

          ఈ అనుభవాలను మీరేం జడ్జ్ చేయనవసరంలేదు. అన్ని అనుభవాలు వేటికవే గొప్పవి,నిజమైనవి. ఎందుకంటే సిల్వర్ కార్డ్ అనేది

చక్రాల్లో పాస్ అయ్యే సుషుమ్న నాడికి కనెక్ట్ అయ్యి ఉంటుంది.

సాదారణంగా మూడవ దైన మణిపూరక చక్రం ఓపెన్ అయినప్పుడు  మొదటిసారి ఆస్ట్రల్ ట్రావెల్ కూడా జరుగ వచ్చును. అలాంటప్పుడు బొడ్డునుండి సిల్వర్ కార్డ్ తో అస్ట్రల్ బాడి కనెక్షన్ చూస్తాం.

కొందరు ఎన్నో జన్మలనుండి సాధన చేసి, థర్డ్ ఐ ఆజ్ఞా చక్రం వరకు  చేరుకున్న వారికి ఆస్ట్రల్ బాడి రిలీజ్ అయినప్పడు తల పై భాగం నుండి జరిగిందని తెలిసిపోతుంది. ఒక టగ్ లాంటి ప్రకంపన (సెన్షషన్ ) తల వెనుక భాగంనుండి వస్తుంది.అస్ట్రల్ బాడి తలవెనుక భాగం నుండి రిలీజ్ అవుతుంది

6.   సూక్షశరీర ప్రయాణం టెక్నిక్స్–మెథడ్స్          

మొత్తం 100 టెక్నిక్స్ వరకు ఉన్నాయి , వాటిల్లో ముఖ్యమైన

40 పైన టెక్నిక్స్ , మెధడ్స్ గురించి  ఇక్కడ తెలుసుకుందాం.

1వ టెక్నిక్ . నిద్రపోయే సమయం.      

ఫస్ట్ టైమ్ ఆస్ట్రల్ ట్రావెల్ చేసేవారికి నిద్రపోతున్న సమయం అత్యున్నతమైనది.ఫస్ట్ టైం నాకు ఆస్ట్రల్ ట్రావెల్ అనుభవం వచ్చినప్పడు నేను దానికి చాలా ఆకర్షితుడైనాను. దాని మీద చాలా రిసెర్చ్ చేసాను. దాని మీద కనీసం ఒక వంద పుస్తకాలుచదివాను.(ఇంగ్లీష్ లో) అమెరికా వారివి,సౌత్ అమెరికన్స్ వి, యురోపియన్స్ వి,  షామన్స్ వి, ఇలా రకరకాల ఎక్స్ పీరియన్స్ చదివాను.అందరి ఎక్స్ పీరియన్స్ సర్వ సాదారణంగా ఒకే మాదిరిగానే ఉంది. ఎందుకంటే అస్ట్రల్ బాడి అనేది అందరికి కామన్. అది రిలీజ్ అయినప్పుడు అందరికి కామన్ ఎక్స్ పీరియన్స్ వస్తుంది.

               ఒక హర్ట్ ఓపెన్ చేసినతరువాత  కార్డియోథొరాసిక్  సర్జరి లో చూస్తే హార్ట్ లో నాలుగు చాంబర్స్ కామన్ గా ఉంటాయి. అంతే కామన్.

అస్ట్రల్ బాడి రిలీజ్ అయినప్పడు కూడా దాని ప్రాసెస్ అంతే కామన్ గా ఉంటుంది.  కాకపోతే కొందరు కొన్ని మెలుకువలు చెప్తారు అంతే. నేను దాదాపు 1989 నుండి ఇప్పటి వరకు (2014) రిసెర్చ్ చేస్తూనే ఉన్నాను.

దీనికి అంతం అనేది లేదు.. ఇప్పటికి దాదాపుగా ప్రతి మూడు రోజులకు ఒకసారి నాకు ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్ పీరియన్స్ వస్తుంది.

    అది నాకు దానంతట అదేసహజ సిద్దంగా(స్పాంటేనియస్ గా ) జరుగుతుంది.విల్లింగ్ గా కల్పించుకుని ఆస్ట్రల్ ట్రావెల్ చేయను. స్పాంటేనియస్ గా బాడినుండి ఆస్ట్రల్ బాడి రిలీజ్ అయినన్పడు అది ఇంకా మధురంగా ఉంటుంది. ఆస్ట్రల్ బాడి దానికదే రిలీజ్ అయినప్పడు వచ్చే అనుభవాలు,అనుభూతులు ఇంకా లోతుగా ఉంటాయి.

            కావాలని ఉద్ధేశ పూర్వకంగా చేసేకంటే( ఇంటెన్షన్ ) అన్ ఇంటెన్ష
నల్ గా ( ఎలాంటి ఉద్దేశ్యం లేకుండా )మీ యొక్క వైబ్రేషనల్ స్టేజి పెరిగి వచ్చే అస్ట్రల్ ట్రావెల్  చాలా మధురంగా ఉంటుంది. కాబట్టి మీరు నిద్రపోయే ముందు ‘‘ఈ రోజు నేను ఆస్ట్రల్ బాడి జర్ని చేస్తున్నాను’’ అని ప్రతిరోజు సంకల్పించుకోని నిద్రపోండి. ఏదో ఒక రోజున మీకు అస్ట్రల్ బాడి ప్రయాణం చేస్తారు.

  2వ టెక్నిక్ , మెలుకవ – నిద్ర మద్య స్థితిని గమనించడం.

    మొదటిది రెండవది దాదాపు ఒకటే..కొంచెం తేడా ఉంది. కాన్షియష్ అన్

కాన్షియస్ మిడిల్ స్టేజిని క్యాచ్ చేయాలి.  జాగ్రధావస్థ, నిద్రావస్థ మద్యన

మిడిల్ లో ఒక థిన్ లైన్ ఉంటుంది, అక్కడ మీరు ఫోకస్ పెట్టాలి. అప్పడు మీ ఆస్ట్రల్ బాడి రిలీజ్ అవుతుంది. దీన్నంతటిని మీరు నిద్రపోయే సమయంలో సాధన చేయండి.

            తరువాత ధ్యానం చేసే సమయంలో బెస్ట్ అస్ట్రల్ ట్రావెల్ ఎక్స్ పీరియన్స్ వస్తుంది. ఒక శ్రధ్ద , నిజాయితి ఉన్న ధ్యానికి తప్పకుండా

అస్ట్రల్ ట్రావెల్ ఎక్స్ పీరియన్స్ వస్తుంది. నిజాయితిగా చేసే  ధ్యాన సాధన

ముఖ్యం.

 

3వ టెక్నిక్ . పిరమిడ్స్ లో ధ్యానం.

  

            పిరమిడ్స్ లో ధ్యానం చేస్తే మంచి అస్ట్రల్ ట్రావెల్ అనుభవాలు వస్తాయి. ధ్యానం చేయడం ఒక ఎత్తు అయితే , పిరమిడ్ లో ధ్యానం చేయడం మరొక ఎత్తు.పిరమిడ్స్ అనేవి మరింత శక్తిని పెంపొందించే ఆక్సిలరేషన్ సెంటర్స్. అక్కడ డ్రీమ్స్ కూడా డిఫరెంట్ గానే వస్తాయి. పిరమిడ్ లోని కింగ్స్ చాంబర్ లో కనీసం రెండుమూడు గంటలు కూర్చుని ధ్యానం చేస్తే ఆస్ట్రల్ బాడి విడిపోయే స్థితికి వస్తారు. సర్వ సాధారణంగా పిరమిడ్ లో అందరికి ఏదో

ఒక అనుభవం వస్తుంటుంది.ఏదో పదిశాతం మందికి ఎలాంటి అనుభవం రాదు. తొంబై శాతం మందికి పిరమిడ్ ఎనర్జీ పనిచేస్తుంది. మీ ఎనర్జీబాడిని

గిర్రున తిప్పేస్తుంది. ఎందుకంటే అంతటి కాస్మిక్ బాడిని పిరమిడ్ పంప్

చేస్తుంది. పిరమిడ్ అనేది ఎనర్జి , శక్తికి స్టోర్ హౌజ్ – నిల్వా కేంద్రం లాంటిది.

ఆస్ట్రల్ ట్రావెల్ కు పిరిమిడ్ లో ధ్యానం చాలా ఉపకరిస్తుంది.

            పిరమిడ్ లోని కింగ్స్ చాంబర్లో కూర్చుని  సిన్సియర్ గా

ఓ పదిరోజులు ధ్యానం చేస్తే  మీకు ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్ పీరియన్స్ వస్తుంది.

సిన్సియారిటి ముఖ్యం. పిరమిడ్స్ లో వచ్చే అనుభవాలు మరొక దానితో

పోల్చలేనటువంటివి,అత్యధ్బుతమైనవి. నిజమైన ధ్యానులు పిరమిడ్ ధ్యానం

మిస్ చేయకూడనటువంటిది. పిరమిడ్ అనేది గ్రేట్ టెక్నాలజి. మెడిటేటర్స్

వారి ఆధ్యాత్మిక పురోగతికి తప్పకుండా పిరమిడ్ లను వాడుకోవాలి.

            ( హైదరాబాద్ దగ్గర,  శ్రీశైలం రోడ్ లో వెడుతుంటూ కడ్తాల్ దగ్గర    పిరమిడ్ స్ర్పిటువల్ సొసైటి వారి పెద్ద పిరమిడ్ ఉంది. మహేశ్వరం పిరమిడ్ గా దీని పేరు. హైదరాబాదులోని మహాత్మ గాంది బస్ స్టేషన్ నుండి శ్రీశైలం,కల్వకుర్తి, వెళ్ళే ఏ బస్సు అయినా వెళుతుంది.సుమారు 40 కి.మి దూరంలో కడ్తాల్ బస్టాప్ లో దిగి, అక్కడి నుండి ఆటోమాట్లాడుకుని 6 కి.మీ దూరంలో ఉన్నఈ పిరిమిడ్ కు వెళ్ళవచ్చు.)

దిగువన కడ్తాల్ పిరమిడ్ ఇమేజెస్..

 4వ టెక్నిక్ . సెల్ఫ్ ఎంప్లాయి టెక్నిక్.

రమణ మహర్షి గారు చెప్పిన నాన్ యార్(తమిళ్ లో) నేనెవరు?

(who am i) టెక్నిక్ ఇది. లేదా నువ్వెవరు , సెల్ఫ్ ఎంప్లాయ్ –

తన స్వయాన్ని , తనను తాను తెలుసుకునే టెక్నిక్.

                              మీ గురించి మీరు స్వయంగా తెలుసుకునేందుకు ప్రయత్నించడంలో భాగంగా చివరకు మొదటి రియలైజేషన్ గా మీ సూక్ష్మాన్ని తెలుసుకుంటారు, గుర్తిస్తారు.

            సూక్ష్మాన్ని తెలుసుకున్న తరువాత  రెండవ రియలైజేషన్ అయిన కారణాన్ని గుర్తిస్తారు, కారణ లోకాన్ని తెలుసుకుంటారు.

            కారణం తరువాత మూడవదైన మహా కారణాన్ని గుర్తిస్తారు,

మహా కారణ లోకానికి వెడుతారు. తరువాత విశ్వానికి వెళుతారు.

తదుపరి చివరగా అనంతానికి,మహా శున్యంలోకి వెళుతారు.

            మొదటి రియలైజేషన్ నేను ఈ స్థూలాన్ని కాదు,ఈ ఇగోని కాదు,

నేను ఈ పర్సనాలిటిని కాదు, నేను ఇదంతా కాదు…నేతి..నేతి..నేతి…

ఐ యామ్ నాట్ బాడి, ఐ యామ్ నాట్ దట్, ఐయామ్ నాట్ దిస్. ఐ యామ్ నాట్ దిస్ మైండ్,..ఐ యామ్ నాట్ దిస్ చెత్త.. అన్ని నేను కాదు అని

తెలుసుకున్న తరువాత అప్పుడు సూక్ష్మానికి వెళుతారు.

            కాబట్టి నేనేవరు అనే నిరంతర మన: సాధన ద్వారా చివరకు

సూక్ష్మాన్ని గుర్తించి , మొదటి అనుభవంగా  సూక్షశరీరం బయటకు వస్తుంది. మనలోనికి అంతర్ ప్రయాణం జరిగినప్పుడు సూక్షశరీరం ప్రయాణం ఏదో ఒక రోజు, ఏదో ఒక టైంలో జరుగుతుంది.

            ధ్యానంలో కూర్చున్నప్పుడు నేనవరు అనే థాట్- ఆలోచనతో

మొదలుపెట్టాలి.క్రమేణా సాధన పురోగతిలో అన్ని పొరలు దాటిపోయి,నేను

అదికాదు,నేను ఇదికాదు అని రియలైజ్ అయిన తరువాత చివరకు

సూక్ష్మాన్ని గుర్తించగానే ఆస్ట్రల్ బాడి రిలీజ్ అవుతుంది.

5 వ టెక్నిక్ –  ధ్యానం.

ధ్యానం చేయడం అనేది ఆస్ట్రల్ బాడి రిలీజ్ కావడానికి బెస్ట్ టెక్నిక్ .

మీ సిన్సియర్ సాధన పరకాష్టకు చేరుకున్న తరువాత ధ్యానంలో

ఆస్ట్రల్ బాడి విడిపడడం జరుగుతుంది.

 

6 వ టెక్నిక్ –  ప్రిటెండింగ్ టూ డెత్ .

            ఈ టెక్నిక్ కూడా రమణ మహర్షిగారి నుండి నేర్చుకున్న టెక్నిక్. రమణ మహర్షిగారికి ఎన్ లైటెన్ మెంట్ రావడానికి పూర్వమే ఆయనకు కొన్ని సటోరిస్ – రియలైజేషన్స్ వచ్చాయి.. అంటే రమణ మహర్షి గారికి

నేను జీవిస్తున్న దేమిటి? ఇది కాకుండా వేరే జీవితం ఏదో ఉందా?ఈ జీవితం అంటే ఏమిటి?దేని కోసం ఈ జీవితం ? మరో ప్రపంచం ఏదో ఉంది. దీనికోసం

నేను పుట్టలేదు.ఏదో ఉంది తెలుసుకోవాల్సింది అంటూ అయనకు నిరంతరం ఆలోచనలు కలుగుతూ ఉండేవి. ఎప్పడూ ఓంటరిగా ఉండడానికి ఇష్టపడేవాడు. ఎవరితోని కలిసేవాడు కాదు. స్కూల్లో చదువులు అంటే

ఇష్టం ఉండేది కాదు. వేరే స్వభావం ఆయనకు ఉండేది.

            ఒక రోజు ఆయన మామగారు చనిపోయారు.చనిపోయినప్పడు చూసారు. జీవితంలో మొదట సారి షాకు. ఎందుకంటే మరణాన్ని అంత

దగ్గరగా రమణుల వారు చూసారు. అంతకు ముందురోజు, ఆరోజు కూడా

కొన్ని గంటల ముందే ఆయనను కలిసారు. ఆయన ఇప్పడు పోయారు.

ఎక్కడికి పోయారు?

            రమణుల వారు ఇంటికి వచ్చిన తరువాత,మేన మామ చనిపోయి

నప్పుడు ఎలా పడుకుని ఉన్నాడో  అలాగే పడుకున్నాడు. కాళ్ళను కట్టేసి, శరీరాన్ని శవాసనంలో ఉంచాడు. రమణుల వారి మామ మాదిరిగానే శరీరాన్ని వదిలిపెట్టిన వాడిలా భావించడం మొదలుపెట్టాడు.

            ఇప్పుడు నా కాళ్ళు చనిపోయాయి, నా చేతులు చనిపోయాయి.

నా పొట్ట చనిపోయింది, నా ముఖం చనిపోయంది, కళ్ళు చనిపోయాయి. ఇలా శరీరంలో అన్ని భాగాలు చనిపోయాయి ,నా శ్వాస కూడా ఆగిపోయింది అనుకుంటుంటే వరుసగా అలాగే జరగడం మొదలుపెట్టింది. చివరకు ఒక్క

సారిగా అతని సూక్షశరీరం బయటకు వచ్చింది. విడిపడిన తన సూక్షశరీరం నుండి తన స్థూల శరీరాన్ని పైనుండి చూస్తున్నాడు. దాదాపు మూడు

గంటలు అలా తన శరీరం బయట ఉండిపోయాడు. సూక్షశరీరం నుండి తొంగిచూస్తూ మూడు గంటల పాటు ఎలా బాడిలోకి తిరిగి రావాలి అని గందరగోళంలో పడిపోయాడు. అసలు అర్ధం కాని స్థితి. అదేంటి ( స్థూల శరీరం) ఇదేంటి ( సూక్ష శరీరం) ? నేను రెండు ప్లేసుల్లో ఉన్నానే?

అక్కడ ఉన్నాను , ఇక్కడ కూడా ఉన్నాను?

            మొదటి సారి ఈ స్థితికి వచ్చినప్పడు ఎవరికైనా గందరగోళం ఉంటుంది. రమణుల వారికి కూడా ఆ కన్ ప్యూసన్ వచ్చింది. చివరకు  ఆయనకు ఆ మూడు గంటల్లో నేను స్థూలాన్ని కాదు, సూక్షాన్ని అనే

రియలైజేషన్ మొదటిసారి కలిగింది. ఈ సూక్ష్మం ఎప్పుడు చావదు,

స్థూలం చచ్చిపోతుంది. ఏదో ఒకనాటికి నాశనం పోంది, దహనమయ్యేదే.

            కాని సూక్ష్మం ఎప్పటికి ఉండేదే అనే రియలైజేషన్ అయ్యిన

తరువాత మూడు గంటలకు తన స్థూల శరీరంలోకి వచ్చారు. కాని ఈసారి

తిరిగి వచ్చిన తరువాత ఆయన పాత వ్యక్తి కాదు.  అరుణాచలం వెళ్ళి కొండ

పైన కూర్చున్నాడు. రమణ మహర్షి గారికి ఒక్క సారి చప్పట్లు కొడుతాం.

            నేను లెక్కాలు,ఎక్కాలు చదువడానికి పుట్టలేదు, నిజమైన ఆత్మ

చదువు చదువుతానని మౌన దీక్షలో కూర్చుని ఇక ఎప్పుడు ఆ కొండ దిగలేదు.

(తమిళనాడు నాడులోని  తిరువాణ్ణమాలై లోని అరుణాచలం కొండ).

            ఆయన జివితాంతం భోధించింది కేవలం ఒకే విషయం ,

‘‘ నేనెవరు లేదా నువ్వెవరో తెలుసుకో ’’ సెల్ఫ్ ఎంప్లాయ్…ఆయన మూల

భోధనే అది.ఒక గొప్ప మాష్టర్ ఆయన. రమణ మహర్షి గారి ఈ టెక్నిక్

కూడా ఆస్ట్రల్ ట్రావెల్ కు ఉపయోగపడుతుంది.  

 7 వ టెక్నిక్ . లెట్ గో టెక్నిక్ – అన్ని వదిలివేయడం.

             లెట్ గో అంటే అన్ని వదిలివేయడం. మిమ్మల్ని ఈ భూమి మీద

గురుత్వాకర్షణ శక్తితో సహా నిలిపి ఉంచుతున్నవి కొన్ని ఉన్నాయి. వాటిల్లో

మొదటివి కొన్ని భయాలుంటాయి..వాటిని వదిలేసేయాలి. కొన్ని బంధాలు

ఉంటాయి,వాటిని వదిలేసేయాలి. ఏదైతే మిమ్మల్ని బంధిస్తుందో, బంధిఖానలో బంధిగా ఉంచుతుందో దానిని వదిలిపెట్టాలి. లెట్ గో చివరలో ‘డి’

పెడితే లెట్ గాడ్ అవుతుంది. (Let go> Let God)మన అంశాత్మ ఆ పరమాత్మ నుండి వచ్చింది.అక్కడికి మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి ఆ లెట్ గో టెక్నిక్ లో అన్ని వరుసగా ఒక్కోకటి వదిలివేయాలి.ముందుగా ఫిజికల్  స్ట్రెస్, టెన్షన్స్ అన్ని వదిలివేయాలి. తరువాత మెంటల్ స్ట్రెస్, టెన్షన్స్ అన్ని వదిలివేయాలి.తరువాత ఎమోషనల్ స్ట్రెస్, టెన్షన్స్ అన్ని వదిలివేయాలి.

తరువాత ఇగో స్ట్రెస్, టెన్షన్స్ అన్ని వదిలివేయాలి.ఇంకా ఏ బంధాలైతే ఉన్నాయో ఆ బంధాలన్ని లెట్ గో. ఫైనల్ లెట్ గో భయాలు. ఆ భయాలను మీరు ఎప్పుడైతే వదిలేస్తారో చేస్తారో మీరు అప్పుడు శరీరం నుండి బయటకు వస్తారు. ఇదొక గ్రేట్ టెక్నిక్. చాల మంది యోగనిద్ర ప్రాక్టీస్ చేసే వారికి ఆస్ట్రల్ ట్రావెల్స్ కలుగుతాయి. శవాసనంలో  రెండు గంటలు ఉండి , శరీరాన్ని పూర్తి విశ్రాంతిలో ఉంచి యోగనిద్ర చేసేవారికి, దాంతో పాటు అన్ని భయాలను పూర్తిగా వదిలిపెట్టిన వారికి చాలామందికి అస్ట్రల్ బాడి ట్రావెల్ కలుగుతుంది.

8 వ టెక్నిక్ . థర్డ్ ఐ గేట్ వే

          ఎన్నో జన్మల్లో సాధన చేసిన వారికి థర్డ్ ఐ అనుభవం కలిగినప్పుడు , ఒకానొక రోజున వారికి ఈ ఆస్ట్రల్ బాడి రిలీజ్ కావడం

తప్పని సరిగా జరుగుతుంది. వాళ్ళకి ముందుగా ఒక విజన్ (దర్శనం ) ఓపెన్ అవుతుంది. ఆ విజన్ నుండి నుండి వాళ్లు ప్రయాణం చేస్తారు.

లేదంటే ఒక సోరంగ మార్గం(టన్నెల్)చూస్తారు , ఆ టన్నెల్ లో  చాలా వేగంగా వాళ్ళు కూడా దూసుకు పోతారు. అప్పుడు ఆస్ట్రల్ గా బయటికి

వచ్చేస్తారు.  థర్డ్ ఐ ఈజ్ గేట్ వే ఫర్ యువర్ సోల్ ట్రావల్.

 

9 వ టెక్నిక్ . యూజింగ్ సౌండ్ వైబ్రేషన్.

ఒక అమెరికన్ మాష్టర్ పేరు రాబర్ట్ మన్రో.ఆయన మూడు పుస్తకాలు రాసారు. (far journeys, Ultimate_Journey, Journeys Out Of Body )

ఆయన బిజినెస్ మాన్.. మెడిటేషన్ తెలియదు. కాని ప్రతిరోజు ఆయన

నిద్రపోగానే ఆస్ట్రల్ బాడితో రిలీజయ్యే, దాంతో బయటకు వచ్చేవాడు.అస్ట్రల్

ట్రావెల్స్ వచ్చేవి. రోజుకు ఒక ప్లేసుకు వెళ్ళేవాడు. ఒక రోజు అస్ట్రల్ జర్నిలో

తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేవాడు. తరువాత రోజు అదే ఇంటికి ఫిజికల్ గా వెళ్ళి

చూస్తే అవే డిటైల్స్ అన్ని అలాగే ఉండేవి. అలాంటి అనుభవాలు ఆయనకు

కోకొల్లలుగా ఉండేవి. ఆయనకు చివరకు తాను సూక్షశరీర రూపంగా రాత్రిపూట వెళ్ళేది పూర్తిగా కరెక్టే అని అర్థమైంది. అన్ని రకాల అనుభవాలతోని ఆ మూడు పుస్తకాలను రాసారు.

  

            ఆయన చివరకు ఒక టెక్నాలజిని రూపొందించాడు. హెమి సింక్రనై

జేషన్ టెక్నాలజి అంటే సౌండ్ వైబ్రేషన్ టెక్నాలజి. అంటే రెండు చెపుల్లోనూ

విభిన్న మైన  వైబ్రేషనల్ సౌండ్ ను మ్యూజిక్ ద్వారా వినిపిస్తారు. ఒక చెవిలో తక్కువ ఫ్రీక్వెన్సీ, మరొక చెవులో ఎక్కువ ఫ్రీక్వెన్సీ. ఆ ఢిపరెన్షియల్ సౌండ్ ఫ్రీక్వెన్సీ  అది అల్ఫా స్టేజి ఆఫ్ మైండ్ ను క్రియేట్ చేస్తుంది. మన

బ్రేయిన్ ఫ్రీక్వెన్సీని మారుస్తుంది.                 www.monroeinstitute.org/free-audio-downloads

 

            మన బ్రేయిన్ అల్ఫా స్టేజి తీటా, డెల్టా స్టేజ్ కు వెళ్ళగానే మన

సూక్షశరీరం రిలీజ్ అవుతుంది. దాన్నే హెమి సింక్ టెక్నాలజి అని అంటాం.

ఆయన దాదాపు ఈ విషయం మీద యాబై సంవత్సరాలు పరిశోధన చేసారు.

న్యూయార్క్ లో ఒక గొప్ప రిసెర్చి సెంటర్ ఉంది. నేను ఆ సెంటర్ కు వెళ్ళడం

జరిగింది. ఆయన అప్పటికే తన శరీరాన్ని వదిలివేసారు. అక్కడ ఇప్పటికి

కొందరు నిరంతర పరిశోధన చేస్తున్నారు.అస్ట్రల్ ట్రావెల్స్ కోసం వీళ్ళంతా ఒక పెద్ద గ్లోబును బ్రెజిల్ లో కట్టారు. వీరు పిరమిడ్ ను కాకుండా గ్లోబ్ ను ఉపయోగిస్తారు. హెమిసింక్ ఆడియోస్ ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి.( లైఫ్ రిసెర్చి అకాడమి,హైదరాబాద్ లో) లేదా ఇంటర్ నెట్ లో కూడా లబిస్తాయి.

            హెమి సింక్ టెక్నాలజి రాబర్ట్ మన్రో అని గూగుల్ లో సెర్చ్ చేయండి దాదాపుగా అన్ని లబిస్తాయి. వాటిని హెడ్ ఫోన్స్ లో ప్రతిరోజు వింటూ బోలెడంత సాధన చేసుకోని చక్కటి ఆస్ట్రల్ ట్రావెల్స్ చేయవచ్చును.

సబ్ మినల్ మెసేజెస్ అని ఉంటాయి. ఒక్కోక్క ఆడియోలో చాలా సబ్ మినల్ మెసేజెస్ అయన ఎన్ కోడ్ చేసారు. మీకు ముందుగా దాని గురించి ఏమి చెప్పరు. ఉదా. ఈ రోజు ఫారెస్ట్ కు ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నారు.. మీకు ముందుగా తెలియదు ఎక్కడికి వెడుతున్నారో అని. కాని సబ్ మినల్

మెసేజెస్ ఉంటాయి. ఆ రోజు ఆస్ట్రల్ ట్రావెల్ లో ఫారెస్ట్ కు వెడుతారు.లేదా సముద్రం దగ్గరకు వెడుతారు. లేదా వేరే గ్రహం,లోకాల మీదకు వెడుతారు.

ఫ్రీక్వెన్సీరేంజి

హెట్జ్ లలో

మెథడు

ఫ్రీక్వెన్సీ

తరంగాల పేరు

ఇ.ఇ.జి, బ్రేన్ వేవ్

ఉదాహరణ గ్రాఫ్

ఈ తరంగాల ప్రకారంగా మెధడు ఉండే చైతన్య స్థితి

> 40 Hz

40 > cpc

(Cycles per second)

గామా వేవ్స్

  

అత్యథిక స్థాయిలో మానసిక చర్యలు, పంచేంధ్రియాలతో గ్రహణ సామర్ధ్యం, సమస్యల పరిష్కారం,భయం ఇతర ఫీలింగ్స్ ల చైతన్యం

13–39 Hz

14 – 40 cps

బేటా వేవ్స్

 

పూర్తి జాగృధావస్థ, పూర్తి మెలుకవ స్థితి.

ఎడమ వైపు మెధడుతో ఎక్కువగా ఆలోచించే చైతన్యం

7–13 Hz

8 – 13 cps

అల్ఫా వేవ్స్

విశ్రాంతి స్థితి, కలల కనే దశ, కుడివేపు మెదడుతో

ఆలోచించడం, అంతర్ చైతన్యంతో అనుసంధాన అయ్యే కీలకమైన మధ్యస్థ స్థితి.

4–7 Hz

4 – 7 cps

తీటా వేవ్స్

పూర్తి లోతైన విశ్రాంతి స్థితి, కుడివేపు మెధడుతో అనుసంధానం- కలలు కనే స్థితి, అతి లోతైన గాఢమైన అంతర్ చైతన్యం, మహాచైతన్యంతో అనుసందానం, సంపూర్ణ

అవగాహన, ప్రజ్ఞ, ఊహలు, సృజనాత్మక ఆలోచనలతో వాస్తవాలను సృష్టించుకోగలిగే కీలకమైన మధ్యస్థ స్థితి.

< 4 Hz

0.5 – 3.5 cps

డేల్టా వేవ్స్

కలలు లేని ఆలోచనలు లేని మహా గాడ నిద్ర స్థితి,

ఎరుక లేని/మహా ఎరుక స్థాయిలతో ప్రవేశం , పునః సృష్టి, ఆధి భౌతిక స్థితిక స్థాయి.

10. మార్నింగ్ మెథడ్..టెక్నిక్..

 

      మీరు రోజు ఉదయం ఏడు గంటలకు నిద్రలేచే వారు అనుకుంటే , ఈ

టెక్నిక్ ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పడు  ఏడుగంటలకే నిద్రలేవండి. కాని కళ్ళు విప్పకుండా బెడ్ మీదనుండి లేచిపోకుండా, మరో గంట పాటు కళ్ళు

మూసుకునే ఉండండి. ఆ గంట సమయం ఎంతో అవేర్ నెస్ తో అలర్ట్ గా ఉంటారు. ఆ టైంలో అస్ట్రల్ ఫ్రోజెక్షన్ జరుగుతుంది. ఇంట్లో వంట రూంలో

కాఫి కలపడం, వంట చేయడం,గిన్నెల శభ్దాలు అన్ని వినిపిస్తుంటాయి.

వింటూనే ఉండండి, కాని బెడ్ మీద నుండి లేవద్దు. కళ్ళుమూసుకుని కేవలం

ఎరుకతో ఉండండి. చాలవరకు అస్ట్రల్ బాడి జర్నీస్ ఉదయం సమయాల్లోనే

జరుగుతాయి. ఎందుకంటే అప్పడే నిద్రనుండి లేవడంతో పూర్తి ప్రెష్ గా

ఎనర్జిటిక్ గా ఉంటారు. మళ్ళి నిద్రలోకి జారుకోకుండా పూర్తి ఎరుకతో ఉండి,

ఈ సాధన చేయడం ద్వారా అధ్భుతమైన అస్ట్రల్ ట్రావెల్స్ జరుగుతాయి.

  

11. సిక్స్ ఫీట్ మెథడ్- ఆరు ఫీట్ల పైన టెక్నిక్.

         ఈ సాధనలో భాగంగా మీరు శవాసనంలో పడుకుని ఉండి , కళ్ళు

మూసుకుని మిమ్మల్ని మీరు ఆరు ఫీట్ల ఫైన ఉన్నట్లుగా ఊహించుకోవాలి.

మీ భౌతిక శరీరానికి ఆరు ఫీట్ల ఫైన మరొక డుప్లికేట్ శరీరం తేలి ఆడుతున్నట్లుగా వీజువలైజేషన్ చేసుకోవాలి. చివరకు మీ స్థూల శరీరం యొక్క చైతన్యం (కాన్షిషియస్ నెస్ ) పైన ఉన్న డుప్లికేట్ శరీరానికి ట్రాన్స్ ఫర్ చేయాలి.ఒక పెన్ డ్రైవ్, ఎక్సటర్నల్ హర్డ్ డ్రైవ్ , యు.ఎస్.బి స్టిక్ నుండి

ఒక దాంట్లో ఉన్న ఫైల్స్ ను కంప్యూటర్ తో మరొక దగ్గరకు ఫైల్స్  ట్రాన్స్ ఫర్ చేసినట్లు , ఇక్కడ కూడా అంతే. ఆరు ఫీట్ల ఫైన డబుల్ బాడిని క్రియేట్ అయినట్లుగా వీజువలైజేషన్ చేసుకుని ట్రాన్స్ ఫర్ కమాండ్ చెప్పేయాలి అంతే. అంటే మీ చైతన్యాన్ని ప్రస్తుతం ఉన్న బాడి నుండి పైన  ఉన్న డుప్లికేట్ బాడిలోకి స్లోగా షిఫ్ట్ అవుతున్నట్లుగా వీజువలైజ్ చేయాలి.

            మీ చైతన్యం స్లోగా పైన ఉన్న బాడిలోకి షిప్ట్ అవుతుంది. తరువాత పైనుండి కింద ఉన్న మీ భౌతిక శరీరాన్ని చూడడానికి ప్రయత్నించాలి. దీనినే సిక్స్ ఫీట్ మెథడ్ అంటారు.. ఈ పద్ధతిని నేను

ఎంతో విజయవంతంగా చాల సార్లు సాధన చేసాను.

12. అఫర్మేషన్స్ విత్ విల్ – సానుకూల వాఖ్యాలు.

          ఈ పద్దతి సాధన చేయడానికి ఆస్ట్రల్ ట్రావెల్ చేయాలనే ట్రెమండస్ విల్ పవర్ ఉండాలి. సిన్సియారిటి,సీరియస్ నెస్ తో కూడిన తీవ్రమైన గాడమైన కోరిక ఉండాలి. ఈ కింది అఫర్మేషన్ (సానుకూల వాఖ్యం) చెప్పుకోండి.

   “I am the spritual being,I am willing to do astral travel every night and it is safe and effortless and easy”.   

            ‘‘నేనొక ఆధ్యాత్మిక దేహార్ధిని , నేను ప్రతిరోజు రాత్రి క్షేమంగా, సులభంగా, అప్రయత్నంగా సూక్షశరీరం ప్రయాణం చేయడానికి పూర్తి సిద్ధంగా ఉన్నాను’’.

            ఇలాంటి అఫర్మేషన్స్ ఫ్రతిరోజు చెప్పుకోవడం వలన ఏమవుతుందంటే , మన నోటి గుండా రిలీజ్ చేసే ప్రతి అఫర్మేషన్ విష్ , సంకల్ప వాఖ్యం మన ప్రాణమయ కోశాన్ని రెడి చేస్తుంది.

            మనం చేసే ఏ ఆలోచన ఐనా, మాట్లాడే ప్రతి వాఖ్యం ప్రాణమయ కోశం – ఎథరిక్ బాడి మీద ఉంటుంది.

            ఉదాహరణకు , నేను అలిసిపోయి ఉన్నాను, అలసిపోయి ఉన్నాను అని ప్రతిసారి బయటకు అంటుంటే మీ ఎథరిక్ బాడి కూడా నిజంగానే అలసి పోతుంది. దానికి విరుధ్ధంగా అలా అలసిపోయినప్పడు కూడా నేనొక అధ్భతమైన శక్తి వంతున్ని, ఎప్పటకి అలసిపోని అపార మైన

శక్తి యుక్తులు ఉన్న వాడిని అనే ఆలోచించి చూడండి. వెను వెంటనే మీకు ఎంతో శక్తి సమకూరుతుంది. మన ప్రాణమయ కోశానికి అంత శక్తి ఉంది.

            కాబట్టి మనం నోటిమాటగా బయటకు చెప్పే ఈ అఫర్మేషన్స్ లేదా సానుకూల వాఖ్యాలు ప్రాణమయ కోశం మీద ప్రభావం పడి,అందుకు

తగ్గట్లుగా మన శరీరాన్ని తయారుచేస్తుంది.(వీటిని మనసులో అనుకోవడం,ఆ వాఖ్యాన్ని అంతర్గతంగా చెప్పుకోవడం వేరు, అఫర్మేషన్స్ ను బయటకు చెప్పడం వేరు, నోటితో వాఖ్యరూపకంగా అఫర్మేషన్స్ ను ఖచ్చితంగా బయటకు చెప్పాల్సిందే) ప్రాణమయ కోశం నెమ్మదిగా మిమ్మల్ని ఆస్ట్రల్ బాడి ట్రావెల్ కోసం సిధ్దం చేస్తుంది. పట్టువదలని సిన్సియర్ సాధన చేసిన వారికి ఏదో ఒక రోజున అస్ట్రల్ ట్రావెల్ వచ్చి తీరుతుంది. మద్యలో ఉత్సహం కోల్పోకూడదు, అపనమ్మకం పెంచుకోకూడదు. ఆస్ట్రల్ ట్రావెల్ చేయాలనే తీవ్రమైన గాడమైన కోరిక, పట్టు వదలని విక్రమార్కునిలా అది సిద్ధించే వరకు మొక్కవోని ఆత్మవిశ్వాసం తోని కాల వ్యవధి తోని ముడిపెట్టుకుండా నిరంతరం సాధన చేయాలి.

            దూమ్ సినిమా, క్రిష్ సినిమా చూడాలనే, మరో కొత్త సినిమా చూడాలనే కోరికల కంటేఅస్ట్రల్ ట్రావెల్ చేయాలనే కోరిక మరింత గాఢంగా ,బలంగా ఉండాలి.నిత్యజీవితంలో అన్నింటికంటే ప్రాథమిక గాడమైన కోరికగా

అస్ట్రల్ ట్రావెల్ చేయాడాన్నే పెట్టుకోవాలి.

            ఒక మాష్టర్ చక్కగా చెప్పిన వాఖ్యం ప్రకారం, Metiriol content(satisfaction)and Spritual discontent (unsatifaciton)గా ఉండాలి. అంటే భౌతిక జీవితంలో ఉన్న దానితో తృప్తి పడాలి. ఆధ్యాత్మికంలో మాత్రం ఎప్పుడు  తృప్తిగా ఉండకూడదు.

            ఎందుకంటే నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. నాకు అంతా వచ్చేసింది, అనుభవాలు వచ్చాయి అంతా తెలిసిపోయింది అని అనుకుంటే

ఆథ్యాత్మికంగా నాకు తెలిసింది చాల తక్కువ అనే ఫీలింగ్ తోనే ఉండాలి.

            అస్ట్రల్ ట్రావెల్ చేయాలనే గాడమైన కోరిక ఉండాలి. ఆస్ట్రల్ మాష్టర్స్

ను , ఆస్ట్రల్ గైడ్స్ ను కలువాలనే గాడమైన కోరిక ఉండాలి. ఆ సూక్షలోకంలో

ఉండే గురువులను కలువాలనే తీక్షణమైన వాంచ ఉండాలి. చివరకు మీ

సాధన పరివక్వతకు వచ్చిన రోజున మీరు ఆస్ట్రల్ ట్రావెల్ చేయగలుగుతారు.

 

13. ఫిక్స్ డ్ ఆంకర్ మెథడ్.

          ఈ మెధడ్ కూడా నాకు ఇష్టమైన మెథడ్. దీనిమీద కూడా ఎంతో

సాధన చేసాను. ఫిక్స్ డ్ ఆంకర్ మెథడ్ అంటే మీ శరీరం బయట ఒక ప్రత్యేక పాయింట్ లో కేంద్రీకరించాలి. ఉదాహరణకు మీరు ఉన్న గది పక్కన మరొ గదిలోని ఒక పాయింట్ లేదా స్పాట్, వస్తువు మీదకు మీ ధ్యాసను ఫోకస్ చేయాలి. తరువాత నెమ్మదిగా మీ ధ్యాసను, చైతన్యాన్ని ఆ స్పాట్ మీదకు

మళ్ళించాలి. అది సిధ్దించిన రోజన ఆ స్పాట్ మీదకు మీరు ట్రాన్సఫర్ అయిపోతారు.

            ఇంకోటి మూవింగ్ ఆంకర్. రెండు మూడు స్థలాలను షిఫ్ట్ చేయాలి.

ముందుగా దగ్గరగా స్థలాల మీద ఆంకర్ పెట్టి ఫోకస్ చేయాలి.తరువాత

దూరంగా ఒక అడవి లాంటి ప్రదేశంలో ఫోకస్ పెట్టాలి.తరువాత ఒక అమెరికా

లేదా ఒక ఈజిప్టు పిరమిడ్  దగ్గర లేదా ఒక ఆస్ట్రల్ తలం మీద మీ మూవింగ్

ఆంకర్ ను షిఫ్ట్ చేస్తుండాలి. ఇలా షిఫ్ట్ చేస్తున్నప్పడు మీ ఎనర్జి బాడి అంతా అ ప్లేసు మీదకు షిఫ్ట్ అవుతుంది.  మీరు ఒక అరణ్యంలో ఆంకర్ పాయింట్ పెట్టి మీ ధ్యాసను అక్కడ ఫోకస్ పెట్టండి.అది ఫుల్ అస్ట్రల్ ట్రావెల్ అయితే

జరుగలేదు కాని ఎథరిక్ ట్రావెల్ అయితే జరిగింది. ఎథరిక్ బాడి ప్రాణమయ

కోశంతో మీరు అక్కడికి వెళ్ళారు. కాని అదే సమయంలో ఈ మూవింగ్ ఆంకర్ ను మరోక ప్లేసు మీదకు షిఫ్ట్ చేసినపుడు  ఈ ఆస్ట్రల్ బాడి ఎనర్జీ అంతా అక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఇలా రెండు మూడు ప్లేసులలోకి షిఫ్ట్ చేస్తున్నప్పడు ఆస్ట్రల్ బాడి అక్కడికి షిఫ్ట్ అవుతుంది.

14. ఆస్ట్రల్ ఆర్మ్స్ బ్రేకింగ్ త్రూ

        మీరు పడుకుని ఉన్నప్పుడు కాని మెడిటేషన్ లో ఉన్నప్పుడు కాని

మీ ఆస్ట్రల్ బాడి చేతులు ముందుగా లేవాలి. తరువాత కాళ్ళు, తరువాత మిగితా శరీరంలో ఒక్కోక్క బాడి పార్టు ఆస్ట్రల్ గా అలా విడివడుతూ ఉండాలి.

చివరగా ఆస్ట్రల్ గా అన్ని విడిపడిన తరువాత , ఆస్ట్రల్ బాడితో అలా నడిచిపోయే ప్రయత్నం చేయాలి. శరీరంలోని ఒక్కో భాగాన్ని ఆస్ట్రల్ గా విడిపడడం సాధన చేస్తూ నిదానంగా ఆస్ట్రల్ బాడి రిలీజ్ ను చేయాలి. ఇదోక

గొప్ప టెక్నిక్. ఎందుకంటే ఒక్కోక్కరి అనుభవాలు ఒక్కో రకంగా ఉంటాయి.

            ఒకరికి ఒక మెథడ్ వర్తించంది అని అందరికి అదే మెథడ్ వర్తించాలని రూలేం లేదు..ఒక్కోక్కరికి ఒక్కో రకమైన మెథడ్ సూట్ అవుతుంది.  కొందరికి ఆస్ట్రల్ ఆర్మ్స్ రిలీజ్ అనేది చాలా కామన్ గా జరుగుతుంది.

            నేను మెడికల్ కాలేజిలో చదువుకునేప్పుడు , నేను సాధన చేస్తుండగా ఆస్ట్రల్ బాడి రిలీజ్ అయ్యే టైంలో ముందుగా నా ఆస్ట్రల్  ఆర్మ్స్ రిలీజ్ అయ్యాయి.హస్టల్ లో  ఐరన్ కాట్ మీద పడుకున్నప్పుడు ఐరన్ రాడ్

కిందుగా ఉన్ననా ఆస్ట్రల్ చేతులు రాడ్ పైకి ముందుకు వచ్చాయి. నేను చేతులు కలిపి పెట్టి పడుకున్నాను కదా చేతులు ముందుకు ఎలా వచ్చాయి అని అప్పడు నేను ఆశ్చర్య పోయాను. తరువాత బాడి బయటకు వచ్చి

పైనుండి చూసాను. నా ఫిజికల్ బాడి సరిగ్గా అదే పొజిషన్ లో ఎలా పడుకున్నానో అలానే ఉంది.

            కాబట్టి ఆస్ట్రల్ ఆర్మ్స్ ను రిలీజ్ చేయడం అనేది కూడ ఒక గొప్ప టెక్నిక్.

           

 

 

15. ఫ్లోటింగ్ బెలూన్ టెక్నిక్.

         ప్యారచూట్ లో కాని బెలూన్లో కాని ఆకాశంలో ఎవరైనా ప్రయాణిస్తే

అది ఎంత తేలికగా ఉంటుందో మీకు అనుభూతిలోకి వస్తుంది. బేలున్ లో

ప్రయాణిస్తున్నప్పుడు వచ్చే ఫ్లోటింగ్ సెన్సేషన్ మీద మీ ధ్యాసను పెట్టాలి.

మీరు ధ్యానం చేస్తున్నప్పుడు తేలికగా అయిపోయి ఒక ఫ్లోట్ అవుతున్న

ఫీలింగ్ లోకి వెళుతారు.ఆ ఫ్లోటింగ్ ను గమనించాలి. అప్పుడు ధ్యాస అంతా ఫ్లోటింగ్ మీదే పెట్టి దాంట్లోకి జంప్ చేయాలి. అప్పుడు ఆ ఫ్లోటింగ్ సెన్షేషన్

వంద రేట్లు పెరిగిపోతుంది.

            లేదా సూపర్ మాన్ టెక్నిక్ ఫాలో కావాలి. మీరు సూపర్ మాన్

సినిమా చూసి ఉంటే సూపర్ మాన్ తన చేతులను ఉపయోగించుకుని జర్నిచేయడం చూసి ఉంటారు. మా నాన్నగారికి చిన్నపుడు సూపర్ మాన్

రోల్ మోడల్..ఆయనకు డ్రీమ్స్ అన్ని సూపర్ మ్యానే. ఆయన ఆస్ట్రల్ బాడిలో సూపర్ మ్యాన్ మాదిరిగా హ్యండ్స్ మూవ్ చేసుకుంటూ ఆ డైరెక్షన్ లో వెళుతున్నట్లు సాధన చేసేవారు.

            ధ్యానులందరికి ఈ ఫ్లోటింగ్ టెక్నిక్ చాలా ఉపకరిస్తుంది. ధ్యానంలో

వచ్చే సెన్సేషన్స్ తో మీ శరీరాన్ని తేలికగా బెలూన్ మాదిరిగా ఊహించుకుని

దాంట్లోకి జంప్ చేసి బేలూన్ తో పాటు ప్రపంచంలో ఎక్కడికైనా ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నట్లుగా వీజువలైజ్ చేస్తూ సాధన చేయండి. 

16. డైనమిక్ అవేర్ నెస్ మెథడ్.

ఇంతకు ముందు ఆస్ట్రల్ ఆర్మ్స్ రీలీజ్ చేసిన మెథడ్ మాదిరిగానే ఉంటుంది. కాకపోతే చేతులే కాకుండా శరీరంలోని భాగాలన్ని ఒక దాని తరువాత  మరొకటి రిలీజయినట్లుగా వీజువలైజ్ చేస్తూ సాధన చేయాలి.

17. కౌంటింగ్ మెథడ్.              

   కౌంటింగ్ మెథడ్ లో 100 సంఖ్య నుండి వెనక్కి లెక్క పెడుతూ 1 దగ్గరకు రావడం ఉంటుంది. ఈయన మెథడ్స్ అన్ని మొత్తం కౌంటింగ్ మెథడ్సే.  ముందుగానే ప్రోగ్రాం చేసుకుని 50 దగ్గరకు వచ్చేసరికి డీప్ రిలాక్స్ స్టేజికి చేరుకోవాలని, 100 నుండి 1..వరకు రివర్స్ కౌంటింగ్ చేస్తుపోవడం ఈ మెథడ్ లో జరుగుతుంది. కౌంటింగ్ బయటకు చెప్పాల్సిన అవసరంలేదు..లోపలే కౌంటింగ్ చెప్పుకుంటే సరిపోతుంది..

     అస్ట్రల్ ట్రావెల్ చేయాలనే సీరియస్ ప్రోగ్రాం చేసుకుని ఒకా నొక ప్రత్యేక

సంఖ్య దగ్గరకు చేరుకోగానే ఆస్ట్రల్ బాడి రిలీజ్ కావాలని సంకల్పంతో

కౌంటింగ్ చేయాలి. ఉదాహరణకు ఇలా…

(100,99,98,97,96,95,…………50,49,48,…………….5,4,3,2,1.)

          ఎన్నో రోజుల సిన్సియర్ సాధన తరువాత ఆ ప్రీ ప్రోగ్రాం సంఖ్య దగ్గరకు మీరు కౌంటింగ్  దగ్గరకు రాగానే బాడి డీపెస్ట్ రిలాక్స్ స్టేజిలోకి చేరుకుని  మీ ఆస్ట్రల్ బాడి బయటకు వచ్చేస్తుంది. ఈ బ్యాక్ కౌంటింగ్ మెథడ్ లో తప్పని సరిగా ముందుగా  ప్రోగ్రామింగ్ చేసుకోవాలి.  నేను రివర్స్ కౌంటింగ్ చేస్తున్నప్పుడు , ఒకా నొక ప్రత్యేక సంఖ్య దగ్గరకు రాగానే  పూర్తి ఎరుకతో ఉండగా ఆస్ట్రల్ బాడి బయటకు రావాలని క్లియర్ గా ప్రోగ్రాం

చేసుకోవాలి. ఆస్ట్రల్ ట్రావెల్ కోసం ఈ మెథడ్ కూడా చాల ఉపయోగిస్తుంది. 

రివర్స్ కౌంట్లో నిద్రలోకి జారకుండా పూర్తి ఎరుక,అవేర్ నెస్ తో ఉండాలి.

 

 

 18. క్రియేటివ్ విజువలైజేషన్ టెక్నిక్..

        క్రియటివ్ వీజువలైజేషన్ టెక్నిక్ లో రోప్ టెక్నిక్ అనేది ముఖ్యమైంది. మన దేశస్థుడు మ్యుజీషియన్ ఐన పి.సి.సర్కార్ సీనియర్ దీంట్లో సిధ్ధహస్తుడు.. ఆయన తన మేజిక్ ప్రదర్శనల్లో తాడును(రోప్) పట్టుకుని ఆకాశంలోకి పైకి ఎక్కేవాడు.

          ( ఔత్సాహికులు యుట్యూబ్ లో ఈ వీడియో చూడండి. పి.సి.సర్కార్ ది కాదు, వేరే వ్యక్తి ముత్కాడ్ మాజిక్..కింది టైటిల్ తో సెర్చ్ చేయండి.Magician Muthukad – The Great India Rope Trick )

          వేలకొద్ది మంది ముందు తన ప్రదర్శన చేసేవాడు..ఇప్పటికి కూడా

అ మాజిక్ రహాస్యం, మెకానిజం ఎవరికి తెలియదు. ఒక తాడు స్థంభంలా

అంత గట్టిగా ఎలా మారిపోతుందనే మేజిక్ ఎవరికి అర్థం అయ్యేది కాదు.

( పై వీడియోలో స్వయంగా మీరు దాన్ని గమనించవచ్చును.)

          ఈ రోప్ టెక్నిక్ ను మనం భౌతిక శరీరంతో చేయం..మనం ధ్యానంలో

కూర్చుని ఒక తాడును ఊహించుకోవాలి. ఆ తాడు పట్టుకుని కొండలను ఎక్కేవారు కొండపైకి  పైకి ఎక్కుతున్నట్లుగా తాడు పైకి ఎక్కుతున్నట్లుగా ఊహించాలి. మీరు అలా తాడు పైకి వెళుతున్నట్లుగా చేసే వీజువలైజేషన్ లో

మీ ఆస్ట్రల్ బాడికి షిఫ్ట్ అవుతారు.

            అలాగే ఫ్లయింగ్ బర్డ్ టెక్నిక్ అంటే ఆకాశంలో విహరించే పక్షిలా వీజువలైజ్  చేసి, ఏరియల్ వ్యూ అంటే ఆకాశం నుండి భూమిని చూస్తుండాలి. అక్కడినుండి బిల్డింగ్స్ ను, రోడ్లను, మీ శరీరాన్ని చూడండి.

ఇవన్ని వీజువలైజ్ మెథడ్ ద్వారా కొంత మందికి వచ్చిన అనుభవాలు.

 

       

 19. వాకింగ్ టూవార్డ్స్ ఆన్ అబ్జెక్ట్

Walking towards an Object. ఒక వస్తువు వైపు నడవడం.

 

        ఒక దగ్గర కూర్చోండి. పక్క రూంలో ఒక వస్తువు లేదా ఆబ్జెక్టు ఉంది.

మీరు షర్ట్ వేసుకుని , డోర్ తీసుకుని పక్క రూమ్ లోకి వెళ్ళి ఆ వస్తువును

మీ చేతిలోకి తీసుకోవాలి. అక్కడికి వెళ్ళే సరికి మీరు ఆస్ట్రల్ బాడిలోకి షిఫ్ట్

అవుతారు. కొన్ని ప్లేసుల్లో ఈ ప్రయోగం చేయడం జరిగింది.

          గుజరాత్ లోని అహ్మదాబాదు, బరోడాలో  , మహరాష్ట్ర లోని నాసిక్,

పూణెలలో ఈ ప్రయోగాలు జరిగాయి. ఈ ప్రయోగాల్లో చాల మందికి

ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్స్ జరిగాయి. ఈ ప్రయోగంలో వారందరికి ఒక టార్గెట్

పెట్టడం జరిగింది. ప్రతి ప్రయోగంలో ఒక యాబై మంది గ్రూఫ్ గా ఉండేవారు.

 యాబైమంది ఆస్ట్రల్ ట్రావెల్ చేసి, వారి ఇంటికి వెళ్ళాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు తెలిసిన ఒక వస్తువును ముట్టుకుని అప్రదేశం నుండి కొద్దిగా పక్కకు జరపాలి.

          అందరు ఆస్ట్రల్ గా వారి ఇంటికి వెళ్ళే వాళ్లు. ఆస్ట్రల్ బాడిగా తిరిగి వచ్చిన తరువాత తదుపరి ఇంటికి ఫోన్ చేసి , ఇంట్లో  ఆ వస్తువు మూవ్

అయ్యిందా లేదా అని కనఫర్మ్ చేసుకోవాలి.

          నాసిక్ నుండి ఈ ప్రయోగంలో పాల్గొన్న ఒక వ్యక్తి అతని ఇంటికి

కాల్ చేసాడు. అప్పటికే అతని భార్య షాక్ లో ఉన్నది. గజ గజ వణికిపోతుంది. ఫోన్ లో విషయం చెపుతూ ‘‘ నేను టి.వి.చూస్తుంటే , ఏదో ఒక దయ్యం లాంటిది వచ్చి వేరే దిశలోకి కదల్చింది ’’ అని చెప్పింది.

          వాస్తవానికి ఆయన అంతకు ముందే ఆస్ట్రల్ ట్రావెల్లో తన ఇంటికి

వెళ్ళి ఆ టి.వి. డైరెక్షన్ ఆంగిల్ ను మార్చాడు. ఆయన ఆస్ట్రల్ గా ఏ పనైతే

చేసాడో , ఫిజికల్ గా అది నిజంగానే మూవ్ అయ్యింది. అదే సమయానికి టి.వి. చూస్తున్న అతని భార్య అదేదో దయ్యం చర్యగా భావించి భయపడింది.

చివరగా అతను ఫోన్లో ఆమెకు దైర్యం చెప్పుతూ ‘‘ ఒక ప్రయోగంలో భాగంగా

ఆస్ట్రల్ గా వచ్చి తానే ఆ టి.వి.ని మూవ్ చేసానని,భయపడవద్దని‘‘ చెప్పాడు.

          పూణెలో ఇద్దరు వ్యక్తులు ఆస్ట్రల్ ట్రావెల్ లో ఇంటికి వెళ్ళినప్పడు

రెండు గాజు గ్లాసులను కదుపుతుంటే , అవి కింద పడి పగిలిపోయాయి. ఇంటికి కాల్ చేసి విషయం కనుక్కుంటే ఇంట్లో పడిపోయిన రెండు గాజు గ్లాసులు నిజంగానే పగిలిపోయి ఉన్నాయని చెప్పారు.

 

          బరోడాలో ఒకాయన ఆస్ట్రల్ ట్రావెల్ లో ఒక ఫోటో ఫ్రేమును ఒక ప్లేసు

నుండి మరొక ప్లేసులోకి జరిపాడు . ఇంటికి ఫోన్ చేసి చూస్తే అది వాస్తవంగానే జరిగిందని కన్ ఫర్మ్ చేసుకున్నాడు.

          నా స్వానుభవం మేము ఒక ఐదుగరం కలిసి ఈ ఆస్ట్రల్ ట్రావెల్

ప్రయోగాలు చేసేవాళ్లం. కర్నూల్ లో పిరమిడ్ కట్టిన తరువాత మేము

రాత్రంతా ఆ పిరమిడ్ లోనే ఉండి అస్ట్రల్ ట్రావెల్ గురించే ఎన్నో ప్రయోగాలు చేసేవాళ్ళం. ఆ పిరమిడ్ లో ఒక రోజు మేము కౌంటింగ్ మెథడ్ ప్రాక్టీస్ చేసాం.

          ఐదుగురం కలిసి గ్రూప్ మెడిటేషన్ చేసాం. మాలో ఒకాయనకు

అస్తమా ఉంది, దాని అటాక్ రాబోతుంది. ఆ వ్యక్తి తన ఇంట్లో ఉన్న ఒక ఇన్ హేలర్ తెచ్చుకోవాలి. వచ్చేప్పుడు తెచ్చుకోవడం మర్చిపోయాడు. మళ్ళి వెళ్ళి తీసుకురావాలి, ఒకటిన్నర గంట ప్రయాణం. కౌంటింగ్ మెథడ్ మొదలు

పెట్టి ఆయన విజువలైజ్ చేసాడు.మేమంతా  ఆయనకు ఎనర్జీ పంపిస్తూ

ధ్యానం చేసాం. కౌంటింగ్ మెథడ్ లో ఆయన వీజువలైజ్ చేసుకున్నట్లుగానే

ఒక వస్తువు మేమున్న పిరమిడ్ లో టాప్ మని వచ్చిపడింది. అందరం కళ్ళు తెరిచి చూస్తే అది ఆయన విజువలైజ్ చేసుకున్న ఇన్ హేలర్.

          (క్లాసులో అందరి చప్పట్లు)

          ఇన్ హేలర్ తో పాటు ఆస్తమా నివరాణకు ఉపయోగించే టాబ్లెట్స్ కూడా ఇంట్లో నుండి వచ్చి ఇక్కడ పడ్డాయి. ఆ టాబ్లెట్స్ గురించి మాత్రం

ఆయన ఇంటెన్షన్ చేయలేదు, ఎవరు పంపించారో కాని అవి కూడా వచ్చి

పడ్డాయి.( నవ్వులు)

          బి.వి.రెడ్డి గారని అందరికి తెలిసిన పర్సనే, ఫస్ట్ పిరమిడ్ కట్టించిన అయన తన ఫూజ గది నుండి ఆస్ట్రల్ గా పువ్వును,కుంకుమను పట్టుకు వచ్చినట్లు వీజువలైజ్ చేసేవాడు.. మాదంతా ఎక్స్ పరమెంటల్, ఒక సైంటిస్ట్స్ లాగా ప్రయోగం చేసేవాళ్ళం. ఆయన చివరకు కళ్ళు తెరిచి చూస్తే మద్యలో అంతా కుంకుమ పడిఉంది.

          మేము మరోక ఎక్స్ పరిమింట్ చేసింది సెంట్ బాటిల్ విషయంలో.

సెంట్ బాటిల్ ఓపెన్ చేయకుండా దాంట్లో ఉన్న సెంట్ ను బయటకు తీసుకు రావడం. ఈ విషయంలో నేను జీరో నే. నా కెప్పడు ఇలాంటివి రాలేదు. కాని మా ఫ్రెండ్స్ ఈ అనుభవాలు తరుచుగా కలిగేవి. నేను వారి అనుభవాలను

నిజంగా ఆనందపడేవాడిని. ఒకా ఫ్రెండ్ బాటిల్ ఓపెన్ చేయకుండా దాంట్లో ఉన్న మొత్తం ఫర్ ఫ్యూమ్ ను బయటకు తీసి తన చేతులకు పూసుకునేవాడు. రూంలో ఉన్న అందరం ఆ సువాసనను పీల్చేవాళ్ళం.

          కాబట్టి ఆస్ట్రల్ బాడిలో ఉన్నప్పుడు కొంతమందికి ఆస్ట్రల్ ఎనర్జి ఎక్కువగా ఉండి ఫిజికల్ గా ఉన్న వాటిని కూడ కొంత మూవ్ చేయగలరు.

దీన్నే టెలిపోర్టేషన్ అంటారు. కాని ఇది మిస్ యూజ్ చేయడం కోసం కాదు.

ఒక బ్యాంకులో ఉన్న డబ్బును తీసుకురావడం,మరొక బ్యాంకులోకి మార్చడం నిషిద్దం..( క్లాసులో నవ్వులు) ఇది కేవలం ఆధ్యాత్మిక పురోగతికి

మాత్రమే , చేసే ప్రయోగం మాత్రమే..

          అలాగే మీ గర్ల్ ప్రెండ్ లేదా మరెవరో ఇప్పడు ఏం చేస్తున్నారని గూడచార్యం జరుపడానికి, ఇతరుల విషయం తెలుసుకోవాడానికి మిస్ యూజ్ చేయకూడదు. ఈ ప్రయోగాలన్ని కేవలం ఆధ్యాత్మిక పురోగతికి మాత్రమే  ఉపయోగించాలి.(అలాంటి ఆశయాలతో ఉన్న వాళ్ళకు ఇది సిద్ధించదు. ఒకవేళ సిధ్ధించిన కూడా తిరిగి పతానవస్థకు చేరుకుంటారు. హాలివుడ్ సినిమా హాలోమాన్ చూడండి.)

 Roll out your body

  రోల్ ఔట్ ఆఫ్ బాడి.

        మీరు చక్కగా కూర్చున్నారు, లేదా పడుకున్నారు. మీరు నిద్రలో

భౌతికి శరీరంతో పక్కకు తిరిగినట్లుగానే, ఆస్ట్రల్ బాడితో కూడా రోల్ కావడం సాధన చేయాలి. అలా క్రమంగా సాధన చేసినప్పడు ఎప్పుడో ఒక రోజు

మీ ఆస్ట్రల్ బాడి రిలీజ్ అవుతుంది.

 Astrol Environments

ఆస్ట్రల్ ఎన్విరాన్ మెంట్స్ లో సాధన చేయండి ..

   ఒక సాధకుడు ఆత్మాయాణం పుస్తకం చదివినప్పడు తనకు వచ్చిన అనుభూతిని వర్ణించగా… న్యూటన్ గారు ‘‘ ఆధ్యాత్మిక ప్రపంచానికి సంభందించిన ఏ పుస్తకం చదివిన కూడా శరీరం అందుకు తగినట్లుగా మార్పులు చెందుతుందని, లోబ్ సాంగ్ రాంపా లాంటి వారు రాసిన పుస్తకాలు చదివినప్పుడు ఆ పుస్తకాలు చదివిన చాలమంది పాఠకులకు ఆస్ట్రల్ ట్రావెల్స్ వస్తాయని, రాంపా ఒక గొప్ప ఆస్ట్రల్ ట్రావెలర్ ’’ అని చెప్పారు.

 

 

 

20. బ్రెత్ అండ్ ఆడియో డ్యూయల్ ఫోకస్

 Breath and Audio dual Focus

 

    మీ శ్వాసను, మరియు వినపడే శబ్దాలపైన ఫోకస్ పెట్టడం సాధన

చేయాలి. నేను ఎప్పుడో 1989లో హస్టల్ లో ఉండి చదువు కుంటున్నప్పుడు,రాత్రిపూట ధ్యాన సాధన చేస్తుంటే,ఎక్కడో హస్టల్ కు పది కిలోమీటర్ల్ దూరం ఉన్న కుక్కల శబ్ధం వినిపించేది.

సూక్ష్మాతి సూక్ష్మమైన శబ్ధాలు కూడా వినిపించడం మొదలుపెడుతాయి.. ఇలాంటి సూక్షమైన శబ్దాలు కూడా వినగలిగే ఎరుక స్థాయిలను మనం ధ్యానసాధన ద్వార పెంచుకోవాలి. ఎక్కడో దూరంగా వినపడే శభ్దాలు కూడా క్లియర్ గా వినపడుతుంటాయి.

          అప్పడు మీ శ్వాసమీద మరియు శబ్ధం మీద రెండింటి మీద ఫోకస్ పెట్టాలి. ఇలా రెండింటి మీద ఒకేసారి ఫోకస్ పెట్టినప్పుడు మన ఆస్ట్రల్ బాడి

రిలీజ్ అవుతుంది.


21. గేజింగ్ టెక్నిక్ – ఒక వస్తువు మీద తీక్షణమైన చూపు

 

          మీరు ఏదైన ఒక వస్తువును తీక్షణంగా చూడండి. ఉదాహరణకు

టేబుల్ మీద ఉన్న ఒక గ్లాసు వేపు తీక్షణంగా చూస్తూనే ఉండండి..అలా చూసి చూసి చివరకు ఆ గ్లాసు కోణం నుండి మిమ్మల్ని మీరు చూసుకోవాలి.

గ్లాసు అనే కాదు ఏదైన ఒక వస్తువును తీక్షణంగా , తధేకంగా కొద్దిసేపు చూసి , తిరిగి ఆ వస్తువునుండి మిమ్మల్ని మీరు చూసుకోవడానికి  ప్రయత్నించండి.

          ఆకాశం వైపు తీక్షణంగా చూడండి.. చూసి చూసి, ఆకాశం నుండి

మిమ్మల్ని మీరు చూసుకోండి. అలాంటి సందర్భాల్లో మీరు శరీరం నుండి బయటకు వచ్చి ఆస్ట్రల్ ట్రావెల్ జరుగుతుంది. అలాగు ఏదైన ఒక ప్రత్యేక వస్తువు స్ధానం నుండి ఫోకస్ చేసి మిమ్మల్ని మీరు ఫోకస్ చేసి చూడడానికి

ప్రయత్నించాలి. అవతలి పాయింట్ నుండి చూసుకుంటే మీరు ఎలా కనపడుతారు అనే ఆలోచన , విజన్ ను రిలీజ్ చేయండి.అవతలి వస్తువును చూసిన తరువాత మిమ్మల్ని మీరు చూసుకోవడానికి ప్రయత్నించినప్పుడు కళ్ళు మూసుకోండి. సాదారణంగా ఇలా చూసే వస్తువులను ఎంచుకునేప్పుడు ప్రాణం లేని వాటిని ఎంచుకోవడం అత్యుత్తమం. అలాగే కదిలే వస్తువులు కాకుండా కదలకుండా ఉన్న వస్తువులను ఎంచుకోండి.

భూమి,ఆకాశం,భవనం,చెట్టు ఇలా.

 

 

  

 

 

 

 

 

22. మణిపూరక చక్రంపై ధ్యాస

Focus on Solar Plexus Chakra.

          

ధ్యానంలో ఎవరికైతే మణిపూరక చక్రం(బొడ్డు దగ్గర ఉంటుంది) ఆక్టివేట్ అయ్యి రకరకాల సెన్సేషన్స్ వస్తుంటాయో వారు మరింతగా ఆ సెన్సేషన్స్ మీద ఫోకస్ పెట్టాలి.అలాంటప్పుడు కూడా అస్ట్రల్ బాడి రిలీజ్ అవుతుంది.

మణిపూరక చక్రం దగ్గర వచ్చే అన్నిరకాల ప్రకంపనాలన్ని సాదారణంగా ఆస్ట్రల్ బాడి రిలీజ్ కావడానికి  సంబందించినవే అయి ఉంటాయి. మణిపూరక

చక్రానికి ఆస్ట్రల్ బాడికి లింక్ ఉంది. మణిపూరక చక్రం విచ్చుకున్నప్పుడు

సహజంగానే ఆస్ట్రల్ బాడి రిలీజ్ అవుతుంది. అందరికి ఈ పద్దతి వర్క్ చేయకపోవచ్చు. కాని కొంతమందికి ఈ పద్ధతి బాగా ఉపయోగిస్తుంది.

23. చేతిని పైకెత్తి ఉంచి నిద్రపోవడం.

      

          ఎస్.ఆర్.నగర్ సెంటర్ లో ఒకాయనకు వచ్చిన అనుభవం చేతిని

పైకెత్తి నిద్రపోగా అతనికి ఆస్ట్రల్ బాడి రిలీజ్ అయ్యింది. ఒకచేతిని పైకి

పెట్టి పడుకోవాలి. పడుకున్న తరువాత నిద్రలో ఆస్ట్రల్ బాడి బయటకు

వచ్చేస్తుంది. ఎందుకంటే నిద్రపోయిన తరువాత కండరాలన్ని పూర్తిగా రిలాక్స్ అయిపోయి , ఫిజికల్ హండ్ మాత్రం కిందకు పడిపోతుంది. కాని ఆస్ట్రల్ హాండ్ అక్కడే ఉండిపోతుంది.తరువాత అదే ఆస్ట్రల్ బాడితో మెల్లిగా లేచి నిలబడ్డాడు. చేతిని అలా పెట్టుకుని పడుకోగానే పదిహేను నిమిషాల్లో ఆయన ఆస్ట్రల్ బాడి రిలీజ్ అయ్యింది.దాంతో ఆయన ఆస్ట్రల్ ట్రావెల్ చేసాడు.ఇదోక

మెధడ్. ఈ మెథడ్ ద్వారా కూడా మీరు ఆస్ట్రల్ ట్రావెల్ చేయవచ్చును.

24. మెమరి రిగ్రెషన్ మెథడ్.


          మీకు  జీవితంలోని ఉన్న ముఖ్యమైన ఒక ఙ్ఞాపకం(మెమరి)లోకి తిరిగి వెళ్ళడం ద్వారా కూడా ఆస్ట్రల్ బాడి జర్నిచేయవచ్చును. వీలైనంత వరకుమధురమైన మైన ఙ్ఞాపాకాల్లోకి వెళ్ళడం ద్వారా వచ్చే సెన్సేషన్స్ , బాడి మూవ్ మెంట్స్, ఫీలింగ్స్ ద్వారా కూడా ఆస్ట్రల్ బాడి రిలీజ్ కావడానికి దారితీస్తుంది. ఏజ్ రిగ్రెషన్,పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ లో సాధారణంగా ఆస్ట్రల్ బాడి రిలీజ్ అవుతుంది.

          పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ లో క్రిస్టోస్ టెక్నిక్ అని ఉంది.దాంట్లో ముందుగా

అస్ట్రల్ బాడి రిలీజ్ చేసిన తరువాతనే పూర్వజన్మకు తీసుకువెళుతారు.

పాస్ట్ లైప్ రిగ్రెషన్ లో దాదాపు 20 టెక్నిక్స్ ఉన్నాయి.

          ఆస్ట్రల్ బాడిలో ఎక్కువ టైం గడిపినప్పుడు , ఆ ఆస్ట్రల్ బాడి క్రిస్టలైజ్

అయ్యి, నాలుగవది అయిన కారణ శరీరం కూడా ఆక్టివేట్ అయినప్పుడు

గతంలోకి వెళ్ళడమే కాకుండా భవిష్యత్తు లోకి వెళ్ళడం కూడా సాధ్య పడుతుంది.(పై రెండు పేరాగ్రాఫ్ లు 42 మెథడ్ టాపిక్ లో చెప్ప బడ్డాయి)

25. ది పాత్


          ఈ మెథడ్ పేరు పాత్. అంటే మీరు ఒక పాత్ ను సెలెక్ట్ ను చేసుకోవాలి. ఇక్కడ హైదరాబాద్ లో కె.బి.ఆర్. పార్క్ లో మీరు రోజు వాకింగ్

చేస్తున్నారనుకుందాం. మీకు పార్కులో మూల మూలన ప్రతి పార్టు బాగా

తెలిసి ఉందనుకుందాం. మీరు రాత్రి పడుకునేప్పుడు మళ్లీ పార్కులో నిజంగా నడిచినట్లుగా రెండు రౌండ్స్ వేయాలి. సాధన మీద  నెమ్మదిగా మీ ఆస్ట్రల్

బాడి అక్కడకు మూవ్ అవుతుంది.

          ఇటలిలో డమరూన్ అనే ప్లేసుకు నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక గొప్ప ఆథ్యాత్మిక బీచ్ ఉంది. అక్కడ ఉన్న కొంత మంది గొప్ప సిధ్ధులు రాత్రిపూట పడుకునే ముందు కొన్ని పేయింటిగ్స్ పాత్స్ గీస్తారు. తరువాత రెండు మూడు సార్లు ఆపాత్ ను చూసుకుని ఆ పాత్ ను ఫాలో అయ్యి దాని ద్వారా ట్రావెల్ చేస్తుంటారు. దాంతో ఆస్ట్రల్ శరీరం బయటకు వచ్చేస్తుంది.

    26.శరీరంలోని ఒక ప్రత్యేక భాగంపై ఫోకస్

Pinpoint Consciousness  on a point in the body.


మీ శరీరంలోని ఒక ప్రత్యేక ప్రాంతంపై దృష్టిని కేంద్రీకరించడం.ఎంతటైమ్ అంటే చాలా సమయం, మీ ఆస్ట్రల్ బాడి రీలీజ్ అయ్యేంతవరకు మీ దృష్టిని పెట్టాలి. సాదారణంగా శరీరంలోని పైభాగాల మీద పెట్టాలి. శరీరంలోని కింది భాగాల మీద పెడితే మన ఎనర్జీ అంతా కూడా లోయర్ ఎనర్జీ సెంటర్స్ కు వెడుతుంది.

          శరీరంలో ని పైభాగాలు అంటే  విశుధ్ద చక్రం గాని, థర్డ్ ఐ మీద గాని,హర్ట్ సెంటర్ – అనాహత చక్రం మీద గాని , తల మీద గాని పెట్టాలి.

బొట్టు పెట్టుకునే కనుబోమ్మల మద్య స్థలం ఆజ్లా చక్రంలో మన చైతన్యం అంతా కేంద్రీక్రుతమై ఉన్నది. అందుకే అక్కడ బొట్టు పెట్టుకుంటాం.

          శరీరం దిగువ భాగలపై పెట్టే ఫోకస్ సెక్సువల్ పార్ట్స్ వైపు వెళుతుంది, సాధన క్రమం ఉద్ధేశ్యం వీటిని మిస్ యూజ్ చేయడం కాదు కాబట్టి శరీరం పై భాగం లోని ఏదేని ఒక పిన్ పాయింట్, చక్రం మీద మాత్రమే

దృష్టి పెట్టండి.

 

27.సిల్వా మైండ్ కంట్రోల్ మెథడ్.

Silva Mind Control Method.    ESP (Extra sensory Perception)

          Jose Silva is the World's Number 1 Researcher and pioneer in the Mind Training Field

                    Silva

            సిల్వా మైన్ కంట్రోలింగ్ మెథడ్ అనే ఈ పద్ధతిని  పైన ఉన్న సిల్వా అనే వ్యక్తి ఇ.ఎస్.పి ( ఎక్స్ ట్రా సెన్సరి పర్ సెప్షన్ ) కనుగొని చాలా పరిశోధన చేసాడు.            ఈ పద్దతిలో చాలా వీజువలైజేషన్స్ మెథడ్స్,కౌంటింగ్ మెథడ్స్,

స్టేర్ కేస్ మెథడ్ , టన్నెల్ మెథడ్ ,ఫ్రీ బార్న్ మెథడ్.ఇలా చాలా మెథడ్స్

ఉన్నాయి. సిల్వా  ఇ.ఎస్.పి లో మాష్టర్ గా చెప్పుకోవచ్చు. ఒక చిన్న పుస్తకం Silva Mind Control Method అనేది అద్భుతంగా రాసారు, దాంట్లో మెటాఫిజిక్స్ ప్రపంచాన్ని ఒక సైన్స్ గా రూపొందించారు.

 

28. నాధ బ్రహ్మ అనుభవం.

           మనకు కలిగే కొన్ని అనుభవాల్లో కొంతమందికి నాధబ్రహ్మ అనుభవాలు అని కలుగుతుంటాయి. అది సరిగా అర్థం చేసుకోకుంటే వారు  డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ధ్యానం చేసే వారిలో

సీనియర్స్ కు ఈ విషయాలు తెలిసి ఉండాలి. కొంతమందికి  ఎప్పటికి కొన్ని  అంతర్ శభ్దాలు వినిపిస్తుంటాయి. శంఖం ఊదినట్టు, గుడిలో గంటలు మోగినట్లు, తుమ్మెద నాధం,గుయ్ మనే తదితర శభ్దాలు  అన్ని అది నాధ బ్రహ్మ అనుభవాలు అని తెలుసుకోవాలి.

            ఈ చెవిలో కాసేపు , ఆ చెవిలో కాసేపు, లేదంటే లోపల ఏదో రేడియో ఆన్ చేసినట్లు ఏవో వాయిస్ లు , శభ్ధాలు వినిపిస్తుంటాయి. అవన్ని ఆస్ట్రల్ సౌండ్స్. అవి కొంత సమయం మాత్రమే ఉంటాయి.మీరు ఎప్పుడు కూడా విననటువంటి శ్రావ్యమైన సంగీతం కూడా వినవచ్చును.ఈ శభ్దాల మీద ఫోకస్ పెట్టినప్పడు వారి ఆస్ట్రల్ బాడి రిలీజ్ అవుతుంది.

  29. జంప్ టెక్నిక్

    

               మీరు ముందుగా చక్కగా ఫిజికల్ బాడితో కొద్ది సేపు ఎక్కడైనా దూకడం(జంపింగ్)ప్రాక్టీస్ చేయండి. తరువాత చక్కగా ధ్యానంలో పద్మాసనంలో కాని శవాసనంలో కాని కూర్చుని మీరు ఇంతకు ముందు చేసిన దూకడం ప్రాక్టీస్ ను , అదే ఫీలింగ్ తో ఆస్ట్రల్ బాడితో చేస్తున్నట్లుగా సాధన చేయండి.మీరు జంప్ చేసినప్పుడు వచ్చిన దూకుతున్న ఫీలింగ్ మీదనే ఫోకస్ పెట్టండి. స్లోగా ఆస్ట్రల్ బాడితో జంప్ చేస్తున్నట్లు ఫోకస్ పెట్టి పెద్ద పెద్ద జంప్స్ చేయండి.ఒకా నొక సమయం వచ్చేసరికి మీ అస్ట్రల్ బాడి ఔట్…(క్లాసులో నవ్వులు.)ఇవన్ని మెళుకవలన్న మాట. కాని రిసెర్చి చేస్తుంటే చాలా ఫన్ గా ఉంటుంది. ఇక్కడ ఎన్ని మెథడ్స్ ఉన్నాయో చూడండి.నేను పదేళ్ళ నుండి మెడి టేషన్ చేస్తున్నాను, ఒక ఆస్ట్రల్ ఎక్స్ పీరియన్స్ లేదు అని కంప్లైంట్ చేయడానికి ఏమి లేదు. ఇక్కడ అస్ట్రల్ బాడి రిలీజ్ కావడానికి ఎన్ని పద్ధతుల  గురించి నేర్చుకున్నామో చూడండి.మీరు సిన్సియర్ గా  సాధన చేస్తుంటే ఏదో ఒక పద్దతిలో ట్రావెల్ ఖచ్చితంగా చేయగలుగుతారు.

30. థరస్ట్ టెక్నిక్ . దప్పిక తీర్చుకోనె మెథడ్. 

               థరస్ట్ టెక్నిక్ లో భాగంగా మీరు ముందుగా మీ భౌతిక శరీరంతో నిజంగానే కుండ దగ్గరకు వెళ్ళి దప్పిక తీర్చుకోవాలి. వెళ్ళి గ్లాసు పట్టుకుని, నీళ్ళు తాగుతారు, వెనక్కి వచ్చి పడుకుంటారు. తరువాత ఈ సారి అస్ట్రల్ గా వెళ్లి నీళ్లు తాగాలి.

            అందుకోసం మీరు కుండదగ్గరకు నడిచివెళ్ళినట్లుగా, గ్లాసు తీసి

నీళ్ళు తాగుతున్నట్లుగా, తిరిగి మూత పెట్టి నట్లుగా వీజువలైజ్ చేస్తు సాధన

చేస్తుండాలి. ఈ సాధన క్రమంలో ఎప్పుడో ఒకసమయంలో మీ అస్ట్రల్ బాడి బయటకు వచ్చేస్తుంది.

 

31. స్ట్రెచ్ ఔట్ టెక్నిక్..

  

               ఈ టెక్నిక్ లో భాగంగా మీరు పడుకుని సాధన చేయండి. మీరు

ఓ ఆరు అడుగులు ఉన్నారు. పడుకుని ఉండి , మీ కాళ్ళను సాగతీస్తూ

పోతుంటే మీ గది పోడవుకు సరిపడా ఓ ఎనిమిది,పది అడుగుల వరకు

సాగిపోయి గోడ అంచుకు తగలాలి.మీ మెడ కూడా స్ట్రెచ్ అయిపోయి గది వెనుక గోడను టచ్ కావాలి. మీ చేతులు కూడా ఎంతో పొడవు అయిపోయి పక్క గోడలను టచ్ కావాలి.

            ఫిజికల్ బాడితో కాదు, కళ్ళు మూసుకుని ఆస్ట్రల్ బాడితో టచ్

చేస్తున్నట్లుగా వీజువలైజ్ చేయాలి.ఇక్కడ ఏంజరుగుతుందంటే స్ట్రెచ్ అయిన మీ ఎథరిక్ బాడి ఆస్ట్రల్ బాడిని బయటకు ప్రొజెక్ట్ చేస్తుంది. ముందుగా మీ

ఎధరిక్ బాడి ఫుల్ గా బెలూన్ లాగా  ఫ్లోట్ అవుతుంది.దానికి కావల్సిన ఎనర్జీ అంతా ఫుల్ గా లాక్కుంటుంది.తరువాత గది చుట్టు గోడలవరకు స్ట్రెచ్ అవుతుంది.దాంతో పాటే ఆస్ట్రల్ బాడి స్ట్రెచ్ అయి, రిలీజ్ అవుతుంది.

(హాలివుడ్ టెర్మినేటర్ సినిమా చూడండి,విలన్ స్ట్రెచ్ ఔట్ మీరు చూడొచ్చు)

           

32. ఉయ్యాల టెక్నిక్ . Hammock Technique.


 

          హమ్మక్ లేదా ఉయ్యాల లో ఊగే టెక్నిక్ తో సులువుగా ఆస్ట్రల్ ట్రావె చేయవచ్చు. చిన్నప్పడు మనం అందరికి ఊయ్యాలలో ఊగిన అనుభవాలు

ఉంటాయి. ఉయ్యాల ఊగినప్పడు వచ్చే అనుభవం తాలుకు సెన్సేషన్ లోకి

వెళ్ళాలి. మీ అస్ట్రల్ బాడికి Y జంక్షన్ మూవ్ మెంట్ పెంచగా ఒక్కసారిగా అది పెద్దగా అయ్యి, ఆ సెన్సేషన్లో ఉండగానే మీ ఆస్ట్రల్ బాడి బయటకు వస్తుంది.


 

33.వాహనం రుపోందించుకునే టెక్నిక్

Exteriorization Technique – Creating a Vehicle to travel

 

            ఇది ఈజిప్షియన్స్ ఉపయోగించిన మెథడ్. ఈజిప్ట్ లోని పిరమిడ్స్ లో లబించిన చిత్రాల్లో కొన్ని విచిత్రమైన వాహానాల బొమ్మలు గీసారు.దాంట్లో

ఒకటి మెర్కబా అనేది ఒకటి. ఈ మెర్కబా లో ఆరు పిరమిడ్స్ కలిసి ఉంటాయి. దీని సహాయంతో ప్రాచీన ఈజిప్షియన్స్ వేరే ఆస్ట్రల్ వరల్డ్స్ కు, వేరే డైమెన్షన్స్ కు వెళ్ళ గలిగేవారు.

          వాళ్ళల్లో ఉండే ఆస్ట్రల్ బాడిని, కారణ శరీరం,మరియు మహా కారణ

శరీరాన్ని కలిపి వాళ్ళు ఒక మెర్కబా వెహికల్ ను తయారుచేసుకునేవారు.

దాంతో వారు ఎక్కడికి కావాలంటే అక్కడికి , ఏ డైమెన్షన్ కావాలంటే ఆ

డైమెన్షెన్ కు ప్రయాణం చేయగలిగివారు.. మన నారధ మహర్షి మాదిరిగా.

నారధుల వారిని ఇంటర్ గెలక్టిక్ , ఇంటర్ డైమెన్షన్ మాష్టర్ అంటాం. ఆయన

ఎక్కడికి కావాలంటే అక్కడికి అంటే విష్టు లోకం , బ్రహ్మలోకం తదితర లోకాలకు వెళుతుంటారు.ఆయన పనే అది. ఒక దగ్గరి విషయాలు , ఇంకో దగ్గరికి మోసుకపోవడం…

   

          మీరు కూడా ప్రాచీన ఈజిప్షియన్స్ మాదిరిగా ఒక వెహికల్ ను

రూపోందించుకోవాలి.మీ శరీరం బయట దాన్ని క్రియేట్ చేసుకోవాలి. అది

 ఏ రూపంలోనైనా ఉండవచ్చును.ఒక బాల్ మాదిరిగా కాని , లేదా మీ శరీరానికి మరో ప్రతిరూపం మాదరిగా కాని క్రియేట్ చేసుకుని దాంట్లోకి మీరు ఎంటర్ కావాలి. దానికి కొంత సాధన కావాలి. రెండు మూడు సార్లు మీరు

సాధన చేస్తే అది జరుగుతుంది.

          మీరు ఆ వెహికిల్ క్రియేట్ చేసుకున్న తరువాత , మీ ఎరుక లెవల్స్

(కాన్షియస్ నెస్) పెంపొందించుకుని , మీ కాన్షియస్ నెస్ నంతా ఆ వెహికిల్

మీదకు మళ్ళించాలి. అది నెమ్మదిగా ట్రాన్స్ ఫర్ అయ్యి, మీ అస్ట్రల్ కాన్షియస్ నెస్ ఆ వెహికిల్ లో నిండుతుంది.

          ఆ వెహికిల్ ఫిల్ అయిన తరువాత మీరు ఎక్కడికైనా ఆస్ట్రల్ గా

వెళ్ళగలుగుతారు.

35 .అధికంగా నిద్ర పోయే టెక్నిక్   Over Sleeping


మీరు సాధారణంగా రోజుక ఓ ఆరు గంటలు లేదా ఎనిమిది గంటలు నిద్ర

పోతుంటారు.. ఎప్పుడైనా 24గంటలు నిద్రపోయారా? ఒక సారి పడుకుని

చూడండి . అధ్బుతంగా ఉంటుంది. ఫుల్ గా ఆస్ట్రల్ ట్రావెల్స్ వచ్చే అవకాశం ఉంటుంది………..

          ముందుగా ఒకటి రెండు రోజులను మీరే హాలిడేస్ గా డిక్లేర్ చేసుకోండి. ఈ హాలిడేస్ లో కేవలం ఆస్ట్రల్ ట్రావెల్ కోసమే రెస్టు తీసుకుంటాను అని అనుకోండి. ఆ రెండు రోజులు కేవలం నిద్ర లేవడం,టిఫిన్ చేయడం,పడుకోవడం , మళ్ళీ బోజనం చేయడం మళ్ళీ పడుకోవడం. కేవలం  ఆస్ట్రల్ బాడి రీలిజ్ మాత్రమే టార్గెట్ గా పెట్టుకోండి.

          దాంతో అస్ట్రల్ బాడి రిలీజ్ అవుతుంది. మీ ఎరుకతో ఎన్నో సూక్ష్మ శరీర అనుభవాలు కలుగుతాయి. అధిక నిద్ర అంటే సోమరితనం అని కాదు.

ఈ కార్యక్రమం కేవలం ఆధ్యాత్మిక పురోగతికి మాత్రమే ఎప్పుడైనా పెట్టుకోండి.

చక్కటి ఆస్ట్రల్ అనుభవాలు కలుగుతాయి.

36.  స్టీమ్ మెథడ్, నిచ్చెన మెథడ్

    Steam Method/Ladder Method/

     Driving Method/Swinging Method

  

 ఈ పద్దతుల్లో వంటగిన్నెనుండి ఆవిరి పైకి వెడుతుంటే ఆ ఆవిరితోపాటు మీరు కూడా పైకి వెడుతున్నట్లు ఊహించండి.అలాగే మీరు ఒక నిచ్చెన ఎక్కుతున్నట్లుగా లేదా డ్రైవింగ్ లో జర్ని చేస్తున్నట్లుగా  వీజువలైజ్ చేసుకోండి.

          ఆ వీజువలైజేషన్ సాధనలో మీరు ఏదో ఒక రోజుకు ఆస్ట్రల్ ట్రావెల్

చేయగలుగుతారు.

       ఇప్పటివరకు నేర్చుకున్న దాన్ని సంగ్రహంగా  ఒకసారి చూస్తే, ఆస్ట్రల్ ట్రావెల్ లో ఈ వివిద స్థితులను నేర్చుకున్నారు. అవి.

వైబ్రేషన్ స్టేజి –  మహ స్పందన స్థితి

సెపేరషన్ స్టేజ్ –  వేరుపడిన స్థితి.

ఎక్సప్లోరేషన్ స్టేజ్ – అన్వేషణ స్థితి.

రి ఎంట్రి స్టేజ్  –  పున: ప్రవేష స్థితి

ఆస్ట్రల్ ట్రావెల్ కు ధ్యానం, అదీ కూడా పిరమిడ్ లో చేసే ధ్యానం అత్యుత్తమం.

37.  మనస్సును శూన్యంలో నిలిపే టెక్నిక్

Focussing Attention on the blank space of the mind

 

           

ధ్యానం చేస్తున్నప్పుడు ఏర్పడే ఒక బ్లాంక్ స్పేస్ ( శూన్య స్థలం)

మీద మన ధ్యాసను ఉంచాలి. సాధనలో ఆ శూన్య స్థలం స్థూల, సూక్ష్మ

శరీరాలను వేరు పరుస్తుంది.

          మనకు ధ్యాన చేసే సమయంలో వచ్చే ఒకానోక గొప్ప అనుభూతే

శూన్య స్థితి, ఆలోచన లేని స్థితి. ఆ శూన్య స్థితి మీద మీరు ఫోకస్ పెట్టాలి.

అప్పుడు ఆస్ట్రల్ బాడి రిలీజ్ అవుతుంది.

 

 

 

 

38. కార్లోస్ కాస్టనెడా స్టేజ్ .

          కార్లోస్ కాస్టనెడా ఈ పుస్తకాలను రాసారు. ప్రతి ఒక్కరు చదువాల్సిన

మంచి పుస్తకాలు ఇవి. తెలుగులో కాలచక్రం పుస్తకం అనువాదం అయ్యింది.

1)Teachings of Don Juan 

2)A Separate Reality 

3) Journey to Ixtlan

4) Tales of Power 

5) Second Ring of Power

6) The Eagle’s Gift 

7) The Fire from Within 

8) The Power of Silence

 9) The Art of Dreaming 

Magical Passes ,The Wheel of Time , The Active Side of Infinity           ఈ పుస్తకాల్లో ఆర్ట్ ఆఫ్ డ్రీమింగ్ అనే పుస్తకం పూర్తిగా కలలకు,

సూక్షశరీరానికి సంబంధించిన పుస్తకం. ఈ పుస్తకంలో వర్ణించిన ఒకానొక టెక్నిక్ ప్రకారం మన ఆస్ట్రల్ బాడి రిలీజ్ అయినప్పుడు ఆస్ట్రల్ గా కూడా

మన చేతి పైనున్న రేఖలను చూసుకోవాలి.  నిద్రపోవడానికి ముందుగానే

భౌతికంగా మీ చేతిరేఖలను జాగ్రత్తగా చూసుకోండి.ఏ రేఖ ఎలా ఉందో మైండ్ లో రిజిష్టర్ చేసుకోండి. తరువాత  నిద్రలో మీ ఆస్ట్రల్ బాడి రిలీజ్ అవుతుంది.

మీరు ఆస్ట్రల్ గా బయటకు వచ్చినప్పుడు , మీ ఆస్ట్రల్ బాడి చేతిరేఖలను

చూసుకోండి. మీ ఎరుక స్థాయిలు అత్యధ్బుతంగా పెరుగుతాయి.ఇలా మీ ఆస్ట్రల్ చేతి రేఖలను కూడా చూడడం సాధన చేస్తే మీ ఎరుక స్థాయి వెయ్యి

రెట్లు పెరుగుతుంది. అలాంటప్పుడు మీ ఆస్ట్రల్ ట్రావెల్ పూర్తి ఎరుక స్థితిలో

జరుగుతుంది.                   


          కార్లోస్ కాస్టనెడా ఈ టెక్నిక్ ను ఆర్ట్ ఆప్ డ్రీమింగ్ పుస్తకంలో వివరించారు. అలాగే అహాన్ని నశింప చేయడానికి ఎన్నో మార్గాలను కార్లోస్

కాస్టనెడా సూచించాడు. ‘కార్లోస్ కాస్టనెడా’కు చాలా ఇగో ఉండేది. ఆయన గురువు గారి పేరు ‘‘డాన్ జువాన్.’’ ఆయన దగ్గర కార్లోస్ శిశ్యరికం చేసేవాడు.

కార్లోస్ గుండు మీద రోజు డాన్ జువాన్ టాప్ టాప్ మని దెబ్బలు వేసేవాడు.

ఎందుకంటే కార్లోస్ చాలా అహంకారపూరిత వ్యక్తి. ఏది సరిగా నేర్చుకోకపోయేవాడు, ప్రతీది పునరావృతం చేసేవాడు. కార్లోస్ అహంకారాన్ని

బద్దలు కొట్టడానికి ఎన్నో మెథడ్స్ డాన్ జువాన్ ఉపయోగించేవాడు,చివరకు

ఒకసారి కార్లోస్ ను జైల్లో పెట్టడంతో సహా.

          మరోసారి పాత చినిగిన గుడ్డలతో ఒక దేవాలయం దగ్గర నెలరోజుల

పాటు బిచ్చగాడిగా అడుక్కుని తినమని పురమాయించాడు.బిచ్చగాడిగా ఉండడం అనేది, అహంకారం నాశనం చేయడానికి డాన్ జువాన్ ట్రైనింగ్ లో  అదొక టెక్నిక్.

39.పునర్జన్మ శ్వాస టెక్నిక్Rebirth breath Technique

పునర్జన్మ శ్వాస ప్రకియలో (రిబర్త్ బ్రెత్ టెక్నిక్) పాల్గొన్నప్పుడు

వారి ప్రాణమయ కోశంలో ఉండే బ్లాక్స్ అన్ని రిలీజ్ కాబడుతాయి.

ఈ పునర్జన్మ  బ్రెత్ టెక్నిక్ లో మీ ఊపిరితిత్తులను, శ్వాసను, గుండెను, సూక్షమైన మలిన పడ్డ నాడులను ఏదైతే  బ్లాక్ అయ్యిందో , అదంతా శుభ్రపడి మీ ఆస్ట్రల్ బాడి రిలీజ్ అవుతుంది.

          ఈ ప్రక్రియలో పాల్గొన్న తరువాత సెపరేషన్ స్టేజిలోకి వెళ్ళడం అనేది సునాయాసంగా జరుగుతుంది. ఎక్కువ టైం చేస్తే మరింత బాగా ఇది జరుగుతుంది. శవాసనం లో ఉండి, కనీసం 45 నిమిషాల పాటు బ్రెత్ వర్క్ చేసి, పూర్తి ఎరుకతో ఉండి అబ్సర్వ్ చేయండి , అప్పుడు ఆస్ట్రల్ బాడి రిలీజ్ అవుతుంది.


40. మొక్క,జంతువు, ఖనిజ స్థితులకు మారడం

Shape shifting  in to Animal,Plant,Mineral

         

మీరు , మీయొక్క ఆస్ట్రల్ బాడితో ఏ రూపాన్నైనా తీసుకోవచ్చు.

మీరు మొక్క,జంతువు,ఖనిజం తదితర దేనిరూపానికైనా మారడానికి

మీరు సంకల్పించినప్పుడు కూడా మీ ఆస్ట్రల్ బాడి రిలీజ్ కావడానికి దోహద పడుతుంది.. మని చైతన్యం అంతా వాటిల్లోకి షిప్ట్ అవుతుంది. షామనిజం క్లాస్లుల్లో ఈ పద్దతి గురించి చాల ఫోకస్ చేస్తాం.


(లార్డ్స్ ఆఫ్ ది రింగ్స్ సినిమా 3 వ భాగంలో నడిచే ప్రాణులుగా చెట్లను చూడవచ్చును.)

41. చెట్ల తొర్రలు, సోరంగాల గుండా ఆస్ట్రల్ ట్రావెల్

Journey through Tree Holes or Tunnels

  


చెట్టు తొర్రలను, గుహలను, టన్నెల్స్ ను షామన్స్ చాలా పవిత్రంగాచూస్తారు. ఎందుకంటే ఒక మర్రిచెట్టు తొర్ర ఉంటే అది వారి దృష్టిలో అది ఇతర ఆస్ట్రల్ ప్రపంచాలకు వెళ్ళే చాల పెద్ద స్వాగత ద్వారం. ఇలాంటి వాటిని ఉపయోగించుకుని వారు చక్కగా ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తుంటారు.

చెట్ల తొర్రలు, గుహల గుండా ఆస్ట్రల్ ప్రొజెక్ట్ లో భాగంగా ఒక చెట్టు తొర్రను వీజువలైజ్ చేస్తాం. నెమ్మదిగా ఆ తొర్రలోనుండి అవతలి వైపుకు వెళుతాము. అలా ఆ చెట్టు తొర్రలోనుండి అవతలి వైపుకు వెళ్ళినప్పడు మీరు మరొక అస్ట్రల్  డైమెన్షన్ గుండా  వెళుతారు.

          మన భూమి మీద కూడా కొన్ని శక్తి కేంద్రాలు ఉన్నాయి. ఆస్ట్రల్ ట్రావెల్ కు కూడా ఆ ఎనర్జీ పొర్టల్స్ ఉపయోగిస్తుంటారు.

 ఉదాహరణకు హిమాలయ పర్వతాలు అనేవి సహస్రారానికి ముఖ్య కేంద్రం. అక్కడ ఉన్నకైలాస పర్వతం సహస్రారానికి రాజధాని లాంటిది. సహస్రారం అనే స్థితికి ప్రతీక కైలాస పర్వతం. రుషికేష్,బధ్రినాధ్,కేదార్ నాధ్ తదితర ఎనర్జీ సెంటర్స్ ఆ చుట్టుపక్కలే ఉన్నాయి.

  

అమెరికాలోని  సల్ఫర్ స్రింగ్స్ అనే సిటి కూడా ఎనర్జీ సెంటర్. 

 

 అలాగే అమెరికాలోని కాలిఫోర్నియా దగ్గర మౌంట్ శస్తా మూలాధార చక్రానికి ప్రతీక అయిన ఎనర్జీ సెంటర్.

 

          అలా ఈ భూమి మీద ఎన్నో ప్రదేశాల్లో ఎన్నో ఎనర్జీ పోర్టల్స్ ఉన్నాయి. అలాగే వికారాబాద్ దగ్గర లోని అనంత గిరి హిల్స్ లో పద్మనాభ టెంపుల్ , అనంత మార్కండేయ స్వామి గుహ ఉన్నాయి.


అనంతగిరి హిల్స్ అందరు సందర్శించాల్సిన పవర్ స్పాట్ అది. అక్కడ ఒక

గుహలో ప్రాచీన కాలంలో మార్కండేయ మహర్షి వారు పద్నాలుగు వేల

సంవత్సరాలు తపస్సు చేసాడు. ఒక గొప్ప ఎనర్జి సెంటర్ అది. ఆ గుహలో ఎంతో గొప్ప వైబ్రేషన్స్ వస్తాయి.అక్కడికి సోల్ కోచ్ ప్రొగ్రాం లో అందరం వెళ్ళాం, అక్కడ ఒకరి బర్తడ్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం.(లోక్ నాద్ ది )

          అలాంటి ఎనర్జీ సెంటర్స్ లలో ధ్యానం చేస్తే వెంటనే ఆస్ట్రల్ కదలికలు

వస్తాయి. శరీరం వైబ్రేట్ అయ్య గిర్రున తిరుగుతుంది.

42. సమాధి రొటేషన్ టాంక్.    

          ఇది ఒక కొత్తతరం పరికరం. హెమి సింక్రనైజేషన్ ఆడియో టెక్నిక్ మాదరిగా ఇది కూడా ఒక నూతన తరం పరికరం .

ఈ పరికరంలో ఒక టాంక్ నిండా నీళ్ళు ఉంటాయి. ఈ నీళ్ళల్లో ‘‘ఎక్సం సాల్ట్ ’’వేస్తారు. లైట్లన్ని ఆపేస్తారు కాబట్టి లోపల చీకటిగా ఉంటుంది.


          అలాగే ఒక హెవి హెమి సింక్ బైనారల్ టెక్నాలజి  బీట్స్ తో సింక్రనైజ్ అయ్యి ఇది డిజైన్ చేయబడి ఉంటుంది. దీంట్లో గడిపిన వారికి ఒక గంటలో వారి ఆస్ట్రల్ బాడి బయటకు వచ్చేస్తుంది. దీన్నే సమాధి రొటేషన్ టాంక్

అంటాం. అంటే సమాధి లాంటి స్థితి. దీంట్లో ఉంటే తీటా, డెల్టా స్థితి వస్తుందన్న మాట. మన లైఫ్ యునివర్సిటికి కూడా ఇది తొందరలోనే వస్తుంది..అది వచ్చిన తరువాత చాలమంది ఈ అనుభూతిని పొందగలుగుతారు.దీంట్లో బయట శబ్ధాలు ఏమి వినపడవు.ఈ చాంబర్లోకి వెళ్ళిన తరువాత తల్లి గర్భంలో ఉండే స్థితిని గుర్తుకు తెస్తుంది. చాల అత్యధ్బుతమైన పరికరం ఇది.

         

          సాదారణంగా జోర్డాన్ దగ్గర ఉన్న‘‘ డెడ్ సి ’’ గురించి అందరికి తెలిసే

ఉంటుంది. ఆ డెడ్ సీ నీళ్ళల్లో ఎవరు మునగరు. ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలని దాంట్లో దూకిన కూడా , మునగకుండా ఆ నీళ్ళల్లో తేలి ఆడుతుంటారు. ఎందుకంటే ఆ డెడ్ సీ లో ఉన్న నీళ్ళల్లో ఉప్పు శాతం చాలా అత్యధికం కాబట్టి. హై డెన్సిటి సాల్ట్ వాటర్ ఇందులో ఉంటుంది.

నేను , లక్ష్మీగారు(న్యూటన్ గారి శ్రీమతి)ఒకసారి జోర్డాన్ , డెడ్ సీ కు వెళ్ళాం. అదంతా జీసస్ క్రైస్ట్ తిరిగిన ప్రదేశం.

          ఆ డెడ్ సీ నీళ్ళల్లో రెండు మూడు గంటల పాటు ఉన్న కూడా , ఆ నీళ్ళల్లో మునగలేదు.ఆ సముద్రంలో ఎంత లోతుకు వెళ్ళిన కూడా మునగలేం..నీళ్ళపైన తేలుతూనే ఉంటాం.

 

 

 

43. ఫోకస్ 10-  రాబర్ట్ మన్రో టెక్నిక్.

        రాబర్ట్ మన్రో అనే ఈ ఆధ్యాత్మక సైంటిస్ట్ ఆస్ట్రల్ ట్రావెల్స్ మీద చక్కటి

పరిశోధన చేసారు. ఆయన చాల శాస్థ్రీయంగా ఈ ఆస్ట్రల్ ట్రావెల్స్ మీద నిఖ్ఖచ్చి అయిన ప్రయోగాలతో చాలా అధ్బుతమైన  పరిశోధనలు చేసారు.

ఈ రిసెర్చిలో ఎన్నో ప్రయోగాలు అవి నిజమేనా కాదా అని నిజ నిర్ధారణచేసి మరీ నిగ్గు తేల్చారు. మన్రో గారు టార్గెట్స్ పెట్టి మరీ పరిశోధించారు.

          ఉదా.ఒక స్థలం నుండి మరొక ప్రత్యేక ప్రదేశానికి ఆస్ట్రల్ శరీరంతో వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసి తిరిగి రావాలి. తిరిగి భౌతిక శరీరంతో అదే స్థలానికి వెళ్ళి వారు ఆస్ట్రల్ గా చూసింది నిజమేనా కాదా అని డబుల్ వెరిఫికేషన్ తో చెక్ చేసుకోవాలి.

          అలాగే గ్రూప్ ఆస్ట్రల్ ట్రావెల్ అనేది మరో ప్రయోగం. ఈప్రయోగం ఒకే

సారి పదిమంది కలిసి ఆస్ట్రల్ గా ట్రావెల్ కావాలి. ఒక నిర్ధారిత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఎంత మంది ఉన్నారు, ఏం చేస్తున్నారనేది చెక్ చేసుకుని రావాలి.

తిరిగి ప్రాక్టికల్ గా చెక్ చేసుకుని రావడం కాని, ఫోన్ చేసి క్లియర్ గా కనుక్కోవడం కాని చేయాలి.

          రాబర్ట్ మన్రో గారు డిఫరెంట్ ప్లేసుల వెళ్ళి చెక్ చేసి రావడం లాంటి ఎన్నో ప్రయోగాలు సైంటిఫిక్ గా చేసారు.వారి అనుభవాలన్నింటిని మూడు పుస్తకాలుగా రాసారు.(Far journeys, Journeys Out Of Body, Ultimate Journey)

ఈపుస్తకాలు అందరు చదవాలి. చదువుతుంటే మనకు అనుభవాలు కలుగుతాయి దాంతో పాటు ఎంతో ఇన్ స్పిరేషన్ మనకు వస్తుంది.

          రాబర్ట్ మన్రో గారు చెప్పిన  ఈ టెక్నిక్ లో ఆయన డిఫరెంట్ స్టేజెస్

ను వర్ణించి చెప్పారు. ఫోకస్ 10,11,12,13,14,15, ఇలా.

మన్రోగారు ముందుగా చెప్పిన పాయింట్  ఫోకస్ 10 అన్నారు.

ఈ టెక్నిక్ లో  మనస్సు మెలుకవగా ఉంటుంది,శరీరం నిద్రపోయే స్థితి

(Mind Awake/Body  Asleep) శరీరం బాగా నిద్రలోకి వెళ్ళిపోతుంది.

ఎంతో గాడమైన విశ్రాంతి స్థితిలో నిద్రలోకి వెళుతుంది. కాని మనస్సు మాత్రం

మెళుకువగా ఉంటుంది. మాములుగా అయితే శరీరం నిద్రపోతే మనసు కూడా నిద్రపోతుంది. కాని ఇక్కడ మాత్రం శరీరం గాఢంగా నిద్రపోతుంది. మనస్సును మాత్రం చాలా అలర్టుగా మెలుకవగా పెట్టుకోవాలి.

దీనిని ఫోకస్ 10 అన్నారు. ఈ పోకస్ 10 స్టేజికి చేరుకున్న వారికి

ఆస్ట్రల్ బాడి విడిపడడం జరుగుతుంది. మన్రోగారు ఒక వేయిమందికి పైననే ఈ రిసెర్చిప్రాక్టీస్ పెట్టారు. ఆయన పుస్తకంలో ఇది ప్రచురించారు.

ఫోకస్ 12లో State of expanded awareness  స్టేజిలో ఇంకా లోతైన స్థితి.

పోకస్ 15లో State of no time గురించి వివరించారు. అక్కడ టైం అనేది

లేకుండా డిసాల్వ్ అయిపోవడం. టై బారియర్స్ ను ఒవర్ కం చేయడం.

కాలం అని లేని స్థితిని చేరుకోవడాన్ని ఫోకస్ 15 అన్నారు.

ఫోకస్ 21 .On the very edge of perception of the time/space continuum.

ఇది మరింత హైయెస్ట్ స్టేజి . టైం అండ్ స్పేస్ లిమిట్స్ దాటి వెళ్ళి, వేరే ఎనర్జీ

సిస్టంను టచ్ చేయడం జరుగుతుంది. అప్పుడు చాలమందికి వేరే  గాలక్టిక్ మాష్టర్స్ ను కలవడం,  వేరే యునివర్స్ ను చూడడం జరిగింది.

          మీరు తెలుగులో వచ్చిన ‘‘వర్ణ ’’ సినిమా చూసి ఉంటే, ఆ సినిమాను

రూపోందించిన దర్శకుడు ఆధ్యాత్మికతను అధ్యయనం చేసిన మాష్టర్ ఆయన.(దర్శకుడు- సెల్వ రాఘవన్, నిర్మాత – ప్రసాద్ పొట్లూరి గారి పూర్తి ప్రోత్సాహంతో ఈ సినిమా తీసాడు) సమాంతర విశ్వాలు, సమయాల గురించి ఎంతో పరిశోధించి తీసిన సినిమా అది. ప్రతి ఒక్కరు చూడతగిన అధ్భుతమైన సినిమా అది.

 

          రాబర్ట్ మన్రోగారి 21వ స్టేజికి చేరుకున్నప్పడు వేరే యునివర్స్ ల వారిని టచ్ చేయడం జరుగుతుంది. మన లాంటి సమాంతర వ్యక్తులు ,

సమాంతర విశ్వాలను అప్పుడు టచ్ చేయగలగుతారు. కోటానుకోట్ల విశ్వాలు

ఉన్నాయి.వాటిని కాంటాక్ట్ చేయగలుగుతాము. ఆయన పరిశోధనలన్ని అల్టిమేట్ జర్ని అనే పుస్తకంలో ఎక్కువగా వర్ణించారు.

          ఈ స్టేజికి చేరినప్పుడు ఇతర విశ్వాల హైయర్స్ మాష్టర్స్ , ప్లైడియన్స్, అర్కుటిరియన్స్,అండ్రోమీడన్స్ మెసేజెస్ అందుకోవడం జరుగుతుంది.

          మన చైతన్య స్థాయిలను విస్తరించుకున్న కొద్ది , తద్వారా వచ్చే అనుభవాల తాలుకు అనుభూతుల్లోని గాఢత పెరుగుతుంది. అనుభవాల క్వాలిటి పెరుగుతుంది.

          రాబర్ట్ మన్రోగారు ఎంత చక్కటి వర్క్ చేసారంటే రాబోయే భవిష్యత్తు

తరాలకు వడ్డించిన విస్తరి మాదిరిగా అంతా పరిశోధన చేసి పెట్టారు.రాబర్ట్ మన్రో గారు రాసిన ‘‘జర్నీస్ ఔట్ ఆఫ్ ది బాడి ’’ తప్పని సరిగా చదవాలి.అది

చదివినప్పుడు మనకు సాదారణంగా ఉండే ఎన్నో మిస్ అండర్ స్టాండింగ్స్ భ్రమలు, దురభిప్రాయాలు మాయమవుతాయి. మన్రో పుస్తకాలు చదివితే ఆస్ట్రల్ ట్రావెల్ ఇంత సులభమా , చాల కష్టం అనకున్నానే అని కూడా అనిపిస్తుంది. ఆస్ట్రల్ ట్రావెల్ నిజంగానే మరి ఎంతో సులభం .

  

         గొప్ప మాష్టర్స్ రాసిన పుస్తకాలు చదివినప్పుడల్లా (స్వాధ్యాయం)

ఆ మాష్టర్స్ ఎనర్జీ, వైబ్రేషన్ మనకు ట్రాన్సఫర్ అవుతుంది.

          నేను లోబ్ సాంగ్ రాంపా గారు రాసిన దాదాపు 25 పుస్తకాల్లో , 18పుస్తకాలు చదివాను. పదిహేనళ్ళ క్రితం రంపా గారి పుస్తకాలకే ఒక ప్రత్యేకమైన సమయం 40 రోజుల పాటు కేటాయించి చదివాను. రంపా గారు చెప్పిన ప్రతి పాయింట్ ను శ్రధ్ధగా , క్షుణ్ణంగా అధ్యయనం చేసాను. అవి చదివినన్ని రోజులు అధ్బుతమైన ఆస్ట్రల్ అనుభవాలే.

ఆ మాష్టర్ ఆస్ట్రల్ ట్రావెల్ గురించి చెప్పడానికే పుట్టారు.యు ఫరెవర్, థర్టీన్త్ కాండిల్, థర్డ్ ఐ, డాక్టర్ ఫ్రం లాసా, కేవ్ ఆఫ్ ది ఆసియంట్స్  ఇలా ఎన్నో పుస్తకాల్లో ఆస్ట్రల్ ట్రావెల్ గురించి అధ్బుతంగా వివరించారు. 

 

 

 

 

    ఈ క్లాసు ముగిసిన తరువాత చివరకు సాధకులు రమణ మహర్షిగారి ప్రిటెండింగ్ డెత్ టెక్నిక్ ప్రాక్టికల్ సాధన మొదలుపెట్టారు. సెషన్ ముగిసిన తరువాత సాధకులు కొందరు తమ అనుభవాలను చెప్పారు.అనంతరం క్లాసు ముగిసింది.

          ఈ పుస్తకంలో మీరు ఇప్పటి వరకు చదివింది వీడియోగా

చూడాలంటే యుట్యూబ్ లో ఈ పేరుతో వెదకండి.

SCTP4 ‘Astral Travel’ by Dr Newton Kondaveti Part 01 to  05

 

ఈ క్లాసు వీడియో 5 భాగాలుగా యుట్యూబ్ లో చూడవచ్చును.

 

         చదివే పాఠకుల సౌలభ్యం కోసం, చదివితేనే మరింత సులభంగా అర్థం అవుతుందనే ఉద్ధేశ్యంతో పైవీడియో క్లాసును సులభమైన తెలుగుతో ఈ పుస్తకంగా రూపొందించడం జరిగింది. పుస్తకంలో మద్యమద్యలో వచ్చే ( ) బ్రాకెట్ మద్యలో ఉన్న విషయాలు డా.న్యూటన్ గారు ఉపన్యాసంలో చెప్పిన విషయాలకు ఈ పుస్తకాన్ని సమకూర్చిన రవిందర్ గారి అదనపు వివరణ అని మాత్రమే గమనించగలరు.-రవీందర్.

Author: